• English
  • Login / Register

మాజీ జొమాటొ ఎగ్జిక్యూటివ్ ఉమేష్ హోరని తీసుకున్న గిర్నార్ సాఫ్

డిసెంబర్ 09, 2015 05:20 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

CFO గా ఆన్-బోర్డ్ కి తెచ్చారు

జైపూర్: తమ విభాగపరిశ్రమలో దూసుకుపోతున్న జైపూర్ ఆధారిత గిర్నార్ సాఫ్ట్ ఇటీవల  CFO గా ఉమేష్ హోర ని నియమించడంతో ఆన్-బోర్డ్ లోకి మరొక ప్రముఖ పేరు తెచ్చింది.ఇతను సంస్థ యొక్క సీనియర్ నిర్వహణలో భాగంగా ఉండి,కంపెనీ ఆర్థిక వ్యవహారాలను,వ్యూహాన్ని ప్రణాళిక చేయటంలో తోడ్పతారు.అంతేకాకుండా  సంస్థ యొక్క విస్తరణ మరియు పథానికి అవసరమైన ఆర్థిక అభివృద్ధిని మరియు చట్టపరమైన మద్దతుని అందిస్తారు. ఉమేశ్ గతంలో ఆన్లైన్ రెస్టారెంట్ శోధన మరియు ఆవిష్కరణల వేదిక అయిన జోమేటోలో  CFO గా  పనిచేశారు.

పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఒక కామర్స్ గ్రాడ్యుయేట్ మరియు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇనిస్టిట్యూట్ నుండి ఒక ర్యాంక్ హోల్డింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ (ICAI) అయిన ఉమేష్ , అనేక సంవత్సరాలపాటు ప్రముఖ భారత మరియు ప్రపంచ కంపెనీలలో పనిచేసి ఫైనాన్స్ డొమైన్ లో వెలలేని అనుభవాన్ని కలిగి ఉన్నారు. తన వర్క్ లైఫ్ తొలి రోజుల్లో ,ఉమేష్  PricewaterhouseCoopers కంపెనీలో అసోసియేట్ గా ఉన్నారు. అంతేకాకుండా అనలేక్ ఇన్ఫోటెక్, WNSగ్లోబల్ సర్వీసస్ మరియు డాటా మోనిటర్ ఇండియా కంపెనీలలో కూడా అసోసియేట్ గా పనిచేశారు.

గిర్నార్ సాఫ్ట్ లో చేరడానికి ముందు ఉమేష్ జోమేటోలో  CFOగా ఉన్నారు. గుర్గావ్ లో మైండ్ కేఫ్ తెరవడం ద్వారా అతను కూడా వ్యవస్థాపక రంగంలోకి అడుగుపెట్టారు.

గిర్నార్ సాఫ్ట్, సహ-స్థాపకుడు మరియు సెయో అయిన అమిత్ జైన్ అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతూ," మేము ఉమేష్ ని సంతోషంగా బోర్డ్ లోకి స్వాగతిస్తున్నాం. ఇటువంటి క్లిష్టసమయంలో ఉమేష్ వంటి ఒక అనుభవం కలిగిన ప్రొఫెషనల్ ఉండడం ఒక అర్ధాన్నిఇస్తుంది. అతడు  తనతో పాటు వివిధ పరిశ్రమల్లోపనిచేసిన బహుమితీయ పరిమాణాల అనుభవ సంపదను తీసుకొస్తాడు. సముపార్జనలు, నిధుల సేకరణ, బహుళ దేశాలకు మా  వ్యాపారం విస్తరించే విషయములో అతడి అనుభవం మా వ్యాపారంపై పరిగణింపబడే ప్రభావాన్ని సృష్టించవచ్చు. కార్ ధేఖొని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్ళడానికి  ఉమేష్ తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాము.

ఉమేష్ మాట్లాడుతూ," గిర్నార్ సాఫ్ట్ భారత కంపెనీల ప్రారంభ వ్యవస్థలో అత్యంత వినూత్నమైన, విలువ ప్రాధాన్యత పరిష్కారాలను కలిగిన గ్రోత్-ఇంక్యూబెటర్ లలో ఒకటిగా నిలిచిందని మరియు ఇటువంటి అత్యంత విజయవంతమైన మరియు డైనమిక్ సంస్థ యొక్క ఒక భాగంగా ఉండే గౌరవం దక్కినందుకు సంతోషంగా మరియు ఆశ్చర్యంగా ఉందని, ఈ కంపెనీ విజయానికి అంతర్భాగంగా తన పాత్ర పోషిస్తానని తెలిపారు.

కార్పొరేట్ ఫైనాన్స్ మరియు ప్రణాళిక, ఆర్జన, ఆర్థిక విశ్లేషణ, నియంత్రణ మరియు సమ్మతి నిర్వహణ, ఇన్వెస్టర్ రిలేషన్స్, పన్ను మరియు వ్యూహాత్మక వ్యాపార ప్రణాళిక వంటి విభిన్న సంస్థాగతమైన విధులలో పూర్తి అనుభవంతో పాటు, ఉమేష్ ప్రత్యేకంగా ఫైనాన్స్ మరియు చట్టపరమైన అంశాలను వాణిజ్యపరమైన  దృష్టితో చూడడంలో నిష్ణాతుడు. అతను కొత్త ఉత్పత్తులు / సేవలు మరియు మార్కెట్లు నిర్వచించడంలో చిన్న కంపెనీలతో కలిసి పనిచేసాడు. అంతేకాకుండా అత్యంత కఠినమైన పరిస్థితులలో కూడా వాటిని విజయవంతంగా  వాటిని నడిపాడు. 

మాజీ  PricewaterhouseCoopers అసోసియేట్ డైరెక్టర్ శోభిత్ మాథుర్ ని స్ట్ర్యాటజీ విభాగానికి డైరెక్టర్ గా నియమించడం, ఉమేష్ యొక్క నియామకం ఈ రెండు ఒక బలమైన న్యాయకత్వాన్ని నిర్మించడానికి గిర్నార్ సాఫ్ట్ చేస్తున్న ఒక గొప్ప ప్రయత్నంగా కనిపిస్తుంది. పరిశ్రమలో నిపుణులను ఆన్-బోర్డ్ లోకి తీసుకురావడం ద్వారా గిర్నార్ సాఫ్ట్  ఒక సమగ్రమైన ప్రయత్నంతో వారి వారి సంబంధిత అంశాలలో లోతైన జ్ఞానాన్నిపెంచుకొని దాని వ్యాపార లక్ష్యాలను చేరుకోవడం కోసం చూస్తోంది.


ఇది కూడా చదవండి:

డైరెక్టర్ స్ట్రాటజీ గా శోభిత్ మాథుర్ ని నియమించడం ద్వారా తన యొక్క స్థానాన్ని బలపరుచుకున్న గిర్నార్‌సాఫ్ట్ సంస్థ

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience