పాల్ వాకర్స్ మరణం వెనుక ఉన్న అసలు కథ
అక్టోబర్ 01, 2015 03:33 pm manish ద్వారా సవరించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
పాల్ వాకర్ యొక్క కుమార్తె, 16 ఏళ్ల మేడో వాకర్ కారెరా జిటి యొక్క తప్పు పరికరాలు వలన ఆమె తండ్రి మరణం చెందాడని చెబుతూ 28 సెప్టెంబర్ న జర్మన్ వాహన తయారీసంస్థ పోర్స్చే కి వ్యతిరేఖంగా ఒక దావా దాఖలు చేసింది. ఆ నటుడు నవంబర్ 2013 లో మరణించగా, అతని కుమార్తె కారు అదుపు తప్పి స్థంభాన్ని ఢీకొని తన తండ్రి మరణించడాని తెలిపింది. శ్రీమతి వాకర్ తన తండ్రి మరణానికి కారణం చెబుతూ, ఆయన సీటు బెల్ట్ పెట్టుకున్నారని కానీ ప్రమాదం సమయంలో బెల్ట్ అన్లాక్ అవ్వకుండా అతనిని గట్టిగా పట్టుకొని ఉండడం వలన ఎముకలు మరియు పొత్తికడుపు విరిగిపోయాయాయి. తాకిడి ప్రభావం వలన కారులో నుంచి ఇంధనం వెలువడి మంటలు రావడం మూలన పూర్తిగా మరణించారని దీని కారణంగా ఆమే పోర్స్చే పై వ్యతిరేకంగా ఒక తప్పుడు మరణం కేసు పెట్టిందని తెలిపింది.
శ్రీమతి వాకర్స్ యొక్క న్యాయవాది జెఫ్ మిలాం ఒక ప్రకటనలో, " పోర్స్చే కారెరా జిటి ఒక ప్రమాదకరమైన కారు. ఇది రోడ్ పైన తిరిగేందుకు అర్హత లేనటువంటిది.మేము పాల్ వాకర్ లేదా అతని స్నేహితుడు, రోజర్ రోడ్స్ లేకుండా ఈ వాహనాన్ని చూడలేము." అని తెలిపారు.
దావా వాదనలు దాఖలు ప్రకారం" ఈ వాహనంలో బాగా డిజైన్ చేయబడిన రేసింగ్ కార్లలో భద్రతా లక్షణాలు లేవని, పోర్స్చే అతి తక్కువ ఖర్చుతో రహదారి కార్లు - కనీసం ప్రమాదంలో నిరోధించేలా ఉన్నా సరే పాల్ వాకర్ ప్రమాదం నుండి తప్పించుకోగలిగే వాడని తెలిపింది."
లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ కమాండర్,మైక్ పార్కర్ మార్చి 2014 లో ఈ విధంగా మాట్లాడారు " పరిశోధకులు కనుగొన్న దాని ప్రకారం ప్రమాదానికి కారణం ఆయన ప్రయాణిస్తున్న రహదారి లో వెళ్ళవలసిన వేగాన్ని మించి వెళ్ళడం." శాంతా క్లారిటా, కాలిఫోర్నియా, కార్యాలయ పార్క్ రోడ్ లో వెల్లవలసిన వేగం పరిమితి 45mph.
ఈ కేసుపై పోర్స్చే స్పందిస్తూ " ముందు చెప్పిన విధంగా మా పోర్స్చే వాహనం ఎవరినైనా బాదించి ఉంటే మమ్మల్ని క్షమించండి కానీ మేము అయన నిర్లక్ష్యమైన డ్రైవింగ్ మూలానే ఈ విషాదకర ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పిన దానిని మేము నమ్ముతాము." అని తెలిపారు.
మరో అప్రసిద్ధ సంఘటన ఏమిటంటే పోర్స్చే సంస్థ కి చెందిన మరొక వాహనం పోర్ష్ 550 స్పైడర్ "లిటిల్ బాస్టర్డ్" కారు వలన జేమ్స్ డీన్ మృతి చెందడం 1995 లో చోటు చేసుకుంది. అందువలన జర్మన్ ఆటోమోటివ్ పరిశ్రమ, వోక్స్వాగన్ మరియు మెర్సిడెస్ బెంజ్ తో పాటూ ఉద్గార పరీక్షలు అమలు చేయ్డం జరిగింది.