అపొల్లో టైర్లు అరంతర్జాతీయంగా జార్డన్ మరియూ అమన్ కి విస్తరిస్తున్నాయి
అక్టోబర్ 28, 2015 12:26 pm manish ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యా ఖ్యను వ్రాయండి
జైపూర్:
అపోల్లో టైర్లు జార్డన్ మరియూ అమన్ లలో డీలర్‌షిప్లను ప్రారంభించి వారి బ్రాండ్ ని అంతర్జాతీయంగా విస్తరిస్తున్నారు. మధ్యప్రాచ్య దేశాలలో మార్కెట్ ని పెంచుకోవడం కొరకు కంపెనీ వారు ఈ అడుగు వేశారు. కస్టమర్ యొక్క రీటెయిల్ అనుభవం మెరుగు పరిచేందుకు గాను ఉత్పత్తుల యొక్క ప్రదర్శన అందించి, ఇందులో వ్యవసాయ, ప్యాసెంజర్ కారు, ట్రక్ మరియూ బస్ టైర్లు వంటి వాటి గురించి తెలుపబడతాయి. ఈ కొత్తగా ప్రారంభించిన డీలర్‌షిప్లతో పాటుగా ఇప్పుడు పూర్తిగా 5 బ్రాండెడ్ రీటెయిల్ ఔట్‌లెట్లు మధ్యప్రాచ్య దేశాలలో ఉన్నాయి.
" జార్డన్ మరియూ మధ్య ప్రాస్చ్య దేశాలలో ప్యాసెంజర్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. ది ఐడీల్ ఫర్ ఇంపోర్ట్ ఎండ్ ఎక్స్‌పోర్ట్ తో మా 13 ఏళ్ళ భాగస్వామ్యం వలన మేము బలమైన కస్టమర్ బేస్ ని పొందగలిగాము," అని అపోల్లో టైర్ల ఆసియా పసఫిక్, మధ్య ప్రాస్చ్య & ఆఫ్రికాల యొక్క ప్రెసిడెంట్ అయిన సతీష్ శర్మ గారు తెలిపారు.
"ఈ వివిధ అపోల్లో జోన్స్ ద్వారా మేము మా బ్రాండ్ యొక్క ప్రాముఖ్యతను పెంచాలి అని యోచిస్తున్నాము. మేము నెలకి 1,00,000 కస్టమర్ జార్డన్ టైర్ మార్కెట్ ద్వారా కస్టమర్లకు చేరువ అవ్వాలి అని ప్రయత్నిస్తున్నాము," అని అన్నారు.