• English
  • Login / Register

ఆటోమోటివ్ హాల్ ఆఫ్ ఫేం వారు రతన్ టాటా ని చేర్చుకున్నారు

జూలై 27, 2015 03:07 pm akshit ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

డిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ రంగానికి గాను చేసిన కృషికి గాను రతన్ టాటా ని ఆటోమోటివ్ హాల్ ఆఫ్ ఫేం లో చేర్చుకోవడం జరిగింది.  

గత వారం డెట్రొఇట్ లో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో, ఈ 77 ఏళ్ళ టాటా మోటర్స్ సంస్థాపకుడికి మాజీ ఫెర్రారీ చైర్మెన్ అయిన లుకా డీ మాంటెజెమొలో, హేనెస్-ఆపెర్సన్ ఆటోమొబైల్ కి సహ సంస్థాపకుడు అయిన ఎల్వుడ్ హేనస్ మరియూ పెస్కే కార్పొరేషన్ కి సంస్థాపకుడు, చైర్మెన్ అయిన  రాడ్జర్ పెస్కే వంటి దిగ్గజాలతో పాటుగా గౌరవాన్ని అందుకున్నారు. టాటా వారికి 450 ఆటఒమోటివ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ మరియూ మీడియా వారి ఎదురుగా ఈ గౌరవం దక్కింది. 

"హాల్ ఆఫ్ ఫేం లొకి నన్ను చేర్చుకోవడం అన్నది నాకు ఒక గొప్ప గౌరవం మరియూ నాకు ఎంతో వినయపూర్వకమైనది. ఇలంటి ఆనందం నాకు ఎనండు కలుగలేదు. మా కంపెనీ తీరుతెన్నులనే మార్చివేసిన నా సహోద్యోగులకు రుణపడి ఉంటాను." అని రతన్ టాటా అన్నారు.

1939 సంవత్సరంలో ఇది మొదలైనప్పటి నుండి, ఆటోమోటివ్ హాల్ ఆఫ్ ఫేం దాదాపు గా 800 ఆటోమోటివ్ దిగ్గజాలను గౌరవించింది. వీటిలో ఆటోమోటివ్ దిగ్గజాలైన కార్ల్ బెంజ్, ఎట్టోరే బుగ్గాట్టీ, హెన్రీ ఫోర్డ్, ఫెర్డినండ్ పెయెచ్, సెర్గియో పినింఫరినా మరియూ ఫెర్డినండ్ పోర్షే లాంటి వారు ఉన్నారు. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience