కొత్త కుటుంబ కార్లపై పెట్టుబడి పెట్టేందుకై జీఎం వారు $5 బిలియన్ డాలర్లను వెచ్చిస్తున్నారు
జైపూర్: చైనా వారి ఎసేఐసీ మోటర్ తో అనుసంధానం అవుతూ జెనెరల్ మోటర్స్ వారు $5 బిలియన్ డాలర్లని కుటుంబ కార్లను తయారు చేయుటకై పెట్టుబడి పెట్టనున్నారు. ఈ కార్లు నాలుగు ముఖ్యమైన స్థానాల్లో, అనగా, చైనా, నేపాల్, బ్రాజిల్ మరియూ ఇండియాలలో తయారు చేయబడతాయి. ఈ కార్లకి కొత్త ఇంజిను మరియూ కొత్త డిజైనుతో తయారు చేయబడుతుంది. వీటికి చెవ్రొలే టాగ్ ని ఉండి ఇతర దేశాలకి ఎగుమతి చేయబడతాయి. కానీ, యూరపు ఖండానికి కానీ యూఎసే కి కానీ ఎగుమతి చేసే ఉద్ద్యేసము లేదు.
జీఎం వారి ప్రకారం, ఇప్పటి నుండి 2030 వరకు, ప్రపంచం 88 శాతం ప్యాసెంజర్ కారు అమ్మకాలలో ఎదుగుదలను చూస్తుంది. జీఎం కి ప్రెసిడేంట్ అయిన మిస్టర్ అమ్మన్ గారి మాటల్లో, " ఇది విస్తృతంగా ఎదుగుతున్న మార్కెట్ కి అనుగుణంగా మార్పు చెందడానికి నాంది" మరియూ " మేము ఈ విషయంలో మా నిర్దేశాలను స్పష్టం చేయదలచాము." అని అనారు.
ఈ కొత్త కుటుంబ కారు 2019 కి అమ్మకానికి వచ్చి కనీసం ఏటా 2 మిలియన్ అమ్మకాలను చూస్తుంది. కంపెనీ వారు ఇప్పటికే ఉత్పత్తి యూనిట్లను మరియూ వాటి ఖర్చులను తయారు చేసుకున్నారు.