నవీకరించబడిన ఎక్స్6 ను జూలై 23 న ప్రవేశపెట్టబోతున్న బిఎండబ్ల్యూ
జూలై 09, 2015 05:46 pm sourabh ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: బిఎండబ్ల్యూ ఎక్స్6 నమూనాల లైనప్ ఒక తాజా భావాన్ని జోడించడం వల్ల, బిఎండబ్ల్యూ ఇండియా, జూలై 23 న నవీకరించబడిన ఎక్స్6 వెర్షన్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ నవీకరించబడిన ఎక్స్6, కొన్ని చిన్న చిన్న కాస్మటిక్ మార్పులతో రాబోతుంది. ఆ కాస్మటిక్ మార్పులు ఏమిటంటే, ఎల్ ఇడి హెడ్ ల్యాంప్స్, నవీకరించబడిన బిఎండబ్ల్యూ సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ మరియు లార్జర్ ఎయిర్ డ్యామ్లు. అంతేకాకుండా ఈ వాహనం యొక్క అంతర్గత భాగాలలో కూడా మనం మార్పులను గమనించవచ్చు. అవి వరుసగా, కొత్త వుడ్ ట్రిం మరియు కొత్త స్టీరింగ్ వీల్ వంటి వాటిని లోపల చూడవచ్చు.
హుడ్ క్రింది భాగానికి వస్తే, ఈ నవీకరించబడిన ఎక్స్6 వాహనం, 3.0 లీటర్ ట్విన్ టర్బో ఇన్-లైన్ సిక్ష్ సిలండర్ డీజిల్ ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్, అత్యధికంగా, 313 PS పవర్ ను ఉత్పత్తి చేయగా, 630 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్, ఎక్స్డ్రైవ్ 640డి వేరియంట్ మాదిరిగా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. దీని ద్వారా ఈ వాహనం యొక్క పవర్ అన్ని వీల్స్ కు పంపిణీ చేస్తుంది. అంతేకాకుండా, ఈ వాహనం 0 kmph నుండి 100 kmph వేగాన్ని చేరడానికి 5.8 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ వాహనం అత్యధికంగా 240 kmph వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
బీఎండబ్ల్యూ ఇటీవల ఒక కొత్త వేరియంట్ ఎక్స్3 ఎస్యూవి శ్రేణిలో ఎం స్పోర్ట్ ప్యాకేజీ యొక్క ఎక్స్ డ్రైవ్30డి ఎంస్పోర్ట్ ను ప్రారంభించింది. ఈ వేరియంట్ రూ . 59,90,000 ధరకే (ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ) అందించబడుతుంది మరియు ఇతర ఎక్స్3 ట్రిమ్స్ వంటి వాటిని స్థానికంగా బిఎం డబ్ల్యూ యొక్క చెన్నై ప్లాంట్ వద్ద తయారుచేశారు. దీనికి ముందు, సంస్థ ఉన్నత వినియోగదారుల కోసం బిఎండబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపె యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్ 640డి ఎమినెంట్ మోడల్ ను రూ 1.15 కోట్ల వద్ద మరియు 640డి డిజైన్ ప్యూర్ ఎక్స్పీరియన్స్ ను రూ 1.22 కోట్ల (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా) వద్ద ప్రారంభించింది.
ముందు అమ్మిన విధంగా, ఈ కూపే కూడా భారతదేశంలో సిబియు విధానం ద్వారా అమ్మడవబోతుంది. ఈ గ్రాన్ కూపే, కొనుగోలుధారులు ఎంచుకోవడానికి 10 రంగుల షేడ్స్ తో మరియు డీజిల్ ఇంజన్ తో అందించబడుతుంది.