Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

కొత్త అపోల్లో 4జీ టైర్ లక్ష కిలోమీటర్ల కంటే ఎక్కువ నడుస్తుంది

జూలై 23, 2015 01:36 pm nabeel ద్వారా ప్రచురించబడింది

జైపూర్:భారతదేశంలో మార్కెట్ డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని లక్ష కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిచే కొత్త టైర్లను అపోల్లో టైర్స్ వారు తీసుకువచ్చారు. అమేజర్ 4జీ టైర్ ని చెన్నై మరియూ నెదర్ల్యాండ్స్ కి చెందిన గ్లోబల్ ఆర్డీ వారి జాయింట్ వెంచరుతో అభివృద్ది చేశారు. పంక్చర్లు మరియూ కట్స్ ని నివారించడానికి 6 పొరల సురక్షణతో మరియూ కొత్త ట్రెడ్ కంపౌండ్ తో ఈ టైర్ డిజైన్ చేయబడి ఉంది. ఇదే టైర్ యొక్క కాలాన్ని 1,00,000 కీ.మీ లకు పెంచింది.

ఒక ప్రకటనలో అపోలో టైర్స్ యొక్క ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ కి అధ్యక్షుడు అయిన సతీష్ శర్మ మాట్లాడుతూ, "గత 2-3 సంవత్సరాల కాలంలో మా అంతర్గత టీం వారు మార్కెట్లో గల టైర్ల మీద చేసిన సుదీర్ఘ అధ్యయనం ఫలితమే ఈ టైరు. వినియోగదారుల స్పందన నుండి మరియూ టైర్ల ఉత్పత్తుల్లో ఉన్న లోపాలని దృష్టిలో ఉంచుకుని మా ఆర్డీ టీం వారు నూతన సాంకేతికతతో ఈ కొత్త టైర్ ని రూపకల్పన చేశారు. ఇది ముఖ్యంగా భారతీయ రోడ్లపై ఎక్కువ కాలం మన్నగలిగే విధంగా చేయబడింది. మా ఈ సమగ్ర కౄషి ఫలితంగానే ఈ టైర్ కి లక్ష కిలోమీటర్ల కంటే ఎక్కువ మన్నగలిగే సామర్ధ్యం చేకూరింది", అని తెలిపారు.

గత సంవత్సరం కంటే ఈ భారతీయ ప్యసెంజర్ కారు 6.17% ఎదుగుదలను చూసింది. ఈ ఉత్పత్తి ప్రత్యేకంగా ధరను దృష్టిలో పెట్టుకునే భారతీయుల కోసం తయారు చేసినట్టుగా ఉంది ఎందుకంటే, ఎక్కువ శాతం మార్పులు కారు వినియోగంలో ఖర్చు తగ్గిచే విధంగా తయారు చేయడం జరిగింది కాబట్టి.

n
ద్వారా ప్రచురించబడినది

nabeel

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.1.36 - 2 సి ఆర్*
ఫేస్లిఫ్ట్
Rs.7.51 - 13.04 లక్షలు*
Rs.43.81 - 54.65 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర