రూ.10.89 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్

కియా సెల్తోస్ కోసం ansh ద్వారా జూలై 21, 2023 05:57 pm ప్రచురించబడింది

  • 9.7K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మూడు విస్తృత వేరియెంట్ؚలలో లభిస్తుంది: టెక్ లైన్, GT లైన్ మరియు X-లైన్2023 Kia Seltos

సరికొత్త డిజైన్, మరిన్ని ఫీచర్‌లతో 2023 సెల్టోస్ؚను ఇటీవల కియా ఆవిష్కరించింది. నవీకరించిన కాంపాక్ట్ SUV బుకింగ్ؚలను కియా జూలై 14న ప్రారంభించింది, ఒకే రోజులో 13,424 బుకింగ్ؚలను అందుకుంది. ప్రస్తుతం, కియా తన పూర్తి వేరియెంట్-వారీ ధరల జాబితాను వెల్లడించింది. మీరు తెలుసుకోవలసిన పూర్తి సమాచారం క్రింద అందించబడింది.

ధరలు

వేరియెంట్ؚలు

1.5-లీటర్ పెట్రోల్ MT

1.5-లీటర్ పెట్రోల్ CVT

1.5-లీటర్ డీజిల్ iMT

1.5-లీటర్ డీజిల్ AT

1.5-లీటర్ టర్బో-పెట్రోల్ iMT

1.5-లీటర్ టర్బో-పెట్రోల్ DCT

HTE 

రూ. 10.89 లక్షలు

-

రూ. 11.99 లక్షలు

-

-

-

HTK

రూ. 12.09 లక్షలు

 

రూ. 13.59 లక్షలు

-

-

-

HTK+

రూ. 13.49 లక్షలు

-

రూ. 14.99 లక్షలు

-

రూ. 14.99 లక్షలు

-

HTX

రూ. 15.19 లక్షలు

రూ. 16.59 లక్షలు

రూ. 16.69 లక్షలు

రూ. 18.19 లక్షలు

-

-

HTX+

-

-

-

-

రూ. 18.29 లక్షలు

రూ. 19.19 లక్షలు

GTX+

-

-

-

రూ. 19.79 లక్షలు 

-

రూ. 19.79 లక్షలు

X-లైన్

-

-

-

రూ. 19.99 లక్షలు

-

రూ. 19.99 లక్షలు

అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ పరిచయ ధరలు

నిలిపివేస్తున్న మోడల్ؚతో పోలిస్తే దీని ప్రారంభ ధరలో మార్పు లేకపోయినా, టాప్-స్పెక్ సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ ప్రస్తుత ధర రూ.20 లక్షలకు దగ్గరగా ఉంది, ఈ ధరతో ఇది మార్కెట్ؚలో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన కాంపాక్ట్ SUVగా నిలుస్తుంది.

పవర్ؚట్రెయిన్

2034 Kia Seltos Turbo-petrol Engine

నవీకరించిన కియా సెల్టోస్ మూడు ఇంజన్ ఎంపికలలో వస్తుంది: 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్ؚబాక్స్ؚతో జోడించిన 1.5-లీటర్ పెట్రోల్ (115PS/144Nm), 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ లేదా 6-స్పీడ్ iMTతో జోడించిన 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (116PS/250Nm) మరియు 6-స్పీడ్ iMT లేదా 7-స్పీడ్ DCT గేర్ؚబాక్స్ؚతో జోడించిన 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ (160Ps/253Nm). 

ఫీచర్‌లు & భద్రత

2023 Kia Seltos Cabin

ఈ నవీకరణలో డ్యూయల్ 10.25-అంగుళాల డిస్ప్లేؚలు (టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే), డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు పనోరమిక్ సన్ؚరూఫ్ వంటి ఎన్నో ఫీచర్ అప్ؚగ్రేడ్ؚలను సెల్టోస్ పొందింది. వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్, యంబియంట్ లైటింగ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్‌లను కొనసాగించింది.

ఇది కూడా చదవండి: కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ GT లైన్ మరియు టెక్ లైన్ తేడాల పరిశీలన

ప్రయాణీకుల భద్రత విషయానికి వస్తే, ఆరు ఎయిర్ బ్యాగులను ప్రామాణికంగా అందిస్తున్నారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360-డిగ్రీల కెమెరా, ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్, లేన్-కీప్ ఆసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి మరికొన్ని అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్‌లను పొందుతుంది.  

పోటీదారులు

Kia Seltos facelift white

హ్యుందాయ్ క్రెటా, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ మరియు MG ఆస్టర్ؚలతో నవీకరించిన సెల్టోస్ పోటీని కొనసాగిస్తుంది. సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ మరియు హోండా ఎలివేట్ వంటి రాబోయే కాంపాక్ట్ SUVలతో కూడా పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి: కియా సెల్టోస్ డీజిల్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన కియా సెల్తోస్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience