మిస్టర్ వివేక్ కామ్రా ని జేకే టైర్స్ ఇండియా కి అధ్యక్షుడిగా నియమించింది
జూన్ 05, 2015 02:10 pm sourabh ద్వారా సవరించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండ ి
జైపూర్: జేకే టైర్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు మిస్టర్ వివేక్ కామ్రా ని భారతీయ విభాగానికి అధ్యక్షుడిగా నియమించింది. మిస్టర్ అరుణ్ కే బజొరియా ని అంతర్జాతీయ కార్యకలాపాలకు డైరెక్టరు మరియూ అధ్యక్షుడిగా నియమించిన సందర్భంలో కామ్రా ని కూడా నియమించడం జరిగింది. ఇరవై సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న మిస్టర్ బజొరియా, జేకే టైర్స్ అంతర్జాతీయ కార్యకలాపాలతో పాటుగా జేకే టార్నెల్, మెక్సికో మరియూ ప్రత్యేక వ్యూహాత్మక అసైన్మెంట్లు కూడా చూసుకుంటారు.
మిస్టర్ వివేక్ కామ్రా ని స్వాగతిస్తూ, జేకే టైర్ కి చైర్మెన్ మరియూ మేనేజింగ్ డైరెక్టరు అయిన డా. రఘుపతి సింఘానియా మాట్లాడుతూ, 'మిస్టర్.కామ్రా గారు నాయకత్వాన్ని ధీటుగా నిర్వహిస్తారు అని మరియూ జేకే టైర్స్ ని ప్రగతి పథం వైపు తీసుకు వెళ్తారని నాకు గట్టి నమ్మకం ఉంది ' అని అన్నారు.
జేకే టైర్ లో చేరక మునుపు మిస్టర్. కామ్రా గారు సింగపూరు లో నాట్స్టీల్ హోల్డింగ్ పీటీఈ లిమిటెడ్ లో ప్రెసిడెంట్ మరియూ సీఈఓ గా చేసేవారు. 25 సంవత్సరాల ఘనమైన అనుభవంతో మిస్టర్ కామ్రా ఈ కంపెనీ ని ఎదుగుదల వైపు తీసుకువెళ్తారు. ఈయన అంతర్జాతీయ బిజినెస్ స్కూల్ అయిన ఇన్సియెడ్ లో బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. అంతే కాకుండా, ఐఐటీ ముంబైలో బీటెక్ డిగ్రీ పుచ్చుకున్నారు మరియూ జమ్షెడ్పూర్ లో ఎక్సెలారై నుండి బిజినెస్ మేనేజ్మెంట్ చేసారు.
జేకే టైర్స్ కి అంతర్జాతీయంగా ఆరు ఖండాలలోని వంద దేశాలలో తన ఉనికి ఉండగా, భారతదేశంలో ఆరు ప్లాంట్లు మరియూ మెక్సికోలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. ఈ తొమ్మిది ప్లాంట్లలో కంపెనీ యొక్క తయారీ సామర్ధ్యం సంవత్సరానికి 20 మిలియన్ టైర్లుగా ఉంది.
జేకే ఆర్గనైజేషన్లో భాగంగా, జేకే టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు ఫోర్ - వీలర్ తయారీలో భారతదేశంలో అగ్ర ఉత్పత్తిదారులుగా నిలవగా, మరెన్నో అనేక ఉత్పత్తులను అందిస్తూ ఫోర్-వీలర్స్ విభాగంలో ప్రపంచంలోని అగ్ర 25 ఉత్పత్తిదారులలో ఒకరిగా ఉన్నారు. జేకే టైర్స్ ని మూడో సారి జే.డీ. పవర్ ఐసియా పసఫిక్ వారి ప్రకారం వినియోగదారుల సంతృప్తి విషయంలో నం.1 గా ఉందని తెలిపారు.
0 out of 0 found this helpful