నూర్బర్గ్రింగ్ సర్క్యూట్ వద్ద నిషేధించిన లాప్ రికార్డులు
జూన్ 22, 2015 11:41 am raunak ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
పోర్స్చే 918 స్పైడర్ 6 నిమిషాల 57 సెకన్లలో నార్డ్ షైఫ్ సర్క్యూట్ రికార్డులో ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే కారుగా రికార్డు సృష్టించింది.
జైపూర్: నూర్బుర్గ్రింగ్ యజమానులు తయరీదారులు ఇక మీదట ఎటువంటి లాప్ రికార్డు చేయరాదని లాప్ రికార్డులని నిషేదించారు. ఈ వార్త అతి వేగంగా ప్రయాణించే కార్లు తయారుచేసే సంస్థలకి చాలా భాదాకరమైన వార్త. కొన్ని రోజుల క్రితం విఎల్ ఎన్ చాంపియన్షిప్ సమయంలో నిస్సాన్ జిటీఅర్ యొక్క ప్రాణాంతకమైన ప్రమాదంలో చాలా మంది గాయపడడమే కాకుండా ఒక ప్రేక్షకుడు మరణించిన కారణంగా ఈ లాప్ రికార్డులని నిషేదించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ వార్త ముఖ్యంగా కొనిగ్సెగ్ సూపర్ కార్లు సి ఇఒ అయిన క్రిస్టియన్ వాన్ కొనిగ్సెగ్ కి మరింత భాదకరమైన వార్త. వారు పోర్స్చే యొక్క రికార్డు బద్దలు చేసేందుకు అతి చేరువలో ఉన్నారు. వారు తయారుచేసిన కొనిగ్సెగ్ వన్:1 కారు సంపూర్ణమైన శక్తి మరియు బరువు నిష్పత్తి కలిగి ఉంది. ఈ కారు 1341 బిహెచ్ పి శక్తినిని ఉత్పత్తి చేసే హైబ్రిడ్ మెగా కారు. ఇది ఖచ్చితంగా లాప్ రికార్డులో ప్రపంచంలో మొట్టమొదటి కారు అయ్యిండేది కాని అది పూర్తి కాలేదు.
గత ఏడాది మార్చిలో, ఒక జర్మన్ సంస్థ అయిన డుస్సెల్డర్ ఆధారిత కాప్రికార్న్ డెవలప్మెంట్, నూర్బుర్గ్రింగ్ చే విక్రయించబడింది. ప్రఖ్యాత సర్క్యూట్ జూలై 2012 లో దివాలా లోకి వెళ్ళింది, మరియు 2013 లో తేరుకుంది. ఈ జర్మన్ కి సంబందించిన నార్డ్ షైఫ్, ఒక గ్రాండ్ ప్రిక్స్ సర్క్యూట్ మరియు ఒక నార్త్ లూప్ కలిగి ఉంది. దాదాపు ఇది 20 మీటర్ల పొడవు కలిగివుంటుంది (13 మైళ్ళు). దీనికి "గ్రీన్ హెల్" అను ముద్దు పేరును కూడా కలిగి ఉంది. అది ఇప్పటికీ చాలా ప్రాముఖ్యత కలిగినది మరియు అతి కష్ట్టంతో ప్రపంచంలో ఈ సర్క్యూట్ ను నిర్మించడం జరిగింది.
కానీ, దురదృష్టవశాత్తు, ఏ తయారీదారుడి యొక్క కారు ఈ సర్క్యూట్ జాబితాలో జోడించడం అసాద్యమైంది. ఎందుకంటే, ఈ పోర్చే కారు యొక్క సమయాన్ని ఏ కారు దాటలేకపోయింది. అంతేకాక, ఈ సర్క్యూట్ యొక్క నార్త్ లూప్ 1927 లో నిర్మించారు మరియు ఇది 937 ఎకరాలు విస్తరించి ఉంది, దీనిలో అధనంగా ఆకుపచ్చని వాటితో విస్తరించి ఉంది. అంతేకాకుండా, ఈ లూప్ లో వివిధ బ్రాండ్ల అనేక పరీక్ష మరియు అభివృద్ధి కేంద్రాలు నిర్వహిస్తుంది. ఈ నార్త్ లూప్ ను ఈఫిల్ పర్వతాలు మరియు జర్మనీ కి చెందిన నర్బెర్గ్ కోట చుట్టూ స్థాపించారు.
0 out of 0 found this helpful