వన్ ప్లస్ ఎక్స్ మొబైల్స్ ని పంపిణీ చేయబోతున్న ఓలా క్యాబ్స్

డిసెంబర్ 09, 2015 12:51 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఇండియాలోని ట్యాక్సీ పరిశ్రమల లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఓలా క్యాబ్స్, ఇప్పుడు దేశం యొక్క ప్రత్యేక మరియు అతివేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ ఎక్స్ తో జత కట్టింది. ఈ టై-అప్ వినియోగదారులకి ఒక విప్లవాత్మక కొనుగోలు అనుభవాన్ని అందించటానికి చేయబడింది. ఇందులో భాగంగా మీ ఆహ్వానాలపై క్యాబ్ ఆపరేటర్లు ఫోన్ ని మీ ఇంటిదగ్గరికి పంపిణీ చేసే అవకాశం కల్పించబడినది. ముఖ్యంగా క్యాష్ ఆన్ డెలివరి సదుపాయాన్ని అందుబాటులోకి తేవడంజరిగింది.

వన్ ప్లస్ ఎక్స్  మార్కెటింగ్ హెడ్ (ఇండియా) కరన్ సారిన్ మాట్లాడుతూ ," ప్రజలు మా ఉత్పత్తులను ప్రేమిస్తారు మరియు మా అభిమానుల అనుభవాన్ని మెరుగుపరుస్తూ వారికి మరింత సౌకర్యాన్ని కలిపించే విధంగా వన్ ప్లస్ మొబైల్ ఉంటుందని అన్నారు.

ఇది ఎలా పని చేస్తుంది?

ఈ మొబైల్ ప్రత్యేకంగా అమెజాన్.ఇన్ లో అందుబాటులో ఉంటుంది మరియు పోయిన నెలలో చైనా మానుఫ్యాక్చురర్  చే లాంచ్ చేయబడిన వన్ ప్లస్ ఎక్స్ కేవలం ఆహ్వానం పై మాత్రమే అందుబాటులో ఉంటుంది. వన్ ప్లస్ ఎక్స్ ధరను రూ. 16999 గా నిర్ణయించారు. ఫీచర్స్ లో 5.0 అంగుళాల AMOLED కెపాసిటివ్ టచ్ స్క్రీన్, కార్నింగ్ గోరీల్లా గ్లాస్ ౩ ని అందించారు. స్క్రీన్ డిస్‌ప్లే పూర్తిగా 1080x1920 పిక్సల్ స్పష్టత ని కలిగి ఉంటుంది. దీనిలోనే  2.3GHz
క్రైట్ 400అడ్రినొ330 తో  కూడిన లేటెస్ట్ ఆండ్రాయిడ్ 5.1 లాలిపోప్ ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్-కోర్ క్వాల్‌కామ్ స్న్యాప్ డ్ర్యాగన్ 801 ప్రోసెసర్ ,౩GB ర్యామ్ వంటి విశిష్టతలు కలవు.ఈ మొబైల్ ప్రామాణిక 16GB అంతర్నిర్మిత మెమరీ తో వస్తుంది. దీనిని అదనంగా 128GB వరకు విస్తరీంచే అవకాశం ఉంది. ఇతర ఫీచర్స్ లో 2525 mah బ్యాటరీ ,8 మెగాపిక్సల్ ఫ్రంట్ మరియు 13 మెగాపిక్సల్ రియర్ కెమెరాను అమర్చారు.

ఓలా వైస్-ప్రెసిడెంట్ మార్కెటింగ్ ,సుదర్శన్ గంగ్రాదే మాట్లాడుతూ," మేము మా వినియోగదారుల యొక్క అపూర్వమైన ,ప్రత్యేకమైన అనుభవాలను కొనసాగిస్తూ, ఓలా ఆప్ ద్వారా తమకు నచ్చిన మొబైల్ ని కొనుక్కునే  అవకాశాన్ని మరియు నిమిషాలలో దానిని డెలివరీ చేసే సౌకర్యాన్ని కలిగిస్తున్నాము." అని తెలిపారు.

ఈ మొబైల్ రేపటి నుండి అందుబాటులో ఉంటుంది.ముందు తెలిపిన విధంగా 15 నిమిషాలలోపు మొబైల్ మీ ఇంటి వద్ద డెలివరీ చేయబడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ ని పొందుటకు వినియోగదారులు తమ ఓలాక్యాబ్స్ ఆప్ లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల మధ్యలో వన్ ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటు రైడ్ నౌ ఆప్షన్ ని నొక్కి తమ సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

ఒకసారి మీరు ఆర్డర్ ఇచ్చిన తరువాత ఒక క్యాబ్ మే ఇంటి వద్దకు వచ్చి రూ.16,999 ని కార్డ్ రూపంలో గాని ,క్యాష్ రూపంలో గాని తీసుకుంటుంది.అయితే ఈ క్యాచ్ ఈ విభాగంలో దేశంలో మొదటిసారి ప్రవేశపెట్టబడింది కాబట్టి ఈ కింద తెలిపిన నగరాలలో మాత్రమే అందుబాటులో ఉంది.

కోల్‌కతా

ఢిల్లీ

అహ్మదాబాద్

ముంబై

పూణే

బెంగళూరు

హైదరాబాద్

ఇవి కూడా చదవండి:

ఓలా వారు ఫెర్రీల సహాయంతో చెన్నైలోని బాధితులకి సహాయం అందిస్తున్నారు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience