• English
  • Login / Register

బెంగుళూరులో కొత్త డీలర్ షిప్ ను ప్రారంభించిన మెర్సిడెస్ బెంజ్

జూన్ 19, 2015 11:30 am akshit ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఢిల్లీ: మెర్సెడెజ్-బెంజ్ ఇండియా నేడు బెంగళూరు, కర్నాటకలో అక్షయ మోటార్స్ పేరుతో ఒక కొత్త డీలర్ ప్రారంభించారు. దీనిని 4,350 చదరపు అడుగులలో నిర్మించారు. ఈ షోరూమ్ ని మెర్సెడెజ్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సి.ఇ.ఒ అయిన ఎబెర్హర్డ్ కెర్న్ మరియు అక్షయ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.పి శ్యామ్ ప్రారంభించారు. 

ఇది బెంగుళూరులో మెర్సిడెస్ బెంజ్ యొక్క మూడవ షోరూమ్ మరియు అక్షయ మోటార్స్ కి చెందిన రెండవ షోరూమ్. ఈ ప్రారంభోత్సవంతో, మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ల తయారీదారిగా కొనసాగుతూ 39 భారతీయ నగరాల్లో 73 కేంద్రాలతో అధిక సాంద్రత మరియు విశాలమైన డీలర్ నెట్వర్క్ వ్యాప్తి చేశారు. 

"దక్షిణ మార్కెట్లో బెంగుళూరు మెర్సిడెస్ బెంజ్ కి ఒక కీ మార్కెట్ లాంటిదని అలానే బెంగుళూరు లో ఉండే కొనుగోలుదారుల జీవన శైలికి అనుగుణంగా ఉండే వాహనాలని తయారు చేయడమే వారి ఉద్దేశ్యం" అని మెర్సెడెజ్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సి.ఇ.ఒ అయిన ఎబెర్హర్డ్ కెర్న్ అన్నారు. 

ఈ మెర్సిడెస్ షోరూం ను బెంగుళూరు లో ఉన్న 107/3, 80 ఫీట్ రోడ్డు, 4 వ బ్లాక్, కోరమంగల వద్ద దీనిని ప్రారంబించారు. ఈ షోరూం ను బెంగళూరు లో ఉన్న ఐటి పార్క్ కు మరియు ప్రీమియం విల్లాస్ సమీపంలో దీనిని ప్రారంబించారు. ఎందుకంటే, ఈ కస్టమర్ బేస్ ఆధారంగా కొత్త కస్టమర్ జాబితాను మరింత పెంచుకునేందుకై మరియు వినియోగదారులకు మా వంతు సేవ ను అందించడమే మా లక్ష్యమని అని అన్నారు అంతేకాకుండా, ఈ సంస్థ ను సమీపంలో పెట్టడానికి ఇదే కారణమని అన్నారు.

అక్షయ మోటార్స్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఎంపీ శ్యామ్, ఈ విధంగా వ్యాఖ్యానించారు: "మేము కోరమంగల వద్ద బెంగళూరు లో మా రెండవ షోరూమ్ ను ప్రారంభించటానికి చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. వ్యూహాత్మకంగా నగరం నడిబొడ్డున ఉన్న ఈ కొత్త షోరూమ్, మేము ఈ అంవృద్ది చెందిన మార్కెట్ లో పెరిగిన డిమాండ్ ఆధారంగా మేము నమ్మకంతో దీనిని ప్రారంబించాము అని అన్నారు. మేము, మా రెండవ షోరూమ్ ను మెర్సిడెస్ బెంజ్ యొక్క భాగస్వామ్యంతో విజయవంతం అయినందుకు మాకు చాల గర్వంగా ఉంది అన్నారు మరియు మేము "మా వినియోగదారులకు బ్రాండ్ ట్రస్ట్ ఒప్పందం పునరుద్ఘాటించింది అని వ్యాఖ్యానించారు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience