ఢిల్లీలో నిషేధించబడిన 2-లీటర్ లేదా పెద్ద ఇంజిన్ డీజిల్ కార్లు
డిసెంబర్ 17, 2015 06:20 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్య ాఖ్యను వ్రాయండి
జైపూర్:భారతదేశం యొక్క సుప్రీం కోర్ట్ 3 నెలల వరకు ఢిల్లీలో 2-లీటర్ల లేదా పెద్ద యంత్రాలతో ఉన్న అన్ని డీజిల్ కార్ల అమ్మకాలు నిషేందించింది!
ఢిల్లీ ఈ రోజుల్లో ఆటోమేటివ్ పరిశ్రమ కోసం ఒక హాట్ స్పాట్ గా ఉంది. ఇదంతా కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించిన ఆడ్-ఈవెన్ కార్లను నిషేందించడం వలన వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బేసి సంఖ్య రిజిస్ట్రేషన్ గల కారు సోమవారం, బుధవారం మరియు శుక్రవారం రోడ్లపై అనుమతించబడతాయి మరియు సరి సంఖ్య రిజిస్ట్రేషన్ గల కార్లు మంగళవారం, గురువారం మరియు శనివారం అనుమతించబడతాయి. ఇది వాహనం నడిపే వారికి మరియు మోటార్ వాహన తయారీదారులకు ఒక పెద్ద అడ్డంకి అని చెప్పాలి. ఎందుకంటే వాహనాలను వారంలో కొద్ది రోజులు మాత్రమే నడపడం ఒక సమస్య. అధనంగా NGTవారు డీజిల్ వాహన రిజిస్ట్రేషన్ ను డిసెంబర్ 11 2015 నుండి జనవరి 6 2016 నిలిపి వేశారు. ఇంతేకాకుండా ఇటీవల సుప్రీం కోర్ట్ ఇండియా వారి ఇటీవలి నిర్దేశకాల ప్రకారం డీజిల్ ఇంజిన్ వాహనాల అమ్మకాల పైన కూడా బాన్ విధించడం జరిగింది. ఇది 2 లీటర్ లేదా అంతకు పైన సామర్ధ్యం ఉన్న డీజిల్ ఇంజిన్లకు వర్తిస్తుంది. ముఖ్యంగా ఇది NCR పరిధిలో జనవరి 1,2016 నుండి మూడు నెలలు వర్తింపులో ఉంటుంది.
ఈ నిర్బంధం కేవలం కారలకు మాత్రమే పరిమితం అయిన ట్రక్కులు మరియు LCV వాహనాలు డిల్లీ లోనికి ప్రవేశిస్తున్నప్పుడు అవి 10 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు కలిగి ఉండాలి. అంటే, 2006 కి ముందు రిజిస్ట్రేషన్ అయిన వాహనాలని అర్ధం. అంతేకాకుండా, ట్రక్కులు పూర్తి సామర్ధ్యంతో గనుక వెళ్ళినట్లయితే అదనపు ECC చార్జ్ రూ.2,600 ట్రక్కులకు మరియు రూ.1400 LCV వాహనాలకు అందిస్తుంది. అంతేకాకుండా నగరాన్ని ప్రయాణ రహదారిగా వాడుకొనే ట్రక్కులకు అదనపు బాన్ ఉంది. ఇంకా, ఈ బాన్ టాక్సీ సర్వీసులకు ఉదాహరణకు ఓలా మరియు ఊబర్ వంటి వారికి వర్తిస్తుంది మరియు అందుకు వారు CNG కి మారవలసిన అవసరం కూడా ఉంది.
సీనియర్ అడ్వకేట్ దుస్యంత్ దేవ్ ప్రభుత్వానికి రాసిన వారి అపీల్ లో ఆటోమొబైల్ తయారీదారుల తరపున ఈ విధంగా వివరించారు " ప్రపంచంలో ఏ నగరం కూడా ఈ విధంగా బాన్ విధించలేదు. ఆడ్-ఈవెన్ ఫార్ములాను అవలంభించిన బేజింగ్ నగరం కూడా డీజిల్ కార్లపైన బాన్ విధించడం జరగలేదు. ఇది అనేక రంగాలపైన దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎన్నో మిలియన్ కార్ల పెట్టుబడి ఈ డీజిల్ కార్ల తయారీలో ఉంచడం జరిఒగింది. అంతేకాకుండా వేలాది మంది ఉద్యోగులు ఇందుకు నియమించబడడం జరిగింది." అని వివరించారు. ఇందుకు చీఫ్ జస్టిస్ T S టాకూర్ మరియు జస్టిస్ A. K.సిక్రీ ఇంకా R. భానుమతి ఇలా అన్నారు " ముందుగా మూడు నెలలు ఈ నిర్బందం అమలు చేసి చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత కాలుష్యానికి గురవుతున్న నగరాలలో ఒకటి అయినందున ఇటువంటి బలమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఇంకా ఈ విషయమై సంగ్రమైన అధ్యయనం మరియు డీజిల్ కార్ల యొక్క కాలుష్య స్థాయిలను ఇంకా తెలుసుకోవలసిన అవసరం ఉంది."
ఇంకా చదవండి
డిల్లీలో డీజిల్ బాన్ ద్వారా పేరుకున్న 1,000 ఖరీదు కార్లు ఇంకా మహింద్రా ఎదుర్కొంటున్న అడ్డంకులు