డిల్లీ ప్రభుత్వం వారు 10 ఏళ్ళ పైగా కార్లకి దాదాపు 1.5 లక్షల వరకు డిస్కౌంట్ ని అందిస్తున్నారు
అక్టోబర్ 07, 2015 03:15 pm manish ద్వారా సవరించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
డిల్లీ ప్రభుత్వం వారు ప్రస్తుతం 10 ఏళ్ళ పైగా కార్లపై విధించిన నిషేధానికి సహాయం చేస్తున్నారు. క్రితం ఏప్రిల్ లో న్యాషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ప్రత్యేకించి డీజిల్ కార్లపై నిషేధాన్ని కోరారు.
ఈ నిషేధంపై ఇంకా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా డిల్లీ ప్రభుత్వం వారు ప్రజలు ఈ ఆచరణని ఆపాలి అని ప్రత్యామ్నాయలకై ప్రయత్నిస్తున్నారు. దీనితో పాటుగా ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నారు. ఈ ప్రతిపాదన రోడ్డు రవాణా శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు ప్రకటించారు.
పాత కార్లు అమ్మిన కొత్త కారు కొనుగోలు చేసిన వారికి ఒక సర్టిఫికేటు ఇస్తాము అనీ, అది చూపించటం ద్వారా వారికి డిస్కౌంట్లు ఇవ్వబడతాయి అని తెలిపారు. ఈ సర్టిఫికేట్లు ఎన్నో షోరూంలలో చెల్లుతాయి. డిస్కౌంటు ధర కారు పరిస్థితి పై ఆధారపడి ఉంటుంది. ఈ డిస్కౌంట్లు రూ. 50,000 నుండి రూ. 1.5 లక్షల వరకు కారు పరిస్థితి ని బట్టి అందుకోగలరు.
గడ్కరీ కూడా చిన్న కార్ల డిస్కౌంట్, వారి పరిస్థితి బట్టి రూ.30,000 వరకూ తగ్గవచ్చని తెలిపారు. ఈ ప్రణాళిక ఇప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం ద్వారా అమలు పొందలేదు, ఇంకా ఇది ప్రాథమిక ప్రతిపాదన దశలోనే ఉంది. దీని వలన మనకు అర్ధమైనది ఏమిటంటే డిల్లీ లో ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పాత కార్లు సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉండవచ్చు.