Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

అమెజాన్స్ కొత్త కార్ షో లో భాగమైన జెరెమీ క్లార్క్సన్, రిచర్డ్ హంమొండ్ మరియు జేమ్స్ మే

జూలై 31, 2015 02:18 pm nabeel ద్వారా ప్రచురించబడింది

మరింత వివాదాలు మరియు ఊహాగానాల తర్వాత, చివిరిగా జెరెమీ క్లార్క్సన్, రిచర్డ్ హంమొండ్ మరియు జేమ్స్ మే వారి తాజా వాహన ప్రదర్శన కొరకు అధికారికంగా అమెజాన్ ప్రధాన ప్రసార సేవ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ షో కి ఇప్పటికి పేరు నమోదు కాలేదు. ఇది వచ్చే సంవత్సరం ప్రసారం కాబోతుంది. ఈ ముగ్గురు, మూడు సీజన్ల షో కొరకు ఒప్పందం కుదుర్చుకుని సంతకం చేశారు. ఈ షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు.

ఈ ఒప్పందం గురించి మిగతా ఎటువంటి వివరాలు అమేజాన్ నుండి అధికారికంగా బయట పడలేదు. కాని అంతర్గతంగా వారు "మేము ఒక గుర్తించదగిన పెట్టుబడి పెట్టాము " అని అన్నారు. ఈ షో టాప్ గేర్ లో నిర్మాత మరియు జెరెమీ క్లార్క్సన్ యొక్క పాత స్నేహితుడు అయిన ఆండీ విల్మన్ చే నిర్మించబడుతుంది.

క్లార్క్సన్ 27 సంవత్సరాల నుండి బిబిసి లో ఉండి అకస్మికంగా బయటపడిన తరువాత, ఆయన తన స్నేహితులు రిచర్డ్ హంమొండ్ మరియు జేమ్స్ మే తో కలిసి ఏదో ఒక డీల్ చేయాలనుకున్నారు. అది ఇప్పుడు బయట పడింది.

జెరెమీ క్లార్క్సన్, బిబిసి ని వదిలిపెట్టినందుకు ఒకప్పుడు బాదపడిన అతను, ఇప్పుడు మంచి మానసిక స్థితిలో ఉండి" నేను పాతకాలపు పని నుండి బయటపడి స్పేస్ షిప్ లోకి చేరుకున్నాను" అని ట్వీట్ చేశారు.

రిచర్డ్ హంమొండ్ కూడా ఈ కొత్త ప్రయోగంతో చాలా థ్రిల్లింగ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. "అమెజాన్? ఓ అవును. నేను ఇప్పటికే అమేజాన్ లో ఉన్నాను. ఇది నిజమేనా" అని ఆనందం తెలుపుతున్నారు.

జేమ్స్ మే లేదా 'కెప్టెన్ స్లో' ఈ విధంగా అన్నారు: "మేము కొత్త తరం స్మార్ట్ టి వి లో భాగంగా మారాము. ఇది నమ్మదగిన విషయమా లేక హాస్యాస్పదమా "

ఇది పక్కన పెడితే , ఈ ముగ్గురూ కూడా ఆశ్చర్యంతో అమేజాన్ షో కొరకు కృషి చేస్తూ వారి కలలను నెరవేర్చుకోబోతున్నారు.

ఈ సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియో యురోపియన్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ జే మెరైన్ మాట్లాడుతూ " వారిని మేము మళ్లీ తెరపై చూడాలనుకుంటున్నాము మరియు వారు ఎలాంటి ఆసక్తికరమైన అంశాన్ని తెరకెక్కస్తున్నారో అని మేము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని వినియోగదారులు మాతో చెప్పారు. లక్షలాది ప్రధాన సభ్యులు ఇప్పటికే మా సంచలనాత్మక వాస్తవ ప్రదర్శనలను చూసి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. జెరెమీ, రిచర్డ్ మరియు జేమ్స్ జట్టు ఎటువంటి ప్రదర్శనను సృష్టిస్తారో అని మేము కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాము. కానీ అది 2016 లో విశ్వవ్యాప్తంగా ఊహించని ప్రదర్శనలలో ఒకటిగా అవుతుందని మేము ఖచ్చితంగా చెప్పగలము అని" ఆయన అన్నారు. ప్రస్తుతం ఇది టెలివిజన్ ల యొక్కస్వర్ణ యుగం, టివి మేకర్స్ కి మరియు కథలు చెప్పే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. మా ముఖ్య ఉద్దేశ్యం ఏమిటనగా, వినూత్నమైన సృజనాత్మకతో కూడిన కార్యక్రమాలు చేసేవారిని వారికి నచ్చిన విధంగా కార్యక్రమాలు చేసుకునే స్వేచ్ఛను అందిచడం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, ప్రపంచ ప్రముఖ ప్రతిభను చూపే ఇంకా మంచి పెద్ద పెద్ద కార్యక్రమాలను మీరు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు " అని ఆయన జోడించారు.

అమెజాన్ ప్రైమ్ ను కూడా అమెజాన్ వీడియో అను ఒక మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.48.90 - 54.90 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర