5 దశాబ్దాల తర్వాత ఒక కొత్త కారును ప్రవేశపెట్టనున్న బోర్గ్వార్డ్
జూలై 28, 2015 12:15 pm akshit ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ: జర్మన్ ఆటోమోటివ్ బ్రాండ్ అయినటువంటి బోర్గ్వార్డ్ 1961 లో నష్టపోయి వ్యాపార రంగం నుండి వెల్లిపోయారు. ఇప్పుడు మళ్లీ తిరిగి తమ యొక్క కొత్త ఎస్యూవిలతో అన్ని సెట్ చేసుకుని వచ్చే ఏడాది పునఃప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారు. బీజింగ్-ప్రధాన కార్యాలయంలోని ఫోటోన్ మోటార్ యొక్క సహకారంతో ప్రస్తుతం ఈ బ్రాండ్ క్రిస్టియన్ బోర్గ్వార్డ్ గ్రాండ్ సన్ అయినటువంటి ఈ బ్రాండ్ యొక్క స్థాపకుడు కార్ల్ ఎఫ్.డబ్ల్యూ బోర్గ్వార్డ్ మరియు మరియు మాజీ డైమ్లెర్ చైనా బాస్ ఉల్రిచ్ వాకర్ లచే ప్రారంభించబడింది.
బోర్గ్వార్డ్ ఇటీవల వెలుగులోకి వచ్చిన తర్వాత తమ యొక్క 1950 అసలు ఇసబెల్లా కూపేలను చూపించింది మరియు 2016 లో రాబోయే తమ కొత్త బ్రాండ్ ప్రణాళిక గురించి కూడా వివరాలు తెలిపింది. ఇప్పుడు తమ కొత్త బ్రాండ్ పబ్లిక్ లో కి ఒక ఎస్యూవి గా సెప్టెంబర్ లో ఫ్రాంక్ఫర్ట్ ఆటో షోలో రంగ ప్రవేశం చేయబోతున్నట్లు ధృవీకరించారు. ఈ మోడల్ మొదట చైనా లో ప్రవేశ పెట్టిన తర్వాతనే యూరప్ వంటి దేశాలలో ప్రవేశ పెట్టాలని భావిస్తున్నామని వారు తెలిపారు.
ఒకవేళ ఈ అద్భుతమైన మోడల్ కంపనీ కి మంచి సేల్స్ ను అందించినట్లయితే కంపెనీ లాభదాయకమై అప్పుడు లగ్జరీ మోడల్ వలె నిలుస్తుంది. దీనివలన బోర్గ్వార్డ్ మళ్లీ రాబోయే కాలంలో తమ స్థానాన్ని నిలుపుకునే అవకాశాలున్నాయి.
బోర్డులో చైనీస్ భాగస్వామి తో భాగస్వామ్యం ఉండడం వలన ఈ ఆధునిక బోర్గ్వార్డ్ ఉత్పత్తి చైనాలో జరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కానీ ఇంకా దీని గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం జర్మనీ యొక్క స్టట్గర్ట్ కాకుండా దీని ఉత్పత్తికై కంపెనీలో 1000 మంది పనిచేసే అంగబలం ఉందని సమాచారం.