2015 అంతర్జాతీయ ఉత్తమ ఇంజిన్ అవార్డులు
జూన్ 19, 2015 07:27 pm raunak ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
2015 అంతర్జాతీయ ఇంజిన్ అవార్డును ఈసారి 1.5 లీటర్ పెట్రోల్ విద్యుత్ హైబ్రిడ్ ఇంజన్ కలిగిన బిఎండబ్ల్యూ ఐ8 గెలుచుకుంది. అంతేకాకుండా, 'ఉత్తమ ఇంజిన్ అండర్ 1.0 లీటర్' అవార్డును ఫోర్డ్ ఈకోస్పోర్ట్ లో ఉన్న ఈకో బూస్ట్ ఇంజన్ వరుసగా నాలుగవ సారి ఈ అవార్డును కైవశం చేసుకుంది.
జైపూర్: బిఎండబ్ల్యూ ఐ8 యొక్క 1.5 లీటర్ పెట్రోల్ విద్యుత్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్, 2015 అంతర్జాతీయ ఇంజన్ ఇయర్ అవార్డు ను కైవశం చేసుకుంది. అంతేకాకుండా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ యొక్క ఈకో బూస్ట్ ఇంజన్ వరుసగా 3 సార్లు బెస్ట్ ఇంజన్ అవార్డు ను సాధించింది.
ఈ 1.5 లీటర్ హైబ్రిడ్ ఇంజన్ కు గాను బిఎండబ్ల్యూ అవార్డును సొంతం చేసుకుంది. ఈ ఇంజన్ 3 సిలండర్ల విధ్యుత్ మోటార్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 362 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా టార్క్ విషయానికి వస్తే, అత్యధికంగా 570 Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ వాహనాలు 0 kmph నుండి 100 kmph వేగాన్ని చేరుకోవడానికి 4.4 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ వాహనాలు 250 kmph వేగాన్ని కూడా చేరుకోగలవు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఈ వాహనం ప్రపంచ గ్రీన్ కార్ అవార్డు కూడా గెలిచింది. ఎందుకంటే, ఒక కిలో మీటరుకి 49 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేసింది. మరియు ఈ వాహనాలు 2 లీటర్ల పెట్రోల్ కు 100 కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తాయి.
ఫోర్డ్ 3 వరుస విజయాలు తర్వాత, ఈ సంవత్సరం 2015 అంతర్జాతీయ ఇంజిన్ సింహాసనాన్ని కోల్పోయినా, వరుసగా నాలుగో సారి 1.0 లీటర్ వర్గం కింద ఉత్తమ ఇంజిన్ లో వారి విజేత కేళి కొనసాగింది.
ఈ 1.0 లీటర్ ఈకో బూస్ట్ ఇంజన్, ఈ విభాగంలో ఉత్తమ మైనది మాత్రమే కాదు. ఇది ఇంధన సామర్ధ్యం విషయం లో కూడా ఉత్తమ మైనది. దీని యొక్క పవర్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 140 bhp పవర్ ను విడుదల చేస్తుంది. మరియు అదే 3-సిలిండర్ల తో జత చేయబడి ఉంటుంది.
అధిక పనితీరు ఇంజన్ అవార్డ్, 4.5 లీటర్ వి8 ఇంజన్ కలిగిన ఫెర్రరీ ఈ అవార్డు ను కైవశం చేసుకుంది. ఈ ఇంజన్ ను ఫెర్రరీ 458 స్పెషల్ మరియు స్పెషల్ ఏ వాహనాలలో అమర్చారు. పెర్ఫోమెన్స్ విభాగంలో, మారనెల్లో ఆధారంగా తయారుచేయబడిన ఈ సూపర్ కారు వరుసగా అయిదవ సారి ఈ అవార్డు ను సొంతం చేసుకుంది.
0 out of 0 found this helpful