ఆర్థిక వ్యయం వద్ద బ్యాటరీలను అభివృద్ధి చేసేందుకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తో చేతులు కలిపిన ARA
జనవరి 06, 2016 03:40 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
బహుశా ఇది పర్యావరణ శాస్త్రజ్ఞుల కోసం ఒక మంచి వార్త, భారతదేశం యొక్క ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ (ఏఆర్ఏఐ) ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగం కోసం తక్కువ ఖర్చుతో బ్యాటరీలు అభివృద్ధి కొరకై విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తో చేతులు కలిపారు. విద్యుత్ టెక్నాలజీతో అతిపెద్ద సవాలు ఏమిటంటే ప్రారంభంలోనే అధిక ధరను కలిగి ఉంది. హైబ్రిడ్ వాహనాలు అంచనాల ప్రకారం భారతదేశంలో మార్కెట్ ని స్వాధీనం చేసుకోపోడానికి గల కారణాలలో ఇది ప్రధానమైనది. విద్యుత్ వాహనాలు అవసరమైన బ్యాటరీల ధర దించాలని లక్ష్యంతో ఇది ఉంది.
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్, కె. శివన్ మాట్లాడుతూ " ఆటోమొబైల్ బ్యాటరీల కోసం కాన్సెప్ట్, స్పేస్ వాహనాలకు లాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఏఆర్ఏఐ సమ్యుక్త సహకారంతో, అంతరిక్షంలో ఉపయోగించిన టెక్నాలజీని ఈ కార్లలో ఉపయోగించబడింది. ఇది గనుక విజయవంతం అయితే మూడవ దశలో సామూహిక ఉత్పాదక ప్రణాళికతో వస్తుంది మరియు ఈ స్థాయిలో వాహనం యొక్క ఖరీదు తీరుతెన్నులు నిర్దేశింపబడతాయి." అని తెలిపారు. "తయారీదారులకి వాహనాలను అందించే ముందు ఏఆర్ఏఐ (EV) విద్యుత్ వాహనాలలో మరియు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు (HEV)ఉపయోగించే బ్యాటరీల యొక్క అభివృద్ధి మరియు పరీక్ష నిర్వహిస్తుంది." ఏఆర్ఏఐ డైరెక్టర్, రష్మి ఉర్ధవరెసహీ తెలిపారు. ఈ పరిశోధనపై దృష్టి భారత ఆటోమేటివ్ పరిశ్రమ కోసం EV-HEV టెక్నాలజీ ని అభివృద్ధి చేసేందుకు కూడా మరియు స్వచ్చమైన వాతావరణం అందించేందుకు పెట్టబడింది. ఇది దిగుమతి ప్రత్యామ్న్యాంగా పనిచేసి మరియు భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా కి కూడా లోబడి ఉంటుంది." అని ఆమే తదుపరి జోడించారు.
వాహనతయారీదారులు మార్కెట్ లోకి టెక్నాలజీని చొప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన భాగాల తయారీ కి పెట్టుబడి పెట్టేందుకు మారుతి సుజుకీ మరియు మహీంద్రాతో చేతులు కలిపింది. ఏఆర్ఏఐ చొరవ వివిధ కార్ల తయారీ కంపెనీలు ద్వారా అటువంటి ప్రయత్నాల సహకారానికి అవకాశం ఉంది.
ఇంకా చదవండి