• English
  • Login / Register

భారీ రీకాల్ తరువాత $ 105 మిలియన్ల రికార్డ్ ఫైన్ ను ఎదుర్కొన్న ఫియట్ క్రైస్లర్

జూలై 27, 2015 02:21 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

భారీ రీకాల్ ప్రకటించిన తర్వాత వెంటనే, ఫియట్ క్రైస్లర్ మళ్ళీ రికార్డు స్థాయిలో 105 మిలియన్ డాలర్ల జరిమానాతో ఇబ్బందుల్లో చిక్కుకుంది.

వాహన తయారీ సంస్థ కూడా జాతీయ రహదారి ట్రాఫిక్ భద్రత అడ్మినిస్ట్రేషన్ కుదిర్చిన ఒక ఒప్పందం ప్రకారం, దాదాపు 1.5 మిలియన్ కార్లను తిరిగి కొనుగోలు చేసేందుకు అంగీకరించింది.జాతీయ రహదారి ట్రాఫిక్ భద్రత అడ్మినిస్ట్రేషన్ కూడా సంస్థ తయారు చేసిన వాహనాలలో మూడు ఏరియాలలో లోపాలు ఉన్నట్లు తెలిపారు మరియు సంస్థ సమర్థవంతంగా , నివారణ కోసం సకాలంలో వాహన యజమానులకు, డీలర్లకు మరియు జాతీయ రహదారి ట్రాఫిక్ భద్రత అడ్మినిస్ట్రేషన్ కు నోటిఫికేషన్ ను జారీ చేసిందని తెలిపారు.
 
సంస్థకి 3 సంవత్సరాల నుండి ఎవరైతే ప్రతినిధిగా వ్యవరిస్తున్నారో వారే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని నివారణకు రీకాల్ చేయవలసిన బాధ్యత ఉంటుంది.

ఎన్ హెచ్ టి ఎస్ ఎ (జాతీయ రహదారి ట్రాఫిక్ భద్రత అడ్మినిస్ట్రేషన్) జనవరి 2015 లో హోండా మీద విధించిన 70 మిలియన్ డాలర్ల జరిమానాను అధిగమించేలా రికార్డు స్థాయిలో ఫియాట్ క్లిస్టర్ పైన 105 మిలియన్ డాలర్ల జరిమానాను విధించింది.

ఎన్ హెచ్ టి ఎస్ ఎ నిర్వాహకుడు మార్క్ రోస్ కైండ్ మాట్లాడుతూ" ఫియాట్ క్లిస్టర్ యొక్క పనితీరు సరిగ్గా లేకపోవడమే దాని యొక్క మిలియన్ల వినియోగదారులను మరియు డ్రైవింగ్ చేసే వారిని ప్రమాదంలో పడవేస్తుందని" ఆయన అన్నారు.

ఒక మిలియన్ జీపులలో ఫ్యుయెల్ ట్యాంక్ లోపం వలన ఇంధనం లీక్ అయి ప్రమాదాలు సంభవించినపుడు మంటలు ఎగిసే ప్రమాదం ఉంది మరియు కార్ల విషయంలో వాటి యొక్క సస్పెన్షన్ వ్యవస్థ భాగాలలో లోపం ఉండడం వలన వాటిని వెనక్కి తిరిగి కొనుగోలు చేశారు. వీటి వలన కారు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది.

డకోటా, క్రిస్లర్ ఆస్పెన్ ట్రక్కులు మరియు డాడ్జ్ రామ్ వంటి అన్ని వాహనాలు కూడా 2008 మొదట్లో తయారైన కార్ల ఒప్పందంలో చేర్చబడ్డాయి.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience