• English
  • Login / Register

ప్రామాణిక భద్రత లక్షణాలు - 2015 సంవత్సరం కంపనీ తయారీదారులు అందిస్తున్న నిజమయిన ఫీచర్స్

డిసెంబర్ 28, 2015 02:41 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2015 భారత ఆటోమోటివ్ రంగం చరిత్రలో ప్రామాణిక ద్వంద్వ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో వచ్చినటువంటి మాస్ మార్కెట్ వాహనాలని గుర్తు చేస్తుంది.

న్యూ డిల్లీ : వాహనాలలో భద్రత పట్ల వచ్చిన అవగాహన చూడటానికి ఒక మంచి పరిణామమే అని చెప్పవచ్చు. కాని చాలా మంది ఈ భద్రతా లక్షణాలని లగ్జరీ పరంగా వచ్చిన మార్పులు అని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇటీవలే ఎ బి ఎస్ ఫీచర్ తో వచ్చినటువంటి ప్రామాణిక ఎయిర్బ్యాగ్స్ ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఎందుకనగా కొనుగోలు దారులు అడిగితే తప్ప తయారీదారులు ఇటువంటి లక్షణాలని అందించరు. ముఖ్యంగా మన భారతదేశంలో కొనుగోలుదారులకి ఇటువంటి లక్షణాలు అక్కర్లేదు. ! వోక్స్వాగన్ మరియు టయోటా, సంస్థలు 2014 సంవత్సరంలో మొదటిసారి ఈ ప్రామాణిక లక్షణాలని కలిగి ఉన్నాయి. అయితే, 2015 లో అతిపెద్ద ఆటోమోటివ్ తయారీదారు మారుతి సుజుకి తో సహా చాలావరకు ఆటోమోటివ్ తయారీదారులు ఈ ఫీచర్స్ ని కలిగి ఉన్నాయి. ఈ సంవత్సరం ఏ ఏ ఇతర సంస్థల వాహనాలు ఇలాంటి భద్రతా ఫీచర్లని కలిగి ఉన్నాయో చూద్దాం పదండి.

మారుతి సుజుకి ;

విమర్శకులు గత సంవత్సరం స్విఫ్ట్ tయొక్క క్రాష్ పరీక్షలు పేలవంగా ఉన్నాయని విమర్శించారు. మారుతీ Nexa విభాగం నుంచి రాబోయే కొత్త ఉత్పత్తులు ఎ బి ఎస్ ని కలిగి ఉన్నటువంటి ప్రామాణిక ఎయిర్బ్యాగ్స్ తో రాబోతున్నాయి. Nexa డీలర్షిప్ వాళ్ళు పరిచయం చేస్తున్నటువంటి S-క్రాస్, ఎ బి ఎస్ ఫీచర్ తో వస్తున్నటువంటి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని కలిగి రాబోతుంది. కొత్త బలేనో  కుడా ఇలాంటి లక్షణాలతోనే రాబోతోంది. ఆటో తయారీదారుడు డ్యూయల్- ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ మరియు ఎ బి ఎస్ తో పాటు భద్రత ప్యాక్ ని కుడా కలిగి ఉండబోతోంది. స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, సెలెరియో, మొదలయిన ఉత్పత్తులు బేస్ వేరియంట్ నుండి ప్రారంభించబడ్డాయి.

ఫోర్డ్ ఇండియా :

భారతదేశంలో ఫోర్డ్ దాని లైన్ అప్ ఉత్పత్తులయినటువంటి కొత్త ఫిగో మరియు ఫిగో ఆస్పిరే  లని పునరుద్దరించుకుంది. అమెరికన్ తయారీదారుడు వాహనాల భద్రతా విషయం పై ప్రత్యేకమయిన దృష్టిని సారించింది. కొత్త ఫిగో కన్నా ముందరే ఆస్పిరే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని కలిగి ఉండి, టాప్ ఎండ్ వేరియంట్ విభాగంలో మొదటి- 6- ఎయిర్బ్యాగ్స్ తో వచ్చింది. ఫిగో కూడా ఇదే తరహా ఉత్పత్తులతో ప్రారంభించబడింది. కానీ బేస్ వేరియంట్ ఫిగో మాత్రమే ప్రామాణికంగా డ్రైవర్ ఎయిర్బ్యాగ్ ని కలిగి ఉంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ఆస్పిరే రెండవ వేరియంట్ నుండి ప్రారంభం అయ్యాయి. ఈ కారు యొక్క అగ్ర శ్రేణి వేరియంట్, 6 ఎయిర్బ్యాగ్స్ తో వస్తుంది. ఫోర్డ్ ఫిగో మరియు ఆస్పిరే యొక్క డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ పెట్రోల్ వెర్షన్లు కుడా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ ఆప్షన్స్ తో వస్తున్నాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా

దేశం లోని అతిపెద్ద యుటిలిటీ తయారీదారు, అయినటువంటి M & M కూడా దాని బేస్ వేరియంట్లలో భద్రత లక్షణాలని అందించడం ప్రారంబించింది.  ఎయిర్బ్యాగ్స్ మరియు ఎ బి ఎస్ ని దాని బేస్ వేరియంట్ నుండి ప్రారంభించింది. అంతేకాకుండా ఎంతగానో ఊహించినటువంటి రాబోయే KUV1OO (కోడ్ నేమ్ S101) సూక్ష్మ SUV, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని దాని బేస్ వేరియంట్ ట్రిమ్ నుండి ప్రారంభించింది.

ఈ సంస్థ భారతీయ కొనుగోలు దారులు కోసం ఇప్పటిదాకా వచ్చిన ఫీచర్స్ కంటే , ఖచ్చితంగా ఇంకా ఎక్కువ భద్రతా ఫీచర్స్ ని అందిస్తామని వెల్లడించింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience