భారత రెనాల్ట్ డిసెంబర్ 2015 అమ్మకాలలో 160% దేశీయ వృద్ధి ని నమోదు చేసింది.
జనవరి 06, 2016 03:18 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారతదేశం లో 2015 చివరి త్రైమాసికంలో రెనాల్ట్ చాలా విజయవంతమయింది. ఈ విజయానికి కారణం రెనాల్ట్ క్విడ్ అని చెప్పవచ్చు. డిసెంబర్ 2015 లో ఫ్రెంచ్ ఆటో సంస్థ 160% భారీస్థాయిలో వృద్ధిరేటు సాధించింది. డిసెంబర్ 2014 లో 3,956 యూనిట్లు అమ్మ్ముడుపోయాయి . దీనికి భిన్నంగా డిసెంబర్ 2015 లో 10,292 యూనిట్లు విక్రయించింది. 2015 క్యాలెండర్ సంవత్సరంలో రెనాల్ట్ 2014 కంటే 20.1% ఎక్కువ అనగా 53.847 యూనిట్ లని విక్రయించింది. అయితే ఈ కంపెనీ భారతదేశం లో వేగంగా అభివృద్ధి చెందుతుంది. మరియు ఇప్పుడు దేశవ్యాప్తంగా 200 అమ్మకాలు మరియు సేవ సౌకర్యాలు కలిగి ఉంది. భారతదేశం లో ప్రస్తుత రెనాల్ట్ లైన్ అప్ లు ,ఫ్లూయెన్స్, కొలియోస్, పల్స్, డస్టర్, స్కాలా, లోడ్గి మరియు క్విడ్ డస్టర్ తరువాత,క్విడ్ మాత్రమే మార్కెట్ మీద ప్రభావం చూపించింది.
సెప్టెంబర్ 24, 2015 న ప్రారంభించిన తర్వాత ఈ కారు 25,000 బుకింగ్స్ సేకరించింది మరియు అక్టోబర్ చివరి నాటికి దాని సంఖ్యా ఆశ్చర్యకరంగా 50,000 కు పెరిగింది. ఫలితంగా కారు యొక్క వెయిటింగ్ పీరియడ్ 2 నెలల వరకు పొడిగించబడింది. దాని విజయవంతమైన పరంపరను కొనసాగిస్తూ, క్విడ్ నవంబర్ లో దాని అమ్మకాల వృద్ది రేటు ని 144% గా నమోదు చేసి రెనాల్ట్ భారత దేశానికి సహాయం చేసింది.
క్విడ్ రాబోయే ఆటో ఎక్స్పోలో 01A క్లచ్ లెస్ AMT మరియు 1 లీటర్ వేరియంట్ తో రాబోతోంది.
డస్టర్ ఎస్యూవీ ఇష్టపడేవారి కోసం ఎక్కువగా ప్రాచుర్యం లోకి వచ్చింది. కాంపాక్ట్ పరిమాణం మరియు AWD వేరియంట్ యొక్క ఆఫ్-రోడ్ సామర్ధ్యాలు కారణంగా ఈ SUV ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలని గెలుచుకుంది. SUV ఫేస్లిఫ్ట్ కుడా ఈ సంవత్సరం ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబోతోంది.
ఇది కుడా చదవండి;