ఫోర్డ్ Figo Aspire

` 5.4 - 8.3 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

ఫోర్డ్ ఇతర కారు మోడల్లు

 
*Rs

ఫోర్డ్ Figo Aspire వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
ఈ ఏడాది చాలా రోజులుగా ఎదురుచూస్తున్న కాంపాక్ట్ సెడాన్ అయిన ఫోర్డ్ ఫిగో అస్పైర్ చివరకు భారత ఆటోమొబైల్ మార్కెట్ లోనికి వచ్చింది. ఈ వాహనం, దాని సొగసైన బాహ్య స్టైలింగ్ తో అనేకమంది దృష్టిని ఆకర్షించే విధంగా రాబోతుందని గత సంవత్సరమే వెల్లడించారు. దీని నిర్దేశాలు మరియు వివరాలు ఈ సబ్ 4 మీటర్ల సెడాన్ వైపు మరింత ఆకర్షించవచ్చు. ఈ విషయాలన్నింటినీ తయారీదారుడు బహిర్గతం చేశారు. ఆటో అభిమానులకు మరియు మొదటిసారి కారు కొనుగోలుదారుల కొరకు ఈ వాహనం ఆంబియంట్, ట్రెండ్, టైటానియం మరియు టైటానియం ప్లస్ అను నాలుగు చక్కదిద్దిన స్థాయిలతో, అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఈ సంస్థ యొక్క తయారీదారుడు ఈ వాహనాన్ని రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజిన్ ఎంపికను తో పరిచయం చేశాడు. మొదటి పెట్రోల్ ఇంజన్ అయిన 1.2 లీటర్ టి విసిటి ఇంజన్, 1196 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 4 సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ ఒక సీక్వెన్షియల్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థ తో విలీనం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 6300 ఆర్ పి ఎం వద్ద 86.7 బి హెచ్ పి పవర్ ను మరియు అదే విధంగా 4000 ఆర్ పి ఎం వద్ద 112 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. రెండవ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, రెండవది కూడా ఇదే ఆకృతీకరణ ను కలిగి ఉంటుంది. అది ఏమిటంటే, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అగ్ర శ్రేణి వేరియంట్ అయిన టైటానియం వాహనం లో చూడవచ్చు. ఈ ఇంజన్ 1499 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ ఒక టర్బోచార్జర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 6300 ఆర్ పి ఎం వద్ద 110.5 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా 4250 ఆర్ పి ఎం వద్ద 136 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో విలీనం చేయబడి ఉంటుంది. దీని ద్వారా ఈ వాహనాల నుండి విడుదల చేయబడిన టార్క్ ను వాహనాల ముందు చక్రాలకు పంపిణీ అవుతుంది. మరోవైపు డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, 1.5 లీటర్ టి డి సి ఐ డీజిల్ ఇంజన్ ఎస్ ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా సిలండర్లను మరియు వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 3750 ఆర్ పి ఎం వద్ద 98.63 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా తార్క్ విషయానికి వస్తే, 1750 నుండి 3000 ఆర్ పి ఎం వద్ద 215 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఇది ప్రయాణం లో అవసరమయ్యే అన్ని మనోహరమైన ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉంది. ఈ వాహనం, సర్దుబాటయ్యే హెడ్ రెస్ట్ లను, వెనుక సీట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ మరియు యాక్ససరీ పవర్ సాకెట్లు వంటి అంశాలను కలిగి ఉంది. అదే సమయంలో, సంస్థ ఒక ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ, విద్యుత్తో సర్దుబాటయ్యే మరియు మడత వేయగల వెలుపలి అద్దాలు మరియు వివిధ ఇతర అంశాలను విలీనం చేసింది. దీని భద్రతా సూచీ కోసం, ఈ సిరీస్ అన్ని వేరియంట్ లలో ప్రామాణికంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ను తయారీదారుడు ఈ వాహనానికి అందించాడు. అదనంగా, ఈ వాహనం లో కీలెస్ ఎంట్రీ, ఇంజిన్ ఇమ్మోబిలైజర్ మరియు ప్రామాణిక లక్షణాలుగా మూడు పాయింట్ల సీట్ బెల్ట్ లను కూడా అందించాడు.

ఈ కాంపాక్ట్ సెడాన్ యొక్క ప్రధాన హైలైట్ ఏమిటంటే కంపెనీ యొక్క కొత్త లోగో రేడియేటర్ గ్రిల్ పై అమర్చి ఉండటం వలన దాని అద్భుతమైన బాహ్య రూపం చాలా ఆకర్షణీయం గా ఉంటుంది. ఈ సిరీస్ యొక్క ట్రెండ్ మరియు ఆంబియంట్ వేరియంట్ లలో 14- అంగుళాల స్టీల్ వీల్స్ అందించబడతాయి. అదే మిగిలిన రెండు వేరియంట్ లలో 14- అంగుళాల అల్లాయ్ వీల్స్ బిగించబడి ఉంటాయి. ఈ వాహనాల అంతర్గత బాగాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాకుండా బాహ్య బాగం కూడా ద్వంద్వ టోన్ (లైట్ ఓక్ మరియు చార్కోల్ బ్లాక్) రంగు స్కీమ్ తో చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో లెధర్ సీట్లు అందించబడతాయి. మిగిలిన వేరియంట్ల విషయానికి వస్తే ఫ్యాబ్రిక్ సీట్లు అందించబడతాయి. తయారీదారుడు ఈ వాహనం లో ఒక వినూత్న మై ఫోర్డ్ దాక్ ను పొందుపర్చారు. అంతేకాకుండా ఈ వాహనం లో మొబైల్ ఫోన్, ఎం పి3 ప్లేయర్ మరియు శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ను ఛార్జ్ చేసేందుకు అనుమతించే సాంకేతిక అభివృద్ధి ఫీచర్ ను కూడా దీనిలో అందించడం జరిగింది. ఈ ఫోర్డ్ ఫిగో అస్పైర్ వాహనం, హోండా అమేజ్, టాటా జెస్ట్ మరియు మారుతి స్విఫ్ట్ డిజైర్ వంటి వాహనాలతో ఘట్టి పోటీ ను ఇవ్వబోతుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఊహించిన విధంగా, ఈ వాహనం పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్ లతో పరిచయం అయ్యింది. కానీ, ఆటో ప్రియులు విస్మయపరచడానికి, ఈ వాహనం రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లతో లభ్యమవుతుంది. దీనిలో ఒకటి 1.2 లీటర్ టి విసిటి పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ 18.16 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. రెండవ పెట్రోల్ ఇంజన్ అయిన 1.5 లీటర్ టి విసిటి ఇంజన్, ఆటోమేటిక్ గేర్బాక్స్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ సుమారు 17 కెఎంపిఎల్ మైలేజ్ ను అందిస్తుంది. మరోవైపు, 1.5 టిడిసిఐ డీజిల్ ఇంజన్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ టెక్నాలజీ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్, 25.83 కెఎంపిఎల్ పీక్ మైలేజ్ ను అందిస్తుంది.

శక్తి సామర్థ్యం:


ఈ వాహన సిరీస్ 1498 సిసి స్థానభ్రంశాన్ని కలిగిన డీజిల్ ఇంజన్ నాలుగు సిలండర్ల ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 98.63 బిహెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా 215 ఎన్ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేయడంలో సహాయపడుతుంది. బేస్ పెట్రోల్ వేరియంట్ అయిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 1196 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా నాలుగు సిలండర్లను కలిగిఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 86.7 బి హెచ్ పి పవర్ ను మరియు అదే విధంగా 112 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోక పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 1499 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 110.5 బి హెచ్ పి పవర్ ను మరియు అదే విధంగా 136 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ వాహనాల త్వరణం విషయానికి వస్తే, ముందుగా ఈ వాహన సిరీస్ యొక్క పెట్రోల్ వేరియంట్ ల గురించి తెలుసుకుందాం. ఈ వాహనం రెండు పెట్రోల్ వేరియంట్ లను కలిగి ఉంటుంది. మొదటి పెట్రోల్ వేరియంట్ అయిన 1.2 లీటర్ టి విసిటి ఇంజన్ 1196 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 15 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం 145 నుండి 155 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగలుగుతుంది. టైటానియం వేరియంట్ లలో ఉండే రెండవ ఇంజన్ అయిన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1499 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 12 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే ఇంజన్ ను కలిగి ఉన్న వాహనం 160 కెఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగలుగుతుంది. మరోవైపు 1.5 లీటర్ టి డి సి ఐ డీజిల్ ఇంజన్, 1499 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 11.5 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఇదే ఇంజన్ 165 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగలుగుతుంది.

వెలుపలి డిజైన్:


కొత్తగా ప్రారంభించబడిన ఈ కాంపాక్ట్ సెడాన్, ఈ అత్యంత పోటీ విభాగంలో దాని పోటీదారులు పోలిస్తే ఇది చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. ఈ వాహనం ఒక ఏరోడైనమిక్ ముందు బాగాన్ని కలిగి ఉంటుంది. దీనితో పాటు వంపు కలిగిన బోనెట్ అమర్చబడి ఉంటుంది. దీని పై అనేక క్యారెక్టర్ లైన్స్ పొందుపరచబడి ఉంటుంది. అంతేకాక ఈ అప్పీల్ ను మరింత మెరుగు పరచడానికి రేడియేటర్ గ్రిల్ అడ్డంగా పేర్చబడిన స్లాట్స్ తో బిగించబడి ఉంటుంది.ఈ సిరీస్ యొక్క దిగువ మరియు మధ్య శ్రేణి వేరియంట్ లలో ఈ రేడియేటర్ గ్రిల్ సిల్వర్ కలర్ లో ఉంటుంది. అదే అగ్ర శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, క్రోం గార్నిష్ తో అలంకరించబడి ఉంటుంది. ఈ వాహనం లో ఉండే విండ్ స్క్రీన్ కూడా చాలా వెడల్పు గా ఉంటుంది. దీని వలన డ్రైవర్ కు డ్రైవింగ్ సమయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వాహనానికి దృశ్యపరంగా ఒక అద్భుతమైన అప్పీల్ ను ఇవ్వడం కోసం గ్రిల్ పై బాగం లో కంపెనీ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది. అంతేకాకుండా సొగసైన హెడ్ లైట్ క్లస్టర్ స్వెప్ట్ బేక్ డిజైన్ ను కలిగి మరియు కారు యొక్క ఏరోడైనమిక్ వైఖరికి లోకి మిళితం అవుతుంది. ఈ హెడ్ లై ట్ క్లస్టర్ లో అత్యంత శక్తివంతమైన హేలోజన్ ల్యాంప్స్ ను మరియు టర్న్ సూచికలను పొందుపరిచాడు. ఫ్రంట్ బంపర్ శరీర రంగు పెయింట్ తో ఒక సంప్రదాయ డిజైన్ ను కలిగి ఉంది మరియు ఫాగ్ ల్యాంప్స్ తో పాటు ఎయిర్ ఇంటేక్ విభాగం కూడా క్రిందే అమర్చబడి ఉన్నాయి. ఈ వాహనం యొక్క సైడ్ విభాగం విషయానికి వస్తే, ప్రత్యేకంగా వాహనం యొక్క డోర్లు, అధునాతన డిజైన్ తో అందించాడు. వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు ఒక ద్వంద్వ టోన్ కలర్ లుక్ కలిగి మరియు టర్న్ సూచికలతో బిగించబడి ఉంటాయి. ఈ వాహనం లో ఆకర్షణీయం గా కనబడే అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. దీని డోర్ హ్యాండిల్స్ కారు బాడీ కలర్ లో ఉంతాయి. అంతేకాకుండా బి పిల్లార్ బ్లాక్ కలర్ తో అందంగా బిగించబడి ఉంటుంది. ఈ వాహనం యొక్క వెనుక బాగం విషయం గురించి మాట్లాడటానికి వస్తే, ఈ కాంపాక్ట్ బూట్ లిడ్ ముందరి బాగం లో క్రోం ప్లేట్డ్ స్ట్రిప్ అతికించబడి ఉంటుంది. దీనితో పాటుగా ఈ క్రోం స్ట్రిప్ మధ్య బాగం లో కంపెనీ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది. ఈ వాహనానికి ఇరువైపులా టైల్ లైట్ క్లస్టర్ లు అమర్చబది ఉంటాయి. దీని లో బ్రేక్ ల్యాంప్ తో పాటు టర్న్ సూచికలు కూడా పొందుపరచబడి ఉంటాయి. అంతేకాకుండా ఈ వాహనం యొక్క వెనుక బాగపు విండ్ స్క్రీన్ పై భాగం లో ఒక అధిక మౌంట్ స్టాప్ ల్యాంప్ బిగించబడి ఉంటుంది. ఇది బద్రతా సూచీ ను మరింత పెంచుతుంది. ఒక బ్లాక్ కలర్ లోయర్ క్లాడింగ్ బిగించి ఉంటుంది దీనితో పాటు రేర్ బంపర్, ఒక ద్వంద్వ టోన్ రూపాన్ని కూడా కలిగి ఉంది.

వెలుపలి కొలతలు:


ఈ ఈ కాంపాక్ట్ సెడాన్ యొక్క కొలతలను గనుక చూసినట్లైతే, ఈ వాహనం మొత్తం పొడవు 3995 మిల్లీ మీటర్లు, వెడల్పు 1695 మిల్లీ మీటర్లు (వెలుపలి రేర్ వ్యూ అద్దాలను మినహాయించి), మొత్తం ఎత్తు 1525 మిల్లీ మీటర్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇది ఒక సబ్ 4 మీటర్ల సెడాన్ గా ఉన్నప్పటికీ ఇది 2491 మిల్లీ మీటర్లు గల ఒక పొడవైన వీల్బేస్ ను కలిగి ఉంటుంది. ఇది క్యాబిన్ స్పేస్ ను వివరిస్తుంది. వీటితో పాటు ఈ వాహనం యొక్క కనీస గ్రౌండ్ క్లియరెన్స్ 174 మిల్లీ మీటర్లు.

లోపలి డిజైన్:


తయారీదారుడు రెండు టోన్ రంగు పథకంతో ఒక ఆకర్షణీయమైన అంతర్గత క్యాబిన్ ను ఈ వాహనానికి అందించాడు. ఈ వాహనాన్ని మరింత నిగనిగలాడే నలుపు మరియు లోహ చేరికలతో అందంగా పొందుపరిచాడు. దాని డాష్బోర్డ్ సెంట్రల్ లో అంటిపట్టుకొన్న అనేక ఫోర్డ్ నమూనాలను చూడవచ్చు. అంతేకాకుండా, ఒక సిగ్నేచర్ డిజైన్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాహనంలో మై ఫోర్డ్ డాక్ తో పాటు ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ మరియు వినోద పరికరాలను దీనిలో పొందుపరిచారు. ముందరి కాక్పిట్ విభాగంలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో మూడు అనలాగ్ గాజెస్ మరియు అనేక హెచ్చరిక ల్యాంప్స్ ను దీనిలో పొందుపరిచారు దీని వలన వాహనం సొగసైన నిర్మాణాన్ని కలిగి ఉంతుంది. దీనిలో అత్యంత ముక్యమైన అంశం ఏమిటంటే, 3-స్పోక్ స్టీరింగ్ వీల్ ను అందించడం జరిగింది. అంతేకాకుండా, దీనిని హై గ్లాస్ బ్లాక్ చేరికలతో తో పాటు కంపెనీ యొక్క లోగో ను దీని మధ్య బాగంలో పొందుపరచడం జరిగింది. మ్యూజిక్ సిస్టమ్ ను సులభంగా యాక్సెస్ చేయడం కోసం ఆడియో నియంత్రన స్విచ్చులను స్టీరింగ్ వీల్ పై అమర్చారు. ఇది ఒక కాంపాక్ట్ సెడాన్ అయినప్పటికీ, క్యాబిన్ లో అద్భుతమైన షోల్డర్ స్పేస్ మరియు ఉత్తమమైన హెడ్ స్పేస్ ను ఇతర పోటీదారులు కంటే అద్భుతమైన ఖాళీలను కలిగి ఉంది. ఈ వాహనం పొడవైన వీల్బేస్ ను కలిగి ఉండటం వలన ఈ వాహన అంతర్గత బాగాలలో మంచి లెగ్ రూం ను కలిగి ఉంటుంది. మంచి మద్దతును ఇవ్వడం కోసం లోపల సీట్లుఒక సమర్థతా డిజైన్ ను కలిగి ఉంటాయి. ఈ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో లెధర్ తో కప్పబడి ఉంటాయి. అదే ఇతర వేరియంట్ ల విషయానికి వస్తే, ఫ్యాబ్రిక్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంతాయి. ప్రయాణీకుల సౌలభ్యం కోసం వెనుక సెంటర్ ఆర్మ్రెస్ట్ లతో పాటు సర్దుబాటు చేసుకోగల హెడ్ రెస్ట్ లను కలిగి ఉంటాయి. దీని వలన వాహనం లో ప్రయాణించే ప్రయాణికులకు ఒక ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

లోపలి సౌకర్యాలు:


పైన పేర్కొన్న వంటి, ఈ కాంపాక్ట్ సెడాన్ సౌకర్య లక్షణాలు ప్రతీది ఒక వాహనం నుండి మరొక వాహనానికి మారుతూ నాలుగు వేరియంట్ స్థాయిల్లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అయిన ఆంబియంట్ వాహనం లో, గైడ్ మీ హోమ్ హెడ్ల్యాంప్స్, మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ, వంపు సర్దుబాటు తో కూడిన శక్తి సహాయక స్టీరింగ్ వీల్ వంటి లక్షణాలను కలిగి ఉంది. అంతేకాకుండా, ఒక ఆధునిక ఇన్స్ట్రుమెంట్ ప్రదర్శన తో పాటు అనేక హెచ్చరిక లైట్లు, ఫ్రంట్ పవర్ విండోస్ వన్ టచ్ అప్ / డౌన్ ఫంక్షన్ డ్రైవర్ సైడ్, బ్యాటరీ సేవర్, విద్యుత్ బూట్ విడుదల మరియు అంతర్గత గ్రేబ్ హ్యాండిల్స్ తో పాటు కోట్ హుక్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ట్రెండ్ వేరియంత్ విషయానికి వస్తే, ఈ వాహనం బూట్ ల్యాంప్, స్టీరింగ్ వీల్ పై ఫోన్ నియంత్రణలు తో పాటు ఆడియో నియంత్రణలు, ఓ ఆర్ విఎం లపై టర్న్ ఇండికేటర్స్, మై ఫోర్డ్ డాక్, విద్యుత్తో సర్దుబాటు వెలుపల అద్దాలు మరియు టాకోమీటర్ వంటి అదనపు లక్షణాలను కలిగి ఉంది. మరోవైపు, టైటానియం మరియు టైటానియం ప్లస్ వేరియంట్ లలో ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్ సిస్టం ను కలిగి ఉంటాయి. దీని వలన క్యాబిన్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంచడానికి మరియు ఉష్ణోగ్రతను నియమబద్దం చేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా, ఈ వాహనం డ్రైవర్ సీట్ ఎత్తు సర్దుబాటు సౌకర్యాన్ని మరియు ప్రామాణికమైన లక్షణంగా విద్యుత్ తో మడత వేయగల బయట అద్దాలను కలిగి ఉంటుంది. మరోవైపు, టైటానియం ప్లస్ వేరియంట్, ఒక ప్రీమియం అప్పీల్ ను ఇవ్వడం కోసం లెధర్ సీట్లను కలిగి ఉంటుంది.

లోపలి కొలతలు:


ఈ వాహనంలో సులభంగా ఐదుగురు వ్యక్తులు సౌకర్యం గా కూర్చునే సదుపాయాన్ని మరియు ఒక రూమి కాబిన్ ను ఈ వాహనానికి తయారీదారుడు అందించాడు. ఈ వాహనం యొక్క ముందు క్యాబిన్ కు తగినంత షోల్డర్ స్పేస్ ను మరియు హెడ్ మరియు లెగ్ స్పేస్ లను అందించాడు. వెనుక క్యాబిన్ లో కూడా అలసట లేకుండా ప్రయాణిచేందుకు ప్రయాణికుల కోసం మంచి లెగ్ రూం ను అందించాడు. అంతేకాకుండా వీటన్నింటినీ ప్రక్కన పెడితే విశాలమైన బూట్ సామర్ధ్యాన్ని కూడా ఈ వాహనానికి అందించాడు. ఈ బూట్ వైశాల్యాన్ని, వెనుక సీటు మడవటం ద్వారా మరింత పెంచవచ్చు.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ సంస్థ యొక్క తయారీదారుడు ఈ వాహనాన్ని రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజిన్ ఎంపికను తో పరిచయం చేశాడు. మొదటి పెట్రోల్ ఇంజన్ అయిన 1.2 లీటర్ టి విసిటి ఇంజన్, 1196 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 4 సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ ఒక సీక్వెన్షియల్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థ తో విలీనం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 6300 ఆర్ పి ఎం వద్ద 86.7 బి హెచ్ పు పవర్ ను మరియు అదే విధంగా 4000 ఆర్ పి ఎం వద్ద 112 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో విలీనం చేయబడి ఉంటుంది. రెండవ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, రెండవది కూడా ఇదే ఆకృతీకరణ ను కలిగి ఉంటుంది. అది ఏమిటంటే, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ 1499 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ ఒక టర్బోచార్జర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 6300 ఆర్ పి ఎం వద్ద 110.5 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా 4250 ఆర్ పి ఎం వద్ద 136 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో విలీనం చేయబడి ఉంటుంది. దీని ద్వారా ఈ వాహనాల నుండి విడుదల చేయబడిన టార్క్ ను వాహనాల ముందు చక్రాలకు పంపిణీ అవుతుంది. మరోవైపు డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, 1.5 లీటర్ టి డి సి ఐ డీజిల్ ఇంజన్ ఎస్ ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా సిలండర్లను మరియు వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 3750 ఆర్ పి ఎం వద్ద 98.63 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా టార్క్ విషయానికి వస్తే, 1750 నుండి 3000 ఆర్ పి ఎం వద్ద 215 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. దీని ద్వారా ఈ వాహనం యొక్క ముందు రిమ్స్ కు టార్క్ అవుట్పుట్ ను ప్రసారం చేస్తుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ వాహనం యొక్క ఎంటర్టైన్మెంట్ విభాగం విషయానికి వస్తే, ట్రెండ్ మరియు టైటానియం వేరియంట్ లలో మై ఫోర్డ్ డాక్ తో పాటు ఎఫ్ ఎం రేడియో మరియు 2 లైన్ ఎం ఎఫ్ డి స్క్రీన్ అందించారు. అంతేకాకుండా, ఈ వాహనం లో ఉండే స్టీరియో, నాణ్యతమైన సౌండ్ అవుట్పుట్ అందించడం కోసం ఇది నాలుగు స్పీకర్ల ను కలిగి ఉంటుంది. అదనంగా, ఈ వాహనం సౌలభ్యాన్ని అందించడం కొరకు యూఎస్బి మరియు ఆక్సలరీ వంటి కనెక్టివిటీ అంశాలను కలిగి ఉంది. ఈ రెండు వేరియంట్ లు బ్లూటూత్ కనెక్టవిటీ ను ప్రామాణిక అంశంగా కలిగి ఉంది. అంతేకాకుండా, ఆడియో నియంత్రణ స్విచ్చు లను స్టీరింగ్ వీల్ పై పొందుపరిచారు. మరోవైపు, ఈ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో సిడి ప్లేయర్ మరియు ఎం పి3 ప్లే బేక్ వంటి వాటిని కూడా అందించారు. ఈ వాహనం లో ఆడియో ట్రాక్ మరియు సమయం గురించి సమాచారం అందించే ఒక 2 లైన్ బహుళ-ఫంక్షనల్ డిస్ప్లే ను కూడా అందించాడు. ఈ వాహనం లో స్వర యాక్టివేట్ వ్యవస్థను కలిగిన అధునాతన సింక్ మరియు ఆప్లింక్ లక్షణాలను కూడా దీనిలో తయారీదారుడు పొందుపరిచాడు. ఇది మీరు కాల్స్ అనిమరించడానికి మరియు సాధారణ స్వర ఆదేశాల మీ ఇష్టమైన ట్రాక్స్ ను వినడానికి మద్దతిస్తుంది. ఒత్తిడి ని కలిగి ఉన్న పరిస్థితుల్లో, ఇది మీ స్మార్ట్ఫోన్లు ఉపయోగించి అత్యవసర సేవలు కాల్స్ మరియు మీ జిపిస్ నగరాన్ని తెలుసుకోవడం లో సహాయపడుతుంది.

వీల్స్ పరిమాణం:


ఈ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లు అయిన టైటానియం మరియు టైటానియం ప్లస్ వేరియంట్ లు 14- అంగుళాల అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటాయి. మిగిలిన అన్ని వేరియంట్లలో అదే పరిమాణం గల స్టీల్ వీల్స్ అందించబడతాయి. అంతేకాక ఈ చక్రాలు రోడ్లపై వాంఛనీయ పట్టు ను కోసం ఈ వీల్స్ 175/65R14 పరిమాణం గల రేడియల్ ట్యూబ్ లెస్ టైర్లతో కప్పబడి ఉంటాయి .

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ వాహనం ఒక సంప్రదాయ బ్రేకింగ్ వ్యవస్థ ను కలిగి ఉంటుంది. దీని లో బాగంగా ఈ వాహనాల ముందు చెక్రాలు వెంటిలేషన్ డిస్కు బ్రేక్ల తో బిగించబడి ఉంటాయి. వెనుక బాగం విషయానికి వస్తే, వెనుక బ్రేక్ లు డ్రమ్ బ్రేక్లు అందించబడతాయి. టైటానియం రెండు వేరియంట్లు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు ఈ వాహనాలు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీతో లోడ్ చేయబడతాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ వాహనాల ముందరి ఆక్సిల్ ఒక స్వతంత్ర మక్ఫెర్సొన్ స్ట్రట్ తో బిగించబడి ఉంటాయి. అంతేకాకుండా ఈ ముందరి ఆక్సిల్ కాయిల్ స్ప్రింగ్స్ మరియు యాంటీ రోల్ బార్ సిస్టం తో జత చేయబడి ఉంటాయి. అదే వెనుక విషయానికి వస్తే, వెనుక ఆక్సిల్ సెమి ఇండిపెండెంట్ ట్విస్ట్ బీమ్ టైప్ సస్పెన్షన్ తో జత చేయబడి ఉంటాయి. అంతేకాకుండా, ఈ వెనుక ఆక్సిల్ ట్విన్ గ్యాస్ మరియు ఆయిల్ ఫిల్డ్ షాక్అబ్జార్బర్స్ తో లోడ్ చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం లో ఒక విద్యుచ్చక్తి సహాయక స్టీరింగ్ వీల్ విలీనం చేయబడి ఉండటం వలన ఈ కాంపాక్ట్ సెడాన్ హ్యాండ్లింగ్, సులభమవుతుంది. ఇది పుల్ డ్రిఫ్ట్ పరిహారం టెక్నాలజీతో ఇమిడి ఉంటుంది. దీని వలన వాహనం మరింత ఖచ్చితమైన స్పందన ను అందించటం లో సహాయపడుతుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ సిరీస్ అన్ని వాహనాల లో ప్రామాణికమైన లక్షణంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ అందించబడతాయి.ఈ వాహనం అధిక బలం స్టీల్ తో నిర్మించిన బలమైన శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ సబ్ 4 మీటర్స్ వాహనం ప్రయాణికులకు తదుపరి స్థాయి రక్షణ ను అందిస్తుంది. ఈ సిరీస్ యొక్క ఆంబియంట్ మరియు ట్రెండ్ వేరియంట్ లు, కీ లెస్ ఎంట్రీ, ఇంజన్ ఇమ్మొబిలైజర్, త్రీ పాయింట్ సీటు బెల్ట్ వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. టైటానియం వేరియంట్ విషయానికి వస్తే, ఏబిఎస్ తో పాటు ఈబిడి, పెరిమెట్రిక్ అలారం సిస్టం, ఎత్తు సర్దుబాటు ముందు హెడ్ రెస్ట్లు మరియు డ్రైవర్ యొక్క సీట్ బెల్ట్ రిమైండర్ వంటి అదనపు అంశాలను కలిగి ఉంటుంది. ఈ వేరియంట్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాహనం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ తో పాటు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మరియు హిల్ అసిస్ట్ వంటి భద్రతా సూచీ ను జోడించే పంక్షన్ లను కలిగి ఉంటుంది. మరోవైపు, ఈ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో సైడ్ ఎయిర్ బాగ్స్ తో పాటు కర్టైన్ ఎయిర్ బాగ్స్ ను కూడా కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ వాహనం లో, ఫోర్డ్ మై కీ వ్యవస్థ మరియు ఎమెర్జెన్సీ అసిస్టెన్స్ వంటి లక్షణాలు దీనిలో ప్రామాణికంగా అందించబడతాయి.

అనుకూలాలు:


1. ఈ వాహనాలలో డీజిల్ వేరియంట్ యొక్క ఇంధన సామర్ధ్యం చాలా ఆకర్షణీయంగా ఉంది.
2. ఈ వాహనాల బాహ్య రూపం దాని ప్లస్ పాయింట్ గా ఉంది.
3. మై ఫోర్డ్ డాక్ మరియు సింక్ తో పాటు స్వర ఆదేశాలు కావలసిన విధంగా చేస్తాయి.
4. క్యాబిన్ స్పేస్ ఊహించిన దాని కంటే ఉత్తమం గా ఉంది.
5. ధర శ్రేణి ఒక సరసమైన పరిధిలో ఉంది.

ప్రతికూలాలు:


1. బూట్ నిల్వ సామర్థ్యం ఆకర్షణీయంగా లేదు.
2. ఏబిఎస్ మరియు ఈబిడి అన్ని మోడళ్ల వాహనాలకు ప్రామాణిక అంశం గా ఇవ్వవచ్చు కదా.
3. 1.5 లీటర్ పెట్రోల్ మిల్లు యొక్క ఇంధన సామర్ధ్యం ఊహించినంత ఆకర్షణీయంగా లేదు.
4. అంతర్గత నమూనా ను ఇంకా బాగు చేయవలసిన అవసరం ఉంది.
5. ఈ వాహనం యొక్క విడి భాగాలు మరియు ఉపకరణాలు ఖరీదైనవి.