షెవ్రొలే ట్రెయిల్‌బ్లేజర్ : సమగ్ర ఫోట ో గ్యాలరీ
చేవ్రొలెట్ ట్రైల్ కోసం nabeel ద్వారా అక్టోబర్ 26, 2015 11:18 am ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
2020 ఏడాదికి అల్లా సమర్పిస్తామని అన్న 10 మోడల్స్ లో ఒకటైన ట్రెయిల్‌బ్లేజర్ ని షెవ్రొలే వారు భారతీయ మార్కెట్లోకి ఈ వారం విడుదల చేశారు. ఈ కారు థాయ్‌ల్యాండ్ నుండి దిగుమతి సీబీయూ రూటు ద్వారా రూ. 26.4 లక్షలకు (ఎక్స్-షోరూం) కి చేయబడుతోంది. పైగా, ఈ కారు కేవలం ఒకే ఒక్క వేరియంట్ లో లభిస్తుంది. దీనికి 2.8-లీటర్, 4-సిలిండర్ల డ్యూరామ్యాక్స్ ఇంజిను ఉండి ఇది 200bhp శక్తిని 3600rpm వద్ద ఇంకా 500Nm టార్క్ ని 2000rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ని జత చేయడం అయ్యింది. కేవలం ఒక 4x2 మాత్రమే దేశంలో అందుబాటులో ఉంటుంది మరియూ దీని శక్తి వెనుక వీల్స్ కి సరఫరా అవుతుంది. ఈ వాహనం 2,068 కేజీల బరువుని మోయగలదు. గ్రౌండ్ క్లియరెన్స్ 231 గా ఉంటుంది. ఈఎస్‌సీ (ఎలక్ట్రానిక్ స్టబిలిటీ కంట్రోల్), హెచ్ఎస్ఏ (హిల్ స్టార్ట్ అస్సిస్ట్) మరియూ హెచ్‌డీసీ (హిల్ డిస్సెంట్ కంట్రోల్) వంటివి ఎత్తు పలాలను అధిగమించేందుకై అందించబడ్డాయి. డ్యువల్ ముందు వైపు ఎయిర్-బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్ మరియూ ఏబీఎస్ + ఈబీడీ వంటివి రక్షణ కోసం ఉంటాయి.