గూగుల్ ప్లే స్టోర్ టాప్ డెవలపర్ లో ప్రవేశించిన గిర్నార్ సాఫ్ట్
డిసెంబర్ 29, 2015 09:53 am cardekho ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కార్‌దేఖో మొబైల్ యాప్ అద్భుతమైన ఘనతను సాధించింది
న్యూ డిల్లీ:
భారతదేశం యొక్క ప్రముఖ ఆన్లైన్ ఆటోమొబైల్ పోర్టల్ కార్‌దేఖో ఏమి చేస్తోంది, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, ప్రపంచ టాక్సీ అగ్రిగేటర్ ఊబర్, మరియు ఏస్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ డిస్నీ తో ఉమ్మడిగా ఉందా? జవాబు: గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ డవలపర్ గా ఉంది.
కార్‌దేఖో యొక్క మాతృసంస్థ గిర్నార్‌సాఫ్ట్ దాని వినూత్న సాంకేతికతతో నడిచే వ్యాపార పరిష్కారాలు వెనుక గూగుల్ ప్లే లో 'టాప్ డెవలపర్' ప్రముఖ బ్యాడ్జ్ సాధించింది. ఈ ఘనత ఆటోమొబైల్ వర్గంలో స్థిరత్వం, నాణ్యత, కంటెంట్, యూజర్ అనుభవం మరియు భద్రత కోసం ఒక విశ్వసనీయ యాప్ గా గిర్నార్‌సాఫ్ట్ మాత్రమే సాధించింది. కార్‌దేఖో, జిగ్‌వీల్స్, బైక్‌దేఖో మరియు ప్రైస్‌దేఖో అన్ని యాప్ లు కూడా గిర్నార్‌సాఫ్ట్ చే నిర్వహించబడతాయి. ఫేస్బుక్, ఊబర్, పేటైం, టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్, NDTV, మరియు జొమాటో వంటి ఇతర బాగా తెలిసిన కంపెనీలు కూడా టాప్ డెవలపర్ ట్యాగ్ తో ఉన్నాయి.
కార్‌దేఖో యాప్ విజయం వెనుక ముఖ్య పాత్ర పోషిస్తున్న , గిర్నార్ సాఫ్ట్, డైరెక్టర్-స్ట్రాటజీ, రాహుల్ యాదవ్ మాట్లాడుతూ " మేము చేసే ప్రతి యాప్ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది. ఒక సంతోషకరమైన అనుభవం సృష్టించడానికి మా ఆవిష్కరణ ఎక్కువగా మా వినియోగదారులు మెళుకువలు ఆధారంగా ఉంటుంది. ఇది ఒక యూజర్ ఫ్రెండ్లీ యాప్ అని చెప్పడానికి వినియోగదారుల యొక్క స్వయం ఆసక్తితో జరిగిన డౌన్లోడ్ లే దీనికి తార్కాణం.
గూగుల్ ప్లే 'టాప్ డెవలపర్' గా గుర్తింపు యాప్ కి వినియోగదారులు చేసే ఇన్స్టాల్స్ మరియు రేటింగ్స్ వంటి ప్రమాణాల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. కార్‌దేఖో యొక్క యాండ్రాయిడ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో రెండు మిలియన్ డౌన్లోడ్ కంటే ఎక్కువ దాటింది మరియు ప్రకాశించే సమీక్షలు నుండి వేరుగా 25000 కంటే ఎక్కువ ఫైవ్స్టార్ సిఫార్సులను ఆకర్షించింది.