• English
  • Login / Register

కార్‌దేఖో.కాం ఎఫ్ఏడీఏ తో చేతులు కలపడం వలన ఆటోమొబైల్ డీలర్లకి ఉత్తేజాన్ని అందించింది

నవంబర్ 04, 2015 01:20 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 20 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

భారతీయ ఆన్లైన్ ఆటోమొబైల్ మార్కెట్‌లలో అగ్రగామి అయిన కార్‌దేఖో.కాం వారు ఆటో మొబైల్ డీలర్స్ అసొసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తో ఎంఓయూని కుదుర్చుకున్నారు. డిజిటల్ వేదిక ద్వారా భారతీయ ఆటోమొబైల్ డీలర్లకు ఏ విధంగా లాభం చేకూర్చాలి అనే లక్ష్యంగా కలిసి పనిచేస్తారు. ఒప్పందం ప్రకారం కార్‌దేఖో.కాం వారు ఎఫ్ఏడీఏ తో కలసి ఆటో సమ్మిట్ 2016-ఎఫ్ఏడీఏ యొక్క 9వ ఆటోమొబైల్ డీలర్ల కన్వెన్షన్ ని 'డిజిటల్ డీలర్' పేరిట నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం న్యూ ఢిల్లీలో ఫిబ్రవరి 7, 2016 లో జరగనుంది. దీనికి దాదాపుగా 800-1,000 డీలర్లు దేశ వ్యాప్తంగా హాజరు కానున్నారు.

ప్రకటన గురించి మాట్లాడుతూ, కార్‌దేఖో.కాం కి సీఈఓ మరియూ సహ సంస్థాపకుడు అయిన మిస్టర్. అమిత్ జెయిన్ గారు," డిజిటల్ మీడియా మరియూ పరికరాలు ఇప్పుడు మార్కెట్ ని భారీగా ఏళుతున్నాయి కావున, కారు డీలర్లు మరియూ ఆటోమొబైల్ వ్యాపారాలు ఇప్పుడు ఈ మాధ్యమం ద్వారా అధిక లాభం పొందాలి. ఈ భాగస్వామ్యం ద్వారా మేము ఈ విధంగా వారి వారి వ్యాపారాలను విస్తరించాలి అనుకునే వారికి సహకారం అందిస్తాము," అని అన్నారు.

ఎఫ్ఏడీఏ కి ఇంటర్నాషనల్ అఫెయిర్స్ & గ్లోబల్ రిలేషన్స్ కి డైరెక్టర్ అయిన మిస్టర్.నికుంజ్ సాంఘీ గారు," ఈరోజుల్లో వాహన విచారణలు ఇంటర్నెట్ ద్వారానే ప్రజలు తెలుసుకొంటున్నారు. కాబట్టి, ఎదగాలి అంటే, ఈ మాధ్యమాన్ని వినియోగించుకోవడం ఇప్పుడు అత్యవసరం. అందుకే, ఈ విభాగంలో వినూత్న విధానాలను అనుసరించి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పెను మార్పులను తీసుకు వచ్చిన  కార్‌దేఖో.కాం ని మేము ఈ కార్యానికై ఎన్నుకోవడం జరిగింది. ఈ భాగస్వామ్యం ద్వారా, డీలర్‌షిప్‌లకి ఒక కంజ్యూమర్ బేస్ ని సృష్టించడంలో విజయవంతం అవుతాము అనే విశ్వాసంతో ఉన్నాము," అని అన్నారు.  

ఈ ఒప్పందం ద్వారా, కార్‌దేఖో.కాం వారు ఆటోమొబైల్ వ్యాపారాలకి ఆన్లైన్ విధానాన్ని అనుసరించడం ఎంత ఉపయోగకరమో తెలిపే విధంగా ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఆన్లైన్ లో ఎలా వ్యాపారాలని మెరుగు పరుచుకోవచ్చునో అనే పద్దతి వివరణనని కార్‌దేఖో.కాం అందించనుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience