Cardekho.com

డాక్టర్. బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ గారి మరణం ఎస్ఐఏఎం ని వేదనకి గురిచేస్తోంది

నవంబర్ 03, 2015 06:24 pm sumit ద్వారా ప్రచురించబడింది
15 Views

జైపూర్:

Hero MotoCorp Founder

అత్యంత పేరున్న టూ-వీలర్ తయారీదారి అయిన హీరో గ్రూపు కి సంస్థాపకుడు మరియూ చైర్మన్ డాక్టర్. బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ గారు 92 ఏళ్ళ వయసులో మరణించారు. వారు కొద్ది పాటి అశ్వస్తతకి గురి అయిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన వృత్తిలో అద్భుతమైన మైలురాళ్ళూ దాటిన వ్యక్తి . ఆయన ఏఐఎసెం/ఎస్ఐఏఎం లకి ప్రెసిడెంట్ మరియూ ట్రెజరర్ పదవులను కూడా చేపట్టారు. వివిధ సంస్థలను ఈయన మరణం ప్రభావితం చేసింది.

ఎస్ఐఏఎం ప్రెసిడెంట్ అయిన మిస్టర్. వినోద్ దాసరి గారు సంతాపాన్ని వ్యక్త పరిచారు. పూర్తిగా ఆటోమోటివ్ కుటుంబాన్ని వీరి మరణం కలచి వేసింది. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం అంతర్జాతీయంగా పొందుతున్న గుర్తింపుకి మూల కారణం డాక్టర్.బ్రిజ్ మోహన్ లాల్ గారి సహకారం చేతనే.

SIAM President

ఇప్పుడు వరుసగా 14వ సారి హీరో మోటర్ కార్ప్ ప్రపంచ నంబర్.1 టూ వీలర్ కంపెనీగా నిలవడానికి డాక్టర్.లాల్ గారే కారణం అయినప్పటికీ, వీరి స్థాయికి ఇవి మాత్రమే కొలమానం కాదు. ఎస్ఐఏఎం వారు వీరి సహకారాన్ని గుర్తుంచుకుంటారు. ఈ ఏడాది మొదట్లో, డాక్టర్.బ్రిజ్ మోహన్ లాల్ గారికి ఎస్ఐఏఎం యానువల్ జెనెరల్ మీటింగ్ లో ఆయన గౌరవార్ధం లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుని అందించారు. ప్రతిష్టాత్మకమైన 'పద్మ భూషన్' అవార్డుని, ఈయన 2005 లో ట్రేడ్ మరియూ ఇండస్ట్రీ కి గాను ఈయన అందించిన సహకారానికి అందించడం జరిగింది.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర