బాన్ కి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును సంప్రదించిన మెర్సిడెస్, టొయోటా మరియు మహీంద్రా
సుప్రీం కోర్టు విధించిన నిషేధం ఒత్తిడిని ఎదుర్కొంటున్న, టొయోటా , మహీంద్రా అండ్ మెర్సిడెస్ వంటి వాహన తయారీదారులు ఉత్తర్వును పునః పరిశీలించుకోవలసిందిగా అత్యున్నత న్యాయస్థానాన్నిచేరుకున్నాయి. ఈ పిటీషన్ సుప్రీం కోర్ట్ డిల్లీలో 2,000 సిసి లేదా అంతకంటే ఎక్కువ సామ్ర్ధ్యం కలిగియున్న డీజిల్ ఇంజిన్ల నిషేధాన్ని ప్రకటించినప్పుడు వచ్చింది. మొదట్లో, ఈ బాన్ మూడు నెలల కాలానికి ప్రకటించబడింది మరియు ఈ విషయం పై తదుపరి నిర్ణయం ఈ కాలంలో చేసిన పరిశీలనల ఆధారంగా తీసుకోవాలి. ఇది కాకుండా, కోర్టు కూడా ఢిల్లీలో అన్ని టాక్సీలు మార్చి 31, 2016 నాటికి సిఎన్జి గా మారాలని ప్రకటించింది. ఈ పిటీషన్ నిషేధానికి వ్యతిరేకంగా మూడు కారు తయారీసంస్థలు దాఖలు చేసారు, నిన్న కోర్ట్ ముందుకు వచ్చింది.
ఈ నిషేంధం పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మహీంద్రా అండ్ మహీంద్రా డైరెక్టర్ ఈ విధంగా అన్నారు " డీజిల్ వాహనాలు ప్రభుత్వం కట్టుబాటును పాటిస్తున్నప్పటికీ ఎందుకు డీజిల్ ఇంజిన్లు అపరాధిగా కనిపిస్తున్నాయో నాకు అర్ధం కావడం లేదు. ఒక ఉత్పత్తి అన్ని నియమాలను పాటిస్తున్నప్పుడు అది ఏ విధంగా నిషేంధించబడుతుంది. ఆటో పరిశ్రమ ప్రతినిధులతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మా డీలర్షిప్ల వద్ద ఉన్న వాహనాలను ఏమి చేయాలో మాకు అర్ధం కావడం లేదు, త్వరలోనే దీనికి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాము. " అని ఆయన తదుపరి జోడించారు.
భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) జనరల్ డైరెక్టర్, విష్ణు మాథుర్ మాట్లాడుతూ " ఆటో ఇండస్ట్రీ ఒక మృదువైన లక్ష్యంగా ఉంది. గత కొన్నేళ్ళుగా, కోర్టు మాకు ఏదైతే చేయాలని కోరుకుందో మేము అది చేసాము. ఒక సమగ్రమైన ప్రణాళిక లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి ఉపయోగకరమైన ప్రయోజనాలు ఉండవు." అని వివరించారు.
మూడు కంపెనీలు నియంత్రణ వలన ప్రభావితం అయ్యాయి. అయితే, మెర్సిడెస్ SUVలకు చెందిన దాదాపు దాని మొత్తం లైనప్ ని కోల్పోయింది మరియు మహీంద్రా సంస్థ స్కార్పియో, XUV500 మరియు బొలేరో వంటి కార్లను మిస్ అయ్యింది. టొయోటా కుడా ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవా వంటి దాని ఉత్తమంగా అమ్ముడుపోయే రెండు కార్లను నష్టపోయింది. ఈ రెండూ కూడా 2 లీటర్ల ఎక్కువ డిజిల్ ఇంజన్ సామర్థ్యం కలిగి ఉన్నాయి.
ఇంకా చదవండి
డిల్లీలో డీజిల్ బాన్ ద్వారా పేరుకున్న 1,000 ఖరీదు కార్లు ఇంకా మహింద్రా ఎదుర్కొంటున్న అడ్డంకులు