రెప్సోల్ మరియు గల్ఫ్ పెట్రో కెమికల్ గ్రూప్ భాగస్వామ్యం- భారతదేశంలో కొత్త కందెన శ్రేణి ఆవిర్భావం
జూన్ 18, 2015 09:32 am akshit ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ: గల్ఫ్ పెట్రోకెమికల్ సంస్థ, రెప్సోల్ పెట్రోలియం కంపెనీ తో వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించుకోవడానికి వారు ప్రత్యేకంగా తయారు చేసిన కందెనలను భారతదేశ మార్కెట్లో విక్రయించడానికి ఒప్పదం కుదుర్చుకుంది.
"రెప్సోల్ తో ఒప్పందం కుదురడం మాకు చాలా ఆనందంగా ఉంది, ఒక ప్రముఖ గౌరవనీయ అంతర్జాతీయ బ్రాండ్ ఉత్పత్తులను మేము మార్కెటింగ్ చేయడం మా అదృష్టం, మరియు వారి యొక్క మొత్తం ఉత్పత్తులను మా వ్యాపార సముచ్చయంగా భావించి విక్రయిస్తాము. మన ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడడానికి కందెన భవిష్యత్తులో ఒక సాక్షిగా మారి వృద్ధి సాధిస్తుంది. మారుతున్న ఇంజిన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని నేటి వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా సృజనాత్మకతతో సమాధానం చెప్పగలిగే రీతిలో రెప్సోల్ కందెనలు ఉంటాయని" గల్ఫ్ పెట్రో కెమికల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ గోయల్ వాఖ్యానించారు.
ఉన్నతమైన నాణ్యత గల కందెనల యొక్క ఈ కొత్త లైన్,దేశంలోని అభివృద్ధి చెందుతున్న ఉన్నత మరియు అగ్ర ముగింపు విభాగంలో సేవలు అందించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి.
భారత మార్కెట్ గొప్ప సామర్ధ్యాన్ని కలిగి ఉందని మేము గమనించాము. భారతదేశం మాకు చాలా ముఖ్యమైన మార్కెట్ అవుతుంది మరియు ఈ ఒప్పందం మాకు ఎప్పటికప్పుడూ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో మా పాదముద్రలు విస్తరించేందుకు సహాయం చేస్తుంది. జీపీ పెట్రోలియంస్ లిమిటెడ్ భాగస్వామ్యం వలన భారతదేశ కందెన మార్కెట్ లో ఒక బ్రాండ్ తో బలమైన ఉనికిని కలిగి ఉండడం వలన, ఈ రంగం లో మాకు ఒక ప్రత్యక్షమైన ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నాము. మా రెండు బలమైన మూలాలు కలవడం వలన వివిధ రకాల ఉత్పత్తులను పంపిణీ చేసి మా సామర్థ్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తామని" రెప్సోల్ కందెనల డైరెక్టర్ ఓర్లాండో కార్బో చెప్పారు.
ప్రస్తుతం జీపీ మరియు దాని ఐఒపిఎల్ బ్రాండ్ తో నాలుగు దశాబ్దాలుగా దేశంలో ఉనికిలో ఉన్నాము మరియు ఇక్కడ బేస్ చమురు 17,000 కిలో లీటర్స్ నిల్వ ఉంచే సౌకర్యం ఉంది, మరియు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 80,000 కిలో లీటర్లు ఉంది.