3M కార్ కేర్ కొత్త కార్ వ్రాప్స్ తో " రూఫ్ తేరా మస్తానా" అంటూ ట్యాగ్లైన్ తో ముందుకు వస్తున్నారు
నవంబర్ 30, 2015 03:30 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
చెన్నై:
మీరు మీ కారు పాతబడిపోయింది అనుకుంటున్నారా? లేదా మీ కారు యొక్క పాత పెయింటింగ్ మీకు బోర్ కొట్టిందా, అప్పుడు 3M కార్ కేర్ కొత్త శ్రేణి కారు వ్రాప్ తో "రూఫ్ తేరా మస్తానా" అంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఈ కొత్త సేకరణ 25 కారు వ్రాపులను కలిగియుండి ప్రస్తుతం రూఫ్, బోనెట్ మరియు కారు వెనుక భాగం వైపు దృష్టి సారిస్తుంది. మీరు మాట్టే, గ్లోస్, శాటిన్, బ్రషెడ్ మరియు కార్బన్ వంటి ప్రీమియం ఫినిషింగులతో 84 వేరియంట్లు అంతటా విస్త్రుత శ్రేణి స్ట్రైప్స్, ద్వంద్వ టోన్ మరియు ముద్రలతో మీకు కావలసిన డిజైన్ ని పొందవచ్చు. ధర రూ.4,500 నుండి మొదలవుతుంది మరియు భారతదేశం లో 3M కార్ కేర్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కారు మొత్తం పూర్తి చేసేందుకు 3 నుండి 7 రోజుల సమయం పడుతుంది.
ఈ వ్రాపులు ఉన్నత డ్యుయల్ లేయర్డ్ కాస్ట్ రిమూవబుల్ ఫిల్మ్ తో పనితీరు & రక్షణ కోసం వస్తాయి మరియు అధిక పీడనం అందించడం ద్వారా దీనిని అతుక్కొనేలా చేస్తారు. దీనివలన ఆ వ్రాపులు ఎటువంటి పరిస్థితులలో కూడా పాడవవు మరియు చిరిగిపోవు. దీనిలో కంటికి కనపడని గాలిని పంపించేటటువంటి డిజైన్ ద్వారా వేగంగా, సులభంగా మరియు బబుల్స్ లేని స్టిక్కరింగ్ ని అందిస్తుంది.
ఇంకా, ఈ ఫిల్మ్స్ డిజిటల్ గా UV రక్షణ పొర తో ముద్రించబడి ఉండి అసలైన OEM పెయింట్ కి పూర్తి రక్షణ అందిస్తాయి. ఈ ఫిల్మ్ మూడు సంవత్సరాల వరకూ పనిచేస్తుంది మరియు డైమెన్షనల్ స్థిరత్వం మరియు మన్నిక కోసం రెండు రంగు పొరలతో తయారు చేయబడుతుంది.
ఇంకా చదవండి: