కొత్త క్రుజ్ భారత ఆటో ఎక్స్పో 2016 లో ప్రదర్శితం కావచ్చు
చేవ్రొలెట్ క్రూజ్ కోసం manish ద్వారా జనవరి 08, 2016 12:22 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొత్త చేవ్రొలెట్ క్రుజ్ 2016 భారత ఆటో ఎక్స్పోలో రాబోతుందని ఊహించడమైనది. ఈ కారు కొత్త లైనప్ పవర్ ప్లాంట్స్ మరియు కొత్త సౌందర్య లక్షణాలతో అమర్చబడి ఉంది. చేవ్రొలెట్ యొక్క కొత్త ప్రీమియం సెడాన్ ఒక 27% బిరుసైన నిర్మాణం కలిగి ఉంటుంది. కొత్త తరం క్రూజ్ సాపేక్షంగా మరింత ఏరోడైనమిక్స్ ని ఉంటుంది మరియు 0.29cd వద్ద నిలుచునే ఒక తక్కువ డ్రాగ్ గుణకం కలిగి ఉంటుంది.
ఈ కారు చేవ్రొలెట్ బ్రాండ్ కొత్త D2XX FWD వేదిక లో స్థాపించబడి దీని మునుపటి దానితో పోలిస్తే కూడా కారు తులనాత్మకంగా తేలికగా ఉంటుంది. దీని బరువులో 113Kg తగ్గుదల, మెరుగైన నిర్వహణ లక్షణాలను మరియు మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
సౌందర్య అంశాల గురించి మాట్లాడుకుంటే, ఒక కొత్త ఆకర్షణీయమైన లుక్ ని కలిగియుండేందుకు అనేక అంశాలను అందించడం జరిగింది. క్రూజ్ వాహనం ప్రీమియం అమెరికన్ సెలూన్ లుక్ ని కాకుండా ఎక్కువగా 'జపనీస్' / ఆరిగమి-ఎస్క్ స్టైలింగ్ ని కలిగి ఉంటుంది. మేము కూడా సన్నగా ఉండే గ్రిల్ ని మరియు బాడ్జింగ్ ని ఇష్టపడము, కానీ చెవీ సంస్థ బ్రాండింగ్ విషయంలో కనీస జాగ్రత్త తీసుకుంటుందని నమ్ముతాము. ఈ కారు పదునైన డిజైన్ ని కలిగియుండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంకా దీనిలో అగ్రెసివ్ కొత్త బంపర్స్, హెగ్సాగొనల్ ఎయిర్ ఇంటేక్, LED DRLS తో అమర్చబడియున్న కోణీయ హెడ్‌ల్యాంప్స్, సమాంతర టెయిల్ ల్యాంప్స్ మరియు పునఃరుద్ధరించిన ఫాగ్‌ల్యాంప్స్ వంటి ఇతర సౌందర్య నవీకరణలు ఉన్నాయి. అలానే దీని అంతర్భాగాలలోనికి వస్తే 7 "MyLink సమాచార వినోద వ్యవస్థ , ఒక పెద్ద MIDస్క్రీన్ మరియు మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్ అందించబడుతుంది.
ఇంకా చదవండి