Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

తదుపరి దశ EV పాలసీని చర్చించడానికి స్టేక్‌హోల్డర్ మీట్ؚను ఏర్పాటు చేసిన ఢిల్లీ ప్రభుత్వం

మే 22, 2023 12:40 pm rohit ద్వారా ప్రచురించబడింది

మొదటి దశ EV పాలసీని ఢిల్లీ ప్రభుత్వం ఆగస్ట్ 2020లో ప్రవేశపెట్టింది, మొదటి 1,000 ఎలక్ట్రిక్ కారు రిజిస్ట్రేషన్‌లకు ప్రోత్సాహకాన్ని అందించింది

రాజధానిలో EVలకు మారడాన్ని వేగవంతం చేయడానికి మరియు కొత్త కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలను అందించడానికి EV-నిర్దిష్ట పాలసీని ఢిల్లీ ప్రభుత్వం ఆగస్ట్ 2020లో ప్రవేశపెట్టింది. ఈ పాలసీ గడువు త్వరలోనే (ఆగస్ట్ 2023) ముగియనుంది, మరియు ఢిల్లీ ప్రభుత్వం రెండవ దశ పాలసీని రూపొందించడం ప్రారంభించింది, దీని కోసం రవాణా శాఖ ఢిల్లీ EV సెల్ మే 24వ తేదీన స్టేక్ హోల్డర్ మీటింగ్ؚను ఏర్పాటు చేసింది.

ఢిల్లీ ప్రభుత్వ పాలసీ వివరాలు

ఢిల్లీలో EVల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వ సబ్సిడీ పధకం రూ.1.5 లక్షల పరిమితితో ప్రతి kWh బ్యాటరీ శక్తికి రూ.10,000 ప్రోత్సాహకాన్ని అందిస్తోంది (ఆగస్ట్ 2020లో పాలసీ జారీ చేయబడినప్పటి నుండి ఢిల్లీలో రిజిస్టర్ అయ్యే మొదటి 1,000 కార్‌లకు).

తరువాత, రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు రూపంలో అదనపు ప్రోత్సాహకాలను కూడా ఈ పాలసీలో చేర్చారు. 2024 నాటికి మొత్తం కొత్త వాహన రిజిస్ట్రేషన్‌లలో 25 శాతం బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (BEVలు) ఉండాలని ఆశిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.

ఇది కూడా చదవండి: మార్కెట్ పునఃపరిశీలన కోసం భారతదేశాన్ని సందర్శించనున్న టెస్లా అధికారులు

దీని ప్రభావం

ఈ పాలసీ అమలులోకి వచ్చిన తరువాత, దేశ రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరగడం ప్రారంభమయ్యాయి. నిజానికి, 2021 చివరిలో, ఢిల్లీలో CNG కార్‌ల రిజిస్ట్రేషన్‌ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల నెలవారీ రిజిస్ట్రేషన్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి అని బహుళ నివేదికలు సూచించాయి. జులై నుండి సెప్టెంబర్ 2021 నుండి జరిగిన మొత్తం వాహనాల విక్రయాలలో ఇవి 7 శాతం ఉన్నాయి.

ఎలక్ట్రిక్ కార్‌లలో ఇటీవలి పెరుగుదల

ఇటీవలి సంవత్సరాలలో, అనేక కారు తయారీదారులు భారత మార్కెట్‌లో ఎంట్రీ లెవెల్ మరియు టాప్-ఎండ్ లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేశారు. వీటిలో MG కామెట్ EV, సిట్రియోన్ eC3 మరియు టాటా టియాగో EV కూడా ఉన్నాయి, ఇవన్నీ చవక ధరల పరిధిలో ఉన్నాయి, మెర్సిడెస్-బెంజ్ తన ఫ్లాగ్ؚషిప్ ఎలక్ట్రిక్ సెడాన్ EQS 580ను స్థానికంగా అసెంబుల్ చేస్తోంది.

మారుతి, కియా మరియు మహీంద్రాతో సహా అనేక మంది కారు తయారీదారులు ఈ విడుదలలు 2030 సంవత్సరం వరకు తమ EV కారు ప్రణాళికలను ఇప్పటికే వివరించడంతో, ప్రస్తుత విడుదలలు భారీగా మారబోతున్న పరిస్థితులకు అతి స్వల్ప సూచికలు మాత్రమే.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.7 - 9.84 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.17.49 - 21.99 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర