• English
  • Login / Register

భారత్ NCAP కార్యక్రమ ప్రారంభం: ఏమి ఆశించవచ్చు

ఆగష్టు 22, 2023 11:19 am rohit ద్వారా ప్రచురించబడింది

  • 1K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

భారత్ NCAP వయోజనులు మరియు చైల్డ్ ఆక్యుపెంట్‌ల ఇద్దరి భద్రత కోసం కొత్త కార్ؚలకు క్రాష్-టెస్ట్ రేటింగ్ ఇస్తుంది

Bharat NCAP crash tests

  • అంతర్జాతీయ కొత్త కార్‌ల విశ్లేషణ కార్యక్రమాలు అయిన గ్లోబల్ NCAP మరియు లాటిన్ NCAP వంటిదే భారత్ NCAP. 

  • 3.5 టన్నుల వరకు బరువున్న తమ కార్‌లను, కారు తయారీదారులు స్వచ్ఛందంగా పరీక్షించుకోవచ్చు. 

  • ఈ విశ్లేషణలను నిర్వహించడానికి కొత్త పరీక్షా సౌకర్యం కూడా ఏర్పాటు చేయవచ్చు.

  • భారత కారు తయారీదారులలో కొందరు తమ కార్‌లు సాధించిన భారత NCAP రేటింగ్ؚలను కూడా ప్రకటించవచ్చు. 

భారతదేశ ఆటోమోటివ్ పరిశ్రమ, ఇప్పటికి ప్రమాణీకరించవలసిన విషయం ఏదైనా ఉందంటే అదే క్రాష్ టెస్ట్ విశ్లేషణలు. గ్లోబల్ NCAP, యూరో NCAP మరియు లాటిన్ NCAP వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు మరియు కొత్త కారు విశ్లేషణ కార్యక్రమాలు (NCAPలు) ఉన్నాయి, ఇవి కొత్త కార్‌లకు కఠినమైన భద్రత తనిఖీలను నిర్వహించి వాటి పనితీరు ఆధారంగా స్కోర్ మరియు రేటింగ్ؚలు రెండిటినీ ఇస్తాయి. 2022 ప్రారంభంలో భారత ప్రభుత్వం సొంతంగా NCAP (భారత్ NCAP అనే పేరుతో) ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేస్తున్నారు అనే సమాచారం ఆన్ؚలైన్ؚలో వచ్చింది. ప్రస్తుతం, 22 ఆగస్ట్, 2023 తేదీన భారత్ NCAPను కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రి శ్రీ. నితిన్ గడ్కారీ ప్రారంభిస్తారని ధృవీకరించబడింది. 

ఏమి ప్రకటించవచ్చు?

రవాణా మంత్రిత్వ శాఖ భారత NCAP వివరాలను మరియు పారామితులను ప్రకటించడమే కాకుండా, కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్ టెస్టింగ్ ఫెసిలిటీని కూడా ప్రకటిస్తుందని మేము భావిస్తున్నాము. ఒకరు లేదా రెండు భారతీయ కారు తయారీదారులు తమ మోడల్‌ల భారత్ NCAP క్రాష్-టెస్ట్ రేటింగ్‌లను కూడా ప్రకటిస్తారని అంచనా. ఈ టెస్టులలో ఉండే అన్ని దశల వివరాలను కూడా రవాణా మంత్రిత్వ శాఖ వివరించవచ్చు. 

ప్రపంచ ప్రమాణాలే లక్ష్యం 

2022లో, కేంద్ర మంత్రి శ్రీ. నితిన్ గడ్కారీ ఇలా అన్నారు, “భారత్ NCAP టెస్టింగ్ ప్రోటోకాల్, ప్రస్తుత భారత నిబంధనలను పరిగణిస్తూ ప్రపంచ క్రాస్ టెస్ట్ ప్రోటోకాల్స్ؚకు స్థాయికి సమానంగా ఉంటుంది, భారతదేశ సొంత ఇన్-హౌస్ టెస్టింగ్ సౌకర్యాలలో తమ వాహనాలను OEMలు పరీక్షచేయించుకునే వీలు కల్పిస్తుంది.”

ఇది కూడా చదవండి: 2023ని ఇప్పటివరకు హరితంగా మార్చిన 6 ఎలక్ట్రిక్ కార్ؚలు

భారత్ NCAP వివరాలు 

భారత క్రాష్-టెస్ట్ విశ్లేషణ కార్యక్రమంలో 3.5 టన్నులు లేదా 3,500కిలోల వరకు బరువు ఉండే వాహనాల భద్రత పారామితులను లెక్కిస్తుంది. కారు తయారీదారులు ప్రతిపాదిత ఆటోమోటివ్ పరిశ్రమ ప్రమాణాలు 197 (AIS-197) డాక్యుమెంట్ ఆధారంగా, ఈ కార్యక్రమంలో తమ వాహనాలను స్వచ్ఛందంగా పరీక్షించుకోవచ్చు. AIS-197 ప్రకారం, భారత్ NCAPలో ఆఫ్ؚసెట్ ఫ్రంట్ ఇంపాక్ట్ టెస్ట్, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ మరియు పోల్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ ఉంటాయి. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) కోసం స్టార్ రేటింగ్ؚలను ఇస్తుంది.

2023 Kia Seltos rear seats

మునుపటి ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రకారంగా ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ప్రయాణీకులు అందరికి 3-పాయింట్ సీట్ బెల్టులు మరియు అడ్వాన్సెడ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ వంటి తప్పనిసరి ఫీచర్‌లు రేటింగ్ؚలలో చేర్చబడతాయని సూచించింది. కాబట్టి టెస్ట్ నిర్వచించే కార్ؚలలో ఈ ఫీచర్‌లు ప్రామాణికం అయితే, అవి మెరుగైన రేటింగ్ؚను పొందుతుంది. 

ప్రస్తుతం ఉన్న తప్పనిసరి భద్రత అంశాలు 

ప్రస్తుతానికి, భారతదేశంలోని అన్నీ కార్ؚలలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, EDBతో ABS, రేర్ పార్కింగ్ అసిస్ట్, ముందు సీట్ బెల్ట్ రిమైండర్ మరియు స్పీడ్ అలర్ట్ వ్యవస్థలు వంటి ఫీచర్‌లు తప్పనిసరిగా ఉండాలి. ఎనిమిది మంది వరకు ప్రయాణించగలిగే కార్‌లలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలను తప్పనిసరి చేయడంపై ప్రభుత్వం ఇప్పటికే పని చేస్తోంది. ఎంపిక చేసిన అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలను (ADAS) కూడా ప్రామాణికం చేయాలని భావిస్తున్నది.  

ఇది కూడా చదవండి: మహీంద్రా స్కార్పియో N-ఆధారిత గ్లోబల్ పిక్అప్ కాన్సెప్ట్ నుండి 5 ముఖ్యాంశాలు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience