2016 లో రానున్న అత్యంత ఎదురుచూస్తున్న కార్లు

డిసెంబర్ 24, 2015 09:45 am raunak ద్వారా ప్రచురించబడింది

న్యూ డిల్లీ:

రానున్న ఫిబ్రవరిలో బహిర్గతం కానున్న మరియు త్వరలో 2018 ఆటో ఎక్స్పో వరకూ ప్రవేశపెట్టబడుతున్న కార్ల వివరాలు!

వచ్చే సంవత్సరం అద్భుతమైన ప్రదర్శనలతో అనేకమైన కార్లు 2016 ఇండియన్ ఆటో ఎక్స్పో లో ఫిబ్రవరిలో ప్రదర్శింపబడబోతున్నాయి. అనేక వివరాల కొరకు, ప్రదర్శనల కొరకు మరియు రాబోతున్న కార్ల శ్రేణి గురించి తెలుసుకునేందుకు సంసిద్ధంగా ఉండండి.

మారుతి సుజుకి YBA

ప్రారంభం: 2016 భారత ఆటో ఎక్స్పో (ఊహించినది)

దేశీయంగా అత్యధిక వాహనాలను తయారుచెసే సంస్థ మారుతి సుజికి సబ్-4m SUV విభాగంలోని తమ రాబోయే YBA( కోడ్ పేరు) ను ప్రవేశపెట్టనున్నారు. ఈ చిన్న SUV దాని యొక్క డిజైన్ ను XA-ఆల్ఫా కాన్సెప్ట్ ద్వారా పొంది ప్రదర్శింపబడబోతోంది. ఇది 2012 ఆటో ఎక్స్పో లో తొలిసారి బహిర్గతం అయ్యింది. ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ ఎంపికల విషయానికి వస్తే ఈ YBA DDiS200 సియాజ్ వారి ఒక రకమైన హైబ్రిడ్ అని చెప్పవచ్చు. ఇక పెట్రోల్ విభాగంలో 1.2 లీటర్ యూనిట్ బాలెనో/స్విట్ నుండి పొంది, 5 స్పీడ్ MT ప్రామాణికంగా కలిగి ఉండబోతోంది మరియు CVT 1.2 లీటర్ పెట్రోల్ కలిగి బాలెనో తో సమానంగా ఉండబోతోంది.

ఇంకా చదవండి 

టయోటా ఇన్నోవా మరియు వయోస్


ప్రవేశం: 2016 భారత ఆటో ఎక్స్పో (అంచనా)

ప్రఖ్యాత ఇన్నోవా తమ యొక్క రెండవ తరం కారుని వచ్చే సంవత్సరం దాదాపుగా 10 సంవత్సరాల వ్యవధి తరువాత ప్రదర్శింపబోతోంది. టొయోటా వారు 2016 ఆటో ఎక్స్పోలో ఇన్నోవా గురించి ఎటువంటి ప్రకటన చేయనప్పట్టికీ ప్రస్తుత పరిణామాల బట్టి ఇది ప్రదర్శింపబడబోతోంది అని నమ్మవచ్చు. ఈ రెండవ తరం ఇన్నోవా తమ యొక్క ప్రపంచ ప్రీమియర్ ని చేసింది. ఇలా ఇన్నోవా కాకుండా టొయోటా వారు ప్రదర్శింపబోతున్న ఇంకొక కారు వయోస్. ఇది ఇటీవలే అనధికారికంగా కనబడి వచ్చే సంవత్సరం ఆటో ఎక్స్పోలో ప్రదర్శనకు ఉండబోతోందని ఆశిస్తున్నారు.

ఫోర్డ్ ఎండీవర్

ప్రారంభం: జనవరి 19 (నివేదించారు)

ఈ 2016 ఎండీవర్ ఒక పూర్తి విభిన్నమైన కారుగా మన ముందుకు రాబోతున్నది. ఇందులో మునుపటి మోడల్ లో ఉన్నటువంటి అన్ని లక్షణాలను కలిగి టెక్నాలజీ పరంగా మరియు లగ్జరీ లక్షణాలతో నవీకరించబడి ఉంది. ఫోర్డ్ వారు ఈ ఎండీవర్ ను ఈ దశకం తొలినాళ్ళలో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి దాదాపుగా 10 సంవత్సరాలు భారతదేశంలో అమంచి ప్రజాధరణ పొందిది. ఇప్పుడు 2016 లో రాబోతున్న ఈ మోడల్ ఈ శ్రేణి లోని అనేక తొలి నవీకరణలను నిండుగా కలిగి ఉండబోతోంది. ఉదాహరణకు తొలి టెరైన్ మేనేజ్మెంట్ వ్యవస్థ మరియు మరింత శక్తివంతమైన 5 సిలిండర్ డీజిల్ సామర్ధ్యం 6-స్పీడ్ AT తో కలిగి ఉండబోతోంది. ఈ ఎండీవర్ తమ యొక్క ఇతర పోటీదారుల కన్నా ఎన్నో విషయాలలో ముండుండే విధంగా మన ముందుకు రాబోతోంది. ఈ వాహనం జనవరి 19 న భారతదేశంలో తొలి ప్రదర్శన చేసుకోబోతోంది. మేము ఈ వాహనాన్ని థాయిల్యాండ్ లో నడిపిన విశేషాలను చదవండి

టాటా జైకా సెడాన్, హెక్సా మరియు నెక్సాన్

ప్రవేశం: 2016 భారత ఆటో ఎక్స్పో (అంచనా)

భారతదేశం యొక్క తొలి సబ్-4m చిన్న సెడాన్ అయిన ఇండిగో CS తమ యొక్క తొలి పెద్ద అడుగు వచ్చే సంవత్సరం తమ యొక్క జైకా కాంపాక్ట్ సెడాన్ ద్వారా తీసుకోబోతున్నారు. టాటా వారు తమ యొక్క ఈ కొత్త జైకా ద్వారా శాస్త్రీయంగా ఇండికాను భర్తీ చేయబోతున్నారు. ఈ రెండు వాహనాలు ఏ విధమైనటువంటి అనుకరణలను తమ పూర్వ వాహనాలతో కలిగి ఉండబోవట్లేదు, ఉదాహరణకు టాటా ఇన్సిగ్నియా. టాటా వారి ప్రకారం జైకా చిహ్నం వారి యొక్క 3D రూపంలో కనపడబోతోంది. ఈ సెడాన్ అనేక లక్షణాలు మరియు ఇంజిన్ సామర్ధ్యం తమ యొక్క హ్యాచ్‌బ్యాక్ వాహనంతో పోలి ఉండబోతోంది.

ఇక కొత్త క్రాసోవర్ల గురించి చెప్పాలంటే, టాటా వారు తమ యొక్క ఉత్పత్తి కార్లలోని హెక్సా క్రాసోవర్ వెర్షన్ ను పరిచయం లేదా ప్రదర్శితం చేయబోతున్నారు. ఈ కారు 2015 జెనీవా మోటార్ షో లో తొలిసారి ప్రదర్శితం అయ్యింది. ఇక నెక్సాన్ కాంపాక్ట్ SUV కాన్సెప్ట్ కారు కూడా 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శితం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ కారు ఇటీవల అనధికారంగా చాలా సార్లు ప్రదర్శితం అయ్యింది.

హోండా బిఆర్-V

ప్రవేశం: 2016 భారత ఆటో ఎక్స్పో (అంచనా)

హ్యుందాయి క్రెటా కి ధీటుగా హోండా వారు ప్రవేశపెడుతున్న 7-సీటర్ల వాహనం BR-V. ఈ క్రాసోవర్ వాహనం మొబిలియో నుండి ప్రేరణ పొందినప్పటికీ దాని యొక్క విశిష్ట లక్షణాలను కలిగి ఉంటుంది. కారు అంతర్గత రూపురేఖలు సిటీ మరియు జాజ్ నుండి ప్రేరణ పొంది ఉన్నాయి. ఇక బాహ్య రూపానికి వస్తే ఇది ఒక గ్లోబల్ శూవ్ లక్షణాలు కలిగిన ఒక హోండా కారుగా కనిపిస్తుంది. ఇంజిన్ సామర్ధ్యం నేరుగా సిటీ 1.5 లీటర్ i-VTECమరియు 1.5 లీటర్ i-DTEC సామర్ధ్యం కలిగి ఉంటుంది. ట్రాన్స్మిషన్ సామర్ధ్యానికి వస్తే ఇది ఒక 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సామర్ధ్యం ప్రామాణికంగా కలిగి ఉంటుంది మరియు పెట్రోల్ విభాగంలో అధనపు CVT ఎంపికను కూడా కలిగి ఉంటుంది. ఇటీవలే మేము ఈ BR-V ని జపాన్ లో నడిపిన విశేషాలను http://telugu.cardekho.com/car-news/Honda BR-V - First Look-16978 మరియు చిత్రాలను http://telugu.cardekho.com/car-news/Honda BR-V Picture Gallery - Exclusive From Japan-16858 హోండా BR-V వారి గ్యాలరీ ద్వారా చూడండి

VW కాంపాక్ట్ సెడాన్

ప్రవేశం: 2016 భారత ఆటో ఎక్స్పో (రివీల్డ్)

ప్రతీ ఒక్కరు ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ మాత్రమే ఈ సంవత్సరపు చివరి ప్రవేశం అనుకున్నప్పటికీ వోక్స్వేగన్ వారు అందుకు భిన్నంగా ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం తమ యొక్క కాంపాక్ట్ సెడాన్ తో ముందుకు వచ్చారు. ఇది పోలో లేదా వెంటో మోడళ్ళకు ప్రేరణ వాహనం అని చెప్పవచ్చు. ఈ సంస్థ ఇటీవలే చెప్పిన ఒక ప్రకటన ప్రకారం వీరు ఈ వాహన అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన పెట్టుబడిని కేటాయించడం జరిగింది. మెకానికల్ గా ఈ వాహనం యొక్క ఇంజిన్ సామర్ధ్యం పోలో యొక్క హ్యాచ్బ్యాక్ ను పోలి ఉండబోతోంది మరియు డీజిల్ ఇంజిన్ విభాగంలో ఒక DSGఆటో ఎంపికను కలిగి ఉండబోతోంది. వెంటో లేదా రాపిడ్ ల యొక్క విజయం ఈ ప్రత్యేకతలకు ఒక కారణంగా చెప్పవచ్చు.

డాట్సన్ రెడి గో మరియు గో క్రాస్

ప్రారంభం: 2016 భారత ఆటో ఎక్స్పో (అంచనా)

డాట్సన్ వారు తమ యొక్క రెడీ గో యొక్క ఉత్పాదక శ్రేణి మోడల్ ను రాబోయే ఆటో ఎక్స్పోలో ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఆటో తయారీసంస్థ ఈ కారు యొక్క కాన్సెప్ట్ వెర్షన్ ను మునుపటి ఆటో ఎక్స్పో లో ప్రదర్శించడం జరిగింది. రెనో వారి క్విడ్ వాహనం లానే రెడీ గో కూడా తమ యొక్క రెనో - నిస్సాన్ అనుసంధాన ప్లాట్‌ఫార్మ్ అయిన CMF-A కోవలో ఉండబోతోంది. ఈ వాహనం యొక్క ఇంజిన్ సామర్ధ్యం రెనో క్విడ్ ని పోలి ఉండబోతోంది. రెడీ గో తో పాటూ ఈ తయారీసంస్థ తమ యొక్క క్రాస్ వెర్షన్ GO ను ప్రదర్శింపబోతున్నారు. ఇది ఇటీవల 2015 టోక్యో మోటార్ షో లో తమ తొలి ప్రపంచ ప్రదర్శనను చేస్తుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience