ఆరవింద్ సక్సేనా తరువాత GM ఇండియా అధిపతిగా రానున్న kaher-kazem
డిసెంబర్ 09, 2015 01:48 pm akshit ద్వారా ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ:
జనరల్ మోటార్స్ యొక్క చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ప్రస్తుతం పనిచేస్తున్న కహెర్ కాజీమ్, జనవరి 1, 2016 నుండి అమెరికన్ వాహన పరిశ్రమ అయిన జనరల్ మోటార్స్ భారతీయ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ మరియు అధ్యక్షుడిగా నియమింపబడ్డారు. దాదాపు రెండు సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేసిన ఆరవింద్ సక్సేనా తన పదవి నుండి తప్పుకోవడానికి నిర్ణయం తీసుకోవడంతో కహెర్ కాజీమ్ కి ఈ అవకాశం వచ్చింది.
GM ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ మరియు అంతర్జాతీయ ప్రెసిడెంట్ అయిన Stefan Jacoby మాట్లాడుతూ," వ్యాపారంలో ప్రత్యక్ష అనుభవం మరియు జ్ఞానం ఉండడం వలన మేము అతనిని GM ఇండియా అధ్యక్షుడిగా నియమించడానికి నిర్ణయం తీసుకున్నాం. "జనరల్ మోటార్స్ చాలా కాలం నుండి ఇండియాతో ముడిపడి ఉంది. కహెర్ యొక్క ప్రఖ్యాతి మరియు సమర్ధత వలన భారత వినియోగదారులకు గొప్ప వాహనాలను అందిచడంతో పాటు వారు కోరుకున్న విధంగా అంతర్జాతీయ కస్టమర్ అనుభవాన్ని కలిగించడం వీలవుతుందని తెలిపారు."
46 ఏళ్ల ఆస్ట్రేలియన్ ఎగ్జిక్యూటివ్ అయిన కహెర్,జనరల్ మోటార్స్ భారతీయ విభాగం యొక్క COOగా ఈ సంవత్సరం ఆగస్ట్ లో నియమించబడ్డారు. అంతకుముందు 2012 నుండి GMఉజ్బెకిస్తాన్ ఆపరేషన్స్ నిర్వహించారు. 1995లో
అతను ఒక సీనియర్ ఇంజనీర్ గా ఆస్ట్రేలియాలో GM హోల్డెన్ చేరారు మరియు అక్కడ అనేక నాయకత్వ స్థానాలలో పనిచేసిన తరువాత 2009లో అతను GM థాయిలాండ్ /ఏసియన్ లో మ్యానుఫ్రాక్చరింగ్ అండ్ క్వాలిటీ విభాగానికి
వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. తరువాత 2012 నుండి GM ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేసి, పోయిన సంవత్సరం ఇండియా COO గా వచ్చారు.
కానీ మరోవైపు 'వోక్స్వాగన్ AG మరియు హ్యుందాయ్ మోటార్ ఇండియా'లలో గతంలో పని చేసిన 55 ఏళ్ల సక్సేనా, కేవలం రెండు సంవత్సరాల తర్వాత వెంటనే పదవి నుండి విరమణ తీసుకోవడానికి గల కారణం ఇంకా అస్పష్టంగా ఉంది.
ఇది కూడా చదవండి: