టాటా నెక్సాన్ గురించి నచ్చిన ఐదు విషయాలు
ఏప్రిల్ 18, 2019 11:31 am jagdev ద్వారా ప్రచురించబడింది
- 3 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మొదటి చూపులో టాటా నెక్సాన్ ఆకట్టుకునే విధంగా కొనుగోలుదారుల ముందుకు వచ్చింది. అధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు వెడల్పైన భాగం కలిగి ఉండటం వలన రోడ్డుపై అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. టాటా ధరను చాలా ఎక్కువగా తగ్గిస్తుంది మరియు ఎక్స్ ఎం వేరియంట్ మా అభిప్రాయంలో గొప్ప విలువను కలిగి ఉంది. నెక్సాన్ లో ఉన్న వేరియంట్లు ఏ ఏ అంశాలను అందించనుందో తెలుసుకోవడానికి మా కథనాన్ని చదవండి.
నెక్సాన్ లో మాకు నచ్చిన ఐదు విషయాలు ఇక్కడ ఉన్నాయి మరియు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే - అన్నింటిలో నాలుగు సాధారణంగా అందించబడతాయి.
డైనమిక్స్
టాటా నెక్సాన్ రైడ్ అందరినీ ఆకట్టుకుంది. అధిక వేగంలో కూడా దాని స్థిరత్వాన్ని కోల్పోకుండా మంచి రైడ్ అనుభూతిని అందిస్తుంది. (డీజిల్ కంటే) పెట్రోల్ వెర్షన్ ముఖ్యంగా మూలల్లో మరింత చురుకుగా ఉంటుంది. రైడ్ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది అంటే నెక్సాన్ ఒక సౌకర్యవంతమైన రైడ్ ను ఇచ్చే అద్భుతమైన వాహనం. మొత్తంమీద, దీని డైనమిక్ ప్యాకేజీ, వాహనాన్ని మరింత అద్భుతంగా నడిపేలా చేస్తుంది మరియు అధిక వేగంలో కూడా అద్భుత డ్రైవ్ ను ఇస్తుంది.
డీజిల్ ఇంజన్
నెక్సాన్ లో ఒక 1.5 లీటర్ టర్బోచార్జెడ్ డీజిల్ ఇంజిన్ ను అందించడం జరిగింది, ఇది అతయ్ధికంగా 110 పిఎస్ పవర్ ను మరియు 260 ఎన్ ఎం గల గరిష్ట టార్క్ లను అందిస్తుంది. డ్రైవరబిలిటీ కి సంబంధించినంతవరకు, ఈ శ్రేణిలో అందించబడిన ఇంజన్లలో ఇది మంచి డీజిల్ ఇంజిన్. మీరు మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఇక్కడ మా నివేదికలో ఇవ్వబడిన డ్రైవ్ రిపోర్ట్ ను వివరంగా చదవండి. ఇంజిన్ గురించిన అత్యుత్తమమైన విషయం ఏమిటంటే తక్కువ రివర్స్ వద్ద ఉన్నప్పుడు కూడా అద్భుతమైన డ్రైవ్ ను ఇస్తుంది.
డ్రైవ్ మోడ్లు
టాటా నెక్సాన్ లో ఉన్న - ఎకో, సిటీ మరియు స్పోర్ట్ లాంటి మూడు డ్రైవ్ మోడ్లు - వాహనం యొక్క అన్ని వేరియంట్ లలో రెండు ఇంజిన్లలో అందించబడతాయి. డ్రైవ్ మోడ్లు, సమర్థవంతంగా ఇంజిన్ల లక్షణాలను మారుస్తాయి. ఈకో మోడ్, ఇంజిన్ యొక్క డ్రైవ్ రేంజ్ విస్తరించడానికి ఉపయోగపడుతుంది, సిటీ మోడ్ ముందుగా మీరు అప్షిఫ్టర్ చేయడానికి అనుమతిస్తుంది, అయితే స్పోర్ట్ మోడ్- అగ్ర శ్రేణి యొక్క ఇంజన్ లను ఉపయోగించుకుంటుంది. అన్ని డ్రైవ్ మోడ్లు వారి లక్ష్యంలో స్పష్టంగా ఉన్నాయి మరియు అద్భుతంగా ఉపయోగపడతాయి.
స్పేస్
నెక్సాన్ కారు ఉప నాలుగు మీటర్ల విభాగం లోకి వస్తుంది, నమ్మడానికి కష్టంగా ఉంది కదూ. ముందు మరియు వెనుక భాగంలో ఉన్న లెగ్ రూం ఆకర్షణీయమైనవి మరియు సగటు పరిమాణం కన్నా కొద్దిగా లావుగా ఉన్న్న ప్రయాణికులు కూడా సరిపోయే విధంగా వెడల్పైన సీట్లు అందించబడ్డాయి. వెనుక సీట్లు కూడా బకెట్ టైప్ సీట్లు అందించబడ్డాయి, వెనుక భాగంలో మూడవ ప్రయాణికుడు సౌకర్యవంతంగా కూర్చోవడానికి అనుమతించదు. కానీ నలుగురు ప్రయాణికుల కోసం నెక్సాన్ రూ. 10 లక్షల ధరల శ్రేణిలో అత్యంత సౌకర్యవంతమైన కార్లలో ఒకటి.
ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
మాస్ మార్కెట్ సెగ్మెంట్ ను పరిగణలోకి తీసుకుంటే, ఆడియో నాణ్యత మరింత ఎక్కువ ఇవ్వడానికి టాటా, హర్మాన్ తో జత చేయబడింది. హర్మాన్- ఆధారిత వ్యవస్థలను కలిగి ఉన్న ఇతర టాటా కార్ల మాదిరిగా, ఈ నెక్సాన్ కారులో కూడా 8 స్పీకర్ యూనిట్ అందించబడింది. ఆడియో నాణ్యతను ఒక పక్కన పెడితే, నెక్సాన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో మరో రెండు అత్యద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. మొదటిది (స్క్రీన్ యొక్క) ప్లేస్మెంట్ మరియు రెండవది టచ్స్క్రీన్ వ్యవస్థ కోసం కంట్రోల్ నాబ్స్. డాష్బోర్డ్- మౌంటెడ్ ఫ్లోటింగ్ స్క్రీన్, అప్మార్కెట్ను చూస్తుంది మరియు కంట్రోల్ నాబ్స్ మరింత అద్భుతంగా పనితీరును కలిగి ఉంటాయి.
నెక్సాన్ కోసం వెతుకుతున్న వారికి అద్భుతమైన వాహనం అలాగే చాలా అంశాలను కూడా మిస్ అవుతుంది. టాటా నెక్సాన్ ను ఎంచుకోవాలి అనుకున్న వారు, ఈ ఐదు విషయాల గురించి చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మరింత చదవండి: టాటా నెక్సాన్ ఆన్ రోడ్ ధర