హోండా Jazz

` 5.8 - 9.1 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

హోండా ఇతర కారు మోడల్లు

 
*Rs

హోండా Jazz వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
హోండా అనేది, జపాన్ ఆధారిత బహుళజాతి ఆటోమొబైల్ సంస్థ గా నాటుకుపోయింది. అంతేకాకుండా, ఇది అనేక ప్రపంచ మార్కెట్లలో స్థాపించబడినది. ఈ సంస్థ భారతదేశం లో వేగంగా పెరుగుతోంది. దీని నమూనాలు దేశవ్యాప్తంగా అనూహ్యంగా వ్యాప్తిచెందాయి. ఇప్పుడు, ఈ సంస్థ దాని అత్యంత వాంఛనీయ హాచ్బాక్ లలో ఒకటైన ఈ హోండా జాజ్ ను భారతదేశ మార్కెట్ లో పునఃప్రారంభం చేసింది. ఈ ప్రీమియం హాచ్బాక్ పరిచయం ద్వారా, భారతదేశం లో దాని అడుగులను మరింత బలోపేతం చేయబడింది. ఇది నిస్సందేహంగా, సంస్థ నిర్మించిన అత్యంత అందమైన వాహనాలలో ఒకటి అని చెప్పవచ్చు. ఇది ఒక సబ్ 4 మీటర్స్ వాహనం. మునుపటి వెర్షన్ పోలిస్తే, ఈ వాహనం నిర్దేశాలు, లక్షణాలు, లుక్స్, టెక్నాలజీ పరంగా ప్రతి అంశాలలో మెరుగుదలను చూపించాయి. డిజైన్ విషయానికి వస్తే, ఈ ఏకైక నిర్మాణం స్వచ్ఛమైన ఏరోడైనమిక్స్ మరియు తదుపరి తరం స్టైలింగ్ లను సూచిస్తుంది. అత్నేకాకుండా, ఈ వాహనం ఒక అద్భుతమైన బాహ్య డిజైన్ ను కలిగి ఉంటుంది.ఈ వాహనం సైడ్ ప్రొఫైల్ ను గనుక చూసినట్లైతే, మందపాటి లైన్లు చెక్కబడి ఉంటాయి. ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, చుట్టబెట్టిన హెడ్ లైట్ క్లస్టర్ ఉంటుంది. దీనిలో హాలోజెన్ ల్యాప్స్ తో పాటు టర్న్ ఇండికేటర్స్ బిగించి ఉంటాయి. అంతేకాకుండా, ఈ వాహనం పెద్ద విండ్ స్క్రీన్ ను మరియు రెండు వైపర్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, నలుపు రంగులో నిగనిగలాడే రేడియేటర్ గ్రిల్ మరియు ఒక విలక్షణమైన శైలిలో ఒక క్రోమ్ అండర్లైన్ అమర్చబడి ఉంటాయి. ఈ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లలో అల్లాయ్ వీల్స్ ప్రామాణికంగా అందించబడతాయి. అదే మిగిలిన వేరియంట్ ల విషయానికి వస్తే, స్టీల్ వీల్స్ అందించబడతాయి. ఈ వాహనం యొక్క అంతర్గత భాగాల విషయానికి వస్తే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు ఎల్ సి డి, ఆడియో మరియు ఒక విద్యుత్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ కొరకు 12.7 సెంటీమీటర్ల ప్రదర్శన వంటి అంశాలు ఈ వాహనం లో పొందుపరచబడ్డాయి.

ఎప్పుడూ చూడనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా, ఈ హ్యాచ్బ్యాక్ డీజిల్, పెట్రోల్ ఇంజన్ ఎంపికలు తో ఇప్పుడు అందుబాటులో ఉంది. హోండా బ్రయో మరియు అమేజ్ లో ఉండే 1.2 లీటర్ ఐ- విటెక్ పెట్రోల్ ఇంజన్ ను దీనిలో అమర్చారు. ఈ సిరీస్ లో ఏడు పెట్రోల్ వేరియంట్ లు అందుబాటులో ఉన్నాయి. దీనిలో రెండు సివిటి ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. మరోవైపు, ఈ వాహనాల డీజిల్ వేరియంట్ లు 1.5 లీటర్ ఐ- డిటెక్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటాయి. ఈ ఇంజన్ లు 6- స్పీడ్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. అంతేకాకుండా, ఈ సంస్థ యొక్క తయారీదారుడు ఈ సిరీస్ యొక్క అన్ని డీజిల్ వేరియంట్ లలో ఏబిఎస్ మరియు ఈబిడి లను ప్రామాణిక అంశాలుగా అందించాడు. ఈ వాహనం, 354 లీటర్ల బూట్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. దీనిని, వెనుక సీట్ మడవటం ద్వారా మరింతగా 881 లీటర్ల వరకు పెంచవచ్చు. అంతేకాకుండా, ఈ హాచ్బాక్ అనేక లక్షణాలను కలిగి ఉంది. అవి వరుసగా, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్, ఒక బహుళ-వ్యూ వెనుక పార్కింగ్ కెమెరా వంటి అనేక లక్షణాలను కూడా కలిగి ఉంది. ఈ వాహనం, హ్యుందాయ్ ఎలైట్ ఐ 20, వోక్స్వ్యాగన్ పోలో, మారుతి స్విఫ్ట్ మరియు ఫియట్ పుంటో ఈవో వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ వాహనాల యొక్క డీజిల్ వేరియంట్ లు, ఈ విభాగంలో అత్యంత ఎక్కువ ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తాయి. ఏ ఆర్ ఏ ఐ సర్టిఫికేషన్ ప్రకారం 27.3 కెఎంపిఎల్ మైలేజ్ ను అందిస్తాయి. మరోవైపు, దీని యొక్క పెట్రోల్ వేరియంట్ లు 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. ఈ ఇంజన్ గల వాహనాలు అత్యధికంగా 18.7 కెఎంపిఎల్ మైలేజ్ ను అందిస్తాయి. మరోవైపు ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ లు 19 కెఎంపిఎల్ మైలేజ్ ను అందిస్తాయి.

శక్తి సామర్థ్యం:


ఈ సిరీస్ యొక్క డీజిల్ వేరియంట్ లు 1.5 లీటర్ ఐ- డి టెక్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 98.6 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 200 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. మరోవైపు, పెట్రోల్ వేరియంట్ ల విషయానికి వస్తే, ఈ వాహనాలు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటాయి. అంతేకాకుండా, ఈ ఇంజన్ అత్యధికంగా 89 బి హెచ్ పి పవర్ ను మరియు అదే విధంగా 110 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ వాహనం యొక్క డీజిల్ వేరియంట్ లు, 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. ఆ సమయంలో ఈ వాహనం, 0 కెఎంపిహెచ్ నుండి 100 కెఎంపిహెచ్ వేగాన్ని చేరడానికి 11 నుండి 12 సెకన్ల సమయం పడుతుంది. మరో వైపు, ఇదే వాహనం 170 నుండి 180 కెఎంపిహెచ్ వేగాన్ని చేరుకోగలుగుతుంది. పెట్రోల్ వేరియంట్ల విషయానికి వస్తే, ఈ వాహనాల ఇంజన్ లు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ వాహనాలు 0 నుండి 100 కెఎంపిహెచ్ వేగాన్ని చేరడానికి 13 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం, 155 కెఎంపిహెచ్ వేగాన్ని చేరుకోగలుగుతుంది.

వెలుపలి డిజైన్:


పైన పేర్కొన్న విధంగా, ఈ వాహనం ఒక అద్భుతమైన బాహ్య డిజైన్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం యొక్క శైలి మరియు చక్కదనం తదుపరి స్థాయి ని సూచిస్తుంది. ఈ సంస్థ ఏరోడైనమిక్స్ పై దృష్టి సారించింది. ఎందువలనంటే, ఈ వాహనానికి ఒక సొగసైన లుక్ ను ఇవ్వడం కోసం. ఈ వాహనం సైడ్ ప్రొఫైల్ ను గనుక చూసినట్లైతే, మందపాటి లైన్లు చెక్కబడి ఉంటాయి. దీని వలన సైడ్ ప్రొఫైల్ మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, చుట్టబెట్టిన హెడ్ లైట్ క్లస్టర్ ఉంటుంది. దీనిలో హాలోజెన్ ల్యాంప్స్ తో పాటు టర్న్ ఇండికేటర్స్ బిగించి ఉంటాయి. ఇతర వాహనాలు వలె కాకుండా, ఈ వాహనం ముదరి భాగం లో ఒక పెద్ద విండ్ స్క్రీన్ ను కలిగి ఉండటమే కాకుండా దీనిపై ఒక జత వైపర్స్ కూడా బిగించి ఉంటాయి. అంతేకాకుండా, నలుపు రంగులో నిగనిగలాడే రేడియేటర్ గ్రిల్ ఉండటం అనేది మరొక ఆకర్షణీయమైన అంశం అని చెప్పవచ్చు. అంతేకాకుండా, ఒక విలక్షణమైన శైలిలో ఒక క్రోమ్ అమర్చబడి ఉంటుంది. ఈ సిరీస్ యొక్క 'వి మరియు వి ఎక్స్ ' వేరియంట్ లలో అల్లాయ్ వీల్స్ ను ప్రామాణికంగా అందించబడతాయి. అదే మిగిలిన వేరియంట్ ల విషయానికి వస్తే, స్టీల్ వీల్స్ అందించబడతాయి. ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, వెనుక బంపర్ రెండు ఎయిర్ వెంట్స్ ను కలిగి ఉండటం వలన స్పోర్టీ లుక్ ను సొంతం చేసుకోగలుగుతుంది. వెనుక టైల్ గేట్ మందపాటి క్రోమ్ ప్లేటెడ్ స్లాట్ పై బిగించబడి ఉంటుంది. అంతేకాకుండా సంస్థ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది. మరో ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే, రేర్ స్పాయిలర్. దీనికి ఒక హై మౌంట్ స్టాప్ ల్యాంప్ బిగించి ఉంటుంది.

వెలుపలి కొలతలు:


కొలతలు పరంగా ఈ వాహనం, 3955 మిల్లీ మీటర్ల పొడవును, 1524 మిల్లీ మీటర్ల ఎత్తు ను, 1694 మిల్లీ మీటర్ల వెడల్పును మరియు 165 మిల్లీ మీటర్ల కనీస గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంటుంది. మరోవైపు, ఈ వాహనం 2530 మిల్లీ మీటర్ల పొడవైన వీల్బేస్ ను కలిగి ఉంటుంది.

లోపలి డిజైన్:


అంతర్గత భాగాల విషయానికి వస్తే, ఈ వాహనం హాయిగా ఐదు ప్రయాణీకుల కూర్చునే సదుపాయాన్ని కలిగి ఉంటుంది. హోండా సిటీ సెడాన్ లో ఉండే మాదిరిగా దీని యొక్క డాష్బోర్డ్ కాక్పిట్ రూపొందించబడింది. ఈ డాష్బోర్డ్ పై డ్రైవర్ కు అవసరమైన సమాచారం అందించే ఒక ఎల్ సి డి ప్రదర్శన కలిగిన ఒక అధునాతన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుపరచబడి ఉన్నాయి. ఈ వాహనం యొక్క స్టీరింగ్ వీల్ మూడు స్పోక్ ల రూపకల్పన కలిగి మరియు ఆడియో నియంత్రణ స్విచ్లను ఈ స్టీరింగ్ వీల్ పై అమర్చారు. దీనితో పాటుగా, ఈ వాహనాల ఆటోమేటిక్ వెర్షన్, స్టీరింగ్ వీల్ తో పాటు గేర్ షిఫ్ట్ పెడల్స్ ను కలిగి ఉంటుంది. ఇది ఒక అదనపు ప్రయోజనం అని చెప్పవచ్చు. ఈ డాష్బోర్డ్ గ్లవ్ బాక్స్, అనుబంధ పవర్ సాకెట్లు మరియు కొన్ని నియంత్రణ స్విచ్లు వంటి అనేక వినియోగ లక్షణాలను కలిగి ఉంది. ఈ వాహనం యొక్క సెంటర్ కన్సోల్ బ్లాక్ హై గ్లాస్ ఫినిష్ తో ఉంటుంది. డోర్ ఆర్నమెంట్స్, కాంబినేషన్ మీటర్, ఏసి వెంట్ లకు వెండి చేరికలతో అలంకరించబడి ఉంటుంది. ఈ వాహనాల దిగువ శ్రేణి వేరియంట్ ను ప్రక్కన పెడితే, మిగిలిన అన్ని వేరియంట్ లు డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. ఈ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లు, వెనుక వారి కోసం ప్రత్యేక మేజిక్ సీటు మోడ్ లను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా, దీనిలో దీర్ఘ, రిఫ్రెష్, పొడవైన మరియు యుటిలిటీ వంటి మోడ్ లను కూడా కలిగి ఉన్నాయి

లోపలి సౌకర్యాలు:


కొత్తగా ప్రవేశపెట్టబడిన ఈ హాచ్బాక్, కుటుంబసభ్యులకు ఒక ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇవ్వడం కోసం అనేక ఆధునిక సౌకర్యం లక్షణాలను కలిగి ఉంది. ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లలో ఒక ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ ను అమర్చారు. వి మరియు వి ఎక్స్ వేరియంట్ ల విషయానికి వస్తే, ఆటో ఏసి తో పాటు టచ్ స్క్రీన్ ప్యానల్ ను అమర్చారు. దీనిని కలిగి ఉండటం వలన క్యాబిన్ మొత్తాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతుంది. అంతేకాకుండా, ఇతర లక్షణాల జాబితా విషయానికి వస్తే, పవర్ స్టీరింగ్ వ్యవస్థ, విద్యుత్ తో మడత వేయగల మరియు సర్దుబాటు చేయగల ఓ ఆర్ వి ఎం లు, కీ లెస్ ఎంట్రీ తో సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్, రేర్ పార్సెల్ షెల్ఫ్, ముందరి ప్రయాణికుడి వైపు వానిటీ మిర్రర్ తో లిడ్ మరియు క్లాక్ వంటి అంశాలను పొందుపర్చారు.

లోపలి కొలతలు:


ఈ హాచ్బాక్, తగినంత లెగ్, భుజం మరియు దాని ప్రయాణీకులకు తల గది తో చాలా విశాలంగా అంతర్గత క్యాబిన్ ను కలిగి ఉంది. ఈ వాహనం, 354 లీటర్ల ఒక భారీ వ్యాశార్ధం కలిగిన బూట్ కంపార్ట్మెంట్ తో అందించబడింది. అంతేకాకుండా దీర్ఘ ప్రయాణాలకు ఉపయోగపడేలా 40 లీటర్ ఇంధన ట్యాంక్ ను కలిగి ఉంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ సంస్థ యొక్క వాహన తయారీదారుడు, ఈ సిరీస్ యొక్క డీజిల్ వేరియంట్ లకు 1.5 లీటర్ ఐ- డి టెక్ డీజిల్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్, 4 సిలండర్లను కలిగి ఉంటుంది మరియు డి ఓహెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఇది 1498చ్చ్ డిస్ప్లేస్మెంట్ సామర్థ్యం ఉంది మరియు ఒక సాధారణ రైల్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థను తో కలిసి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ అత్యధికంగా 3600 ఆర్ పి ఎం వద్ద 98.6 బి హెచ్ పి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 1750 ఆర్ పి ఎం వద్ద 200 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ దాని యొక్క టార్క్ అవుట్పుట్ ను ముందు చక్రాలకు 6- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పంపిణీ చేస్తుంది. మరోవైపు, దీని యొక్క పెట్రోల్ వేరియంట్ లు 1.2 లీటర్ ఐ- విటెక్ ఇంజన్ తో జత చేయబడి ఉంటాయి మరియు ఈ ఇంజన్, 1199 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, ఎస్ ఓహెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 4 సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. అంతకాకుండా ఇది మంచి ఇంధన సామర్థ్యం మరియు ప్రదర్శన ను ఇవ్వడం కోసం ప్రోగ్రామ్ ఇంధన ఇంజెక్షన్ టెక్నాలజీ తో పొందుపర్చారు. ఈ ఇంజన్, అత్యధికంగా 6000 ఆర్ పి ఎం వద్ద 89 బి హెచ్ పి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 4800 ఆర్ పి ఎం వద్ద 110 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఈ సంస్థ నుండి విడుదల అయిన ఐదు వేరియంట్ లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో అనుసంధానం చేయబడి ఉంటాయి. అదే విధంగా, మిగిలిన రెండు వేరియంట్లు, సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటాయి.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ వాహనాల మధ్య శ్రేణి వేరియంట్లు, రేడియో తో పాటు 3.5 అంగుళాల స్క్రీన్ కలిగిన ఒక సమగ్ర సంగీత వ్యవస్థ తో పొందు పర్చబడి ఉంటుంది. వీటితో పాటు, ఈ వాహనం ఆక్స్-ఇన్, ఐప్యాడ్ మరియు ఐఫోన్ కోసం యూఎస్బి మరియు పోర్ట్సు వంటి కనెక్టివిటీ లక్షణాలు కలిగి ఉంది. వీటితో పాటు ఎస్వి వేరియంట్ లో సిడి ప్లేయర్ తో పాటు 5 అంగుళాల స్క్రీన్ ను పొందుపర్చారు. అగ్ర శ్రేణి వేరియంట్ లో అయితే, 6.2 అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ తో పాటు దృశ్య నావిగేషన్ సిస్టమ్ ను అందించాడు. వీటితో పాటు అదనంగా, ఈ వేరియంట్ వివిధ ఫైల్ ఫార్మాట్లు కు మద్దతిచ్చే ఒక డివిడి ప్లేయర్ ను కలిగి ఉంది. మరోవైపు, సంస్థ ఈ వాహనానికి ఫ్రంట్ గ్రిల్ ఫ్రంట్ అండర్లైన్ స్పాయిలర్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ సమితి, ఆర్మ్రెస్ట్ కన్సోల్, స్టెప్ ఇల్లుమినేషన్ మరియు అనుకూలీకరించిన సీటు కవర్లు వంటి ఉపకరణాలను అందించింది.

వీల్స్ పరిమాణం:


ఈ సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్లు, 14- అంగుళాల స్టీల్ రిమ్స్ సమితి బిగించబడి ఉంటాయి. వీటితో పాటు పూర్తి వీల్ కవర్స్ తో కప్పబడి ఉంటాయి. అంతేకాకుండా 175/70 R14 పరిమాణం గల ట్యూబ్ లెస్ రేడియల్ టైర్ల తో కప్పబడి ఉంటాయి. మిగిలిన వేరియంట్లు అయిన వి మరియు వి ఎక్స్ వేరియంట్ లలో 15- అంగుళాల అల్లాయ్ వీల్స్ బిగించి ఉంటాయి. వీటితో పాటు, వాహనానికి మరింత పటుత్వాన్ని ఇవ్వడానికి ఈ వాహనం యొక్క వీల్స్ 175/65 R15 పరిమాణం గల ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ సంస్థ యొక్క తయారీధారుడు, ఈ వాహనం లో అధునాతన సస్పెన్షన్ సిస్టమ్ ను పొందుపరిచాడు. ఈ వాహనం యొక్క ముందు ఆక్సిల్ ను మక్ఫెర్సొన్ స్ట్రట్ ను అమర్చారు. అదే విధంగా, వెనుక ఆక్సిల్ టోరిసన్ బీమ్ సస్పెన్షన్ తో పొందుపర్చారు. ఈ రెండు ఆక్సిల్ లు కూడా మరింత సామర్ధ్యాన్ని చేకూర్చడానికి కాయిల్ స్ప్రింగ్స్ తో లోడ్ చేయబడతాయి. బ్రేకింగ్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క ముందరి బ్రేక్ లు డిస్క్ లతో మరియు వెనుక బ్రేక్లు డ్రం లతో బిగించి ఉంటాయి. అంతేకాకుండా వాహనానికి మరింత పటుత్వాన్ని ఇవ్వడానికి మరిన్ని వ్యవస్థలతో పొందుపరిచారు. మరోవైపు, ఈ వాహనాల యొక్క డీజిల్ వేరియంట్ లలో, ఏ బిఎస్ మరియు ఈ బి డి వ్య్వస్థ లను ప్రామాణికంగా అందించాడు. అంతేకాకుండా ఈ వాహనాలన్నింటిలో ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ వీల్ ను కలిగి ఉండటం వలన ఇది 5.1 టర్నింగ్ వ్యాశార్ధ్యాన్ని మద్దతిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ కొత్తగా పరిచయం చేసిన సిరీస్ లో అనేక ముఖ్యమైన రక్షిత అంశాలను పొందుపరిచాడు. దాని విభాగంలో ఒక సురక్షితమైన కారు అని చెప్పవచ్చు. ఈ వాహనం యొక్క బాడీ ను యజమానులను గాయం ప్రమాదం నుండి తగ్గించే హోండా యొక్క ఆధునిక అనుకూలత ఇంజనీరింగ్ (ఏ సి ఈ) ను, ఉపయోగించి నిర్మించారు. ప్రస్తుతం, ఈ వాహనం ఐదు వేరియంట్ లలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్, ఇంజన్ ఇమ్మోబిలైజర్, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, డే / నైట్ లోపల రేర్ వ్యూ మిర్రర్, ఎల్ ఈ డి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, కీ ఆఫ్ రిమండర్ మరియు సింగిల్ హార్న్ వంటి బద్రతా లక్షణాలను కలిగి ఉంది. వీటితో పాటు ఈ సిరీస్ యొక్క మధ్య శ్రేణి అయిన 'ఎస్ ' వేరియంట్ రేర్ డిఫోగ్గర్ ను కలిగి ఉంటుంది. వీటితో పాటు వీటి అగ్ర శ్రేణి వేరియంట్ లలో డ్యూయల్ ఫ్రంట్ ఎస్ ఆర్ ఎస్ ఎయిర్బ్యాగ్స్, రేర్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ మరియు పవర్ విండోస్ తో పాటు పించ్ గార్డు రక్షణ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

అనుకూలాలు:


1. ఆకర్షణీయమైన బాహ్య రూపం దాని ప్లస్ పాయింట్ ఉంది.
2. ఈ సిరీస్ యొక్క డీజిల్ వేరియంట్ లు అత్యుత్తమ ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తాయి.
3. సౌకర్య లక్షణాలు ఇతర పోటీదారులతో సమానంగా ఉన్నాయి.
4. యాజమాన్య ప్రారంభ ధర చాలా సహేతుకంగా ఉంది.
5. ఇతర వాహనాల కంటే, ఈ వాహనం యొక్క బూట్ కంపార్ట్మెంట్ వ్యాసార్ధం ఎక్కువ.

ప్రతికూలాలు:


1. అంతర్గత క్యాబిన్ అభివృద్ధి పరిధి ఇప్పటికీ మెరుగు పడవలసిన అవసరం ఉంది.
2. ఈ వాహనాల గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంది.
3. ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ మరియు డి ఆర్ ఎల్ ఎస్ లేకపోవడం నిరాశనిచ్చింది.
4. అగ్ర శ్రేణి వేరియంట్ లలో లెధర్ అపోలిస్ట్రీ లేకపోవడం ఒక ప్రతికూలత.
5. సంగీతం వ్యవస్థ నాణ్యత మధ్యస్థంగా ఉంది