వోక్స్వాగన్ జెట్టా

` 14.6 - 20.8 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

వోక్స్వాగన్ ఇతర కారు మోడల్లు

 
*Rs

వోక్స్వాగన్ జెట్టా వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


ఈ సంస్థ, జర్మన్ ఆటోమొబైల్ కంపెనీ కి పూర్తి సొంతమైన అనుబంధ సంస్థ. ఈ సంస్థ, అధికారికంగా దేశం యొక్క కారు మర్కెట్లో ప్రీమియం సెడాన్ వోక్స్వ్యాగన్ జెట్టా యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను తయారు చేసింది. ఈ సరికొత్త వెర్షన్ దాని యొక్క బాహ్య స్వరూపాలు మరియు అంతర్గత పరంగా కొన్ని మార్పులను పొందింది. అయితే, ఈ వాహనం యాంత్రిక పరంగా ఎటువంటి మార్పులను చోటు చేసుకోలేదు మరియు ఈ వాహనం ప్రస్తుతం అవుట్గోయింగ్ నమూనాలో అందుబాటులో ఉండే అదే 1.4 లీటర్ టి ఎస్ ఐ పెట్రోల్ మరియు 2.0 లీటర్ టి డి ఐ డీజిల్ ఇంజిన్ లతో అందుబాటులో ఉంది. ఈ రెండు ఇంజన్లు ప్రామాణికమైన లక్షణంగా 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ వాహన సిరీస్ యొక్క డీజిల్ వెర్షన్ ఒక 6-స్పీడ్ డి ఎస్ జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికను తో కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా, కొనుగోలుదారులు ఎంచుకోవడానికి తయారీదారుడు ట్రెండ్ లైన్, కంఫోర్ట్ లైన్ మరియు హై లైన్ వంటి మూడు ఎంపికలతో అందించాడు. ఈ వాహనం యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే, ఈ వాహనం ఒక కొత్త లుక్ ను సొంతం చేసుకోవడానికి ముందు మరియు వెనుక ప్రొఫైల్స్ మార్పు చేయబడ్డాయి. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క హెడ్ లైట్ క్లస్టర్ చిన్న మార్పులను చోటు చేసుకుంది. అదే రేడియేటర్ గ్రిల్ విషయానికి వస్తే, దీనిలో మూడు స్లాట్స్ అడ్డంగా పేర్చబడి ఉన్నాయి. అంతేకాకుండా, ఈ రేడియేటర్ గ్రిల్ మధ్య భాగం లో కంపెనీ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది. ఈ వాహనం ఆకర్షణీయంగా కనపడటం కోసం బంపర్ మరియు ఫాగ్ ల్యాంప్స్ మార్పు చేయబడ్డాయి. మరొక విషయం ఏమిటంటే, వేరియంట్ రకాన్ని బట్టి అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. ఈ వాహనం యొక్క అంతర్గత భాగాల విషయానికి వస్తే, ఈ సరికొత్త మోడల్ కొత్త త్రీ స్పోక్ ఫ్లాట్ బోటం స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంటుంది. దీని వలన క్యాబిన్ కు స్పోర్టీ లుక్ వస్తుంది. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ ఆటోమేటిక్ వెర్షన్ అదనపు సౌలభ్యాన్ని అందించే స్టీరింగ్ వీల్ తో పాటు గేర్ షిఫ్ట్ పెడల్స్ ను కలిగి ఉంటుంది. అదే సమయం లో ఈ వాహనం యొక్క అంతర్గత భాగాలలో హై గ్లాస్ బ్లాక్ చేరికలను ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా కాక్పిట్ ను మార్పు చేయడం వలన క్యాబిన్ యొక్క మొత్తం లుక్ మారిపోయింది. ఇప్పుడు, తయారీదారుడు ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లలో క్రూజ్ కంట్రోల్ ను ప్రామాణిక అంశం గా అందించాడు. మరోవైపు, ఈ సెడాన్ ఒక మెరుగైన 'ఆర్ సి డి 510' టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ తో పాటు 6- డిస్క్లను కలిగిన సిడి చేంజర్ లతో అందుబాటు లో ఉంది. అంతేకాకుండా, ఈ సెడాన్ అసాధారణమైన సౌండ్ అవుట్పుట్ అందిస్తుంది మరియు యజమానులను వినోదం కోసం ఆరు స్పీకర్లను కలిగి ఉంది. వీటన్నింటితో పాటు ఈ సెడాన్ యొక్క తయారీదారుడు పాత మోడల్ లో ఉండే అవే సౌకర్య లక్షణాలతో అందించాడు. అంతేకాకుండా, ఈ వాహనం క్లైమట్రోనిక్ ఆటోమేటిక్ ఏసి యూనిట్ ను, శీతలీకరణ గ్లోవ్ బాక్స్ యూనిట్ ను, వేడి నిరోధక గాజు లోపలి వైపు మరియు వెనుక విండోస్ తో పాటు గా విధ్యుత్ తో సర్దుబాటయ్యే విండోస్ ను మరియు వెలుపలి రేర్ వ్యూ మిర్రర్లు వంటి ఆధునిక సౌకర్య లక్షణాలను కలిగి ఉంది. భద్రత అంశాలు పరంగా, ఈ సిరీస్ యొక్క అన్ని మోడళ్లు ఎలక్ట్రానిక్ డిఫ్ఫెరెన్షియల్ లాక్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఆరు ఎయిర్ బాగ్లతో పాటు ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్ గార్డ్ లను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా, ఈ వాహనం అధునాతన ఎలక్ట్రోనిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫంక్షన్ తో పాటు యాంటీ స్లిప్ రెగులేషన్ వంటి అంశాలను కూడా కలిగి ఉంది. ఇవన్నీ కూడా వాహనం ఎటువంటి రోడ్డుపరిస్థితులలోనైనా స్థిరత్వంగా ఉండటానికి సహాయపడతాయి. ప్రస్తుతం ఈ వాహనం, భారత ఆటో మొబైల్ మార్కెట్ లో ఉన్న టయోటా కొరొల్లా, హ్యుందాయ్ ఎలంట్రా మరియు రెనాల్ట్ ఫ్లూయెన్స్ వంటి వాహనాలకు గట్టి పోటీను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సరికొత్త సెడాన్, రెండు సంవత్సరాలు అపరిమిత కిలోమీటర్ వారంటీ తో అందుబాటులో ఉంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ వాహనం యొక్క పెట్రోల్ ఇంజన్ 1.4 లీటర్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. దీనితో పాటుగా డైరెక్ట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ టెక్నాలజీ తో పొందుపర్చబడి ఉంటుంది. దీని వలన ఈ ఇంజన్, నగరాలలో అత్యధికంగా 12 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. అలాగే, ఈ ఇంజన్ రహధారుల పై అత్యధికంగా 15 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. మరోవైపు, ఈ వాహనం యొక్క డీజిల్ ఇంజన్ 2.0 లీటర్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ కామన్ రైల్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థను తో బిగించబడి ఉంటుంది. ఈ ఇంజన్ సుమారు 17 నుండి 19.33 కె ఎం పి ఎల్ మైలేజ్ ను ఇస్తుంది.

శక్తి సామర్థ్యం:


ఈ వాహన సిరీస్ యొక్క పెట్రోల్ ఇంజన్ 4 సిలండర్లను కలిగి ఉంటుంది. వీటితో పాటు ఒక టర్బోచార్జర్ ను మరియు ఒక ఇంటర్ కూలర్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 1390 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 120.33 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా టార్క్ విషయానికి వస్తే, ఈ వాహనం అత్యధికంగా 200 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు, ఈ వాహన సిరీస్ యొక్క డీజిల్ ఇంజన్ ఒక టర్బోచార్జర్ ను కలిగి డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 138.1 బి హెచ్ పి పవర్ ను మరియు 320 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


తయారీదారుడు ఈ వాహన సిరీస్ కు ఒక డీజిల్ ఇంజన్ తో పాటు 6- స్పీడ్ మాన్యువల్ మరియు డి ఎస్ జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ రెండిటినీ అందించాడు. ఈ డీజిల్ ఇంజన్ మాన్యువల్ మోడ్ లో అత్యధికంగా 210 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే ఈ వాహనం ఆటో మోడ్ లో అత్యధికంగా 208 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే, ఈ ఇంజన్ రెండు మోడ్స్ లో కూడా 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 9 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ వాహన సిరీస్ యొక్క పెట్రోల్ వేరియంట్ 6- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 10 సెకన్ల సమయం పడుతుంది. అదే సమయం లో ఈ వాహనం అత్యధికంగా 202 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

వెలుపలి డిజైన్:


ఈ వాహనం యొక్క బాహ్య భాగాలలో చిన్న చిన్న సర్దుబాటులు ఉన్నప్పటికీ, దాని యొక్క తాజా రూపం సౌందర్యంగా చాలా అద్భుతంగా ఉంది. దీని యొక్క ముందు మరియు వెనుక భాగాలు మార్పు చేయబడ్డాయి. కానీ, ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ మాత్రం ఏ మార్పు చోటు చేసుకోలేదు. ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, ఈ సెడాన్ ఒక టైల్ లైట్ క్లస్టర్ ను కలిగి ఉంటుంది. ఈ టైల్ లైట్ క్లస్టర్ లో బ్రేక్ లైట్స్ తో పాటు టర్న్ ఇండికేటర్స్ కూడా ఇమిడి ఉంటాయి. ఈ వాహనం యొక్క వెనుక డోర్ కొద్ది మార్పులను చోటు చేసుకుంది. అంతేకాకుండా, ఈ వెనుక భాగం అనేక క్రోం చేరికలతో గార్నిష్ చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, దీని మధ్య భాగం లో వాహనానికి మరింత అందాన్ని చేకూర్చడానికి కంపెనీ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది. అదనపు రక్షణ కోసం వెనుక బంపర్ తో పాటు దానిపై ఒక జత రిఫ్లెక్టార్స్ బిగించబడి ఉంటాయి. ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, డీసెంట్ లుక్ ను కలిగి ఉంటుంది. డోర్ హ్యాండిల్స్ మరియు వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు కూడా కారు యొక్క బాడీ కలర్ లో ఉంటాయి. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు ఎల్ ఇ డి టర్న్ సూచికలతో బిగించబడి ఉంటాయి. దీని వలన వహనానికి భద్రత చేకూరడంతో పాటూ మరింత ఆకర్షణీయంగా కూడా కనిపించేలా చేస్తుంది. ఈ వాహనం యొక్క దిగువ మరియు మధ్య శ్రేణి వేరియంట్ ల విషయానికి వస్తే, సెడోనా అల్లాయ్ వీల్స్ బిగించి ఉంటాయి. అదే అగ్ర శ్రేణి వేరియంట్ విషయాని వస్తే, ఒక అందమైన 'అట్లాంటా' తేలికైన రిమ్స్ బిగించి ఉంటాయి. వీటి వలన వాహనానికి స్పోర్టీ లుక్ వస్తుంది. ఈ వాహనం యొక్క ముందరి భాగం విషయానికి వస్తే, ఈ సెడాన్ కు పునఃరూపకల్పన చేయబడిన బంపర్ అందించడం ద్వారా ఈ వాహనం పూర్తిగా కొత్తదానిలా కనిపిస్తోంది. అంతేకాకుండా, ఈ బంపర్ భారీఎయిర్ ఇంటేక్ సెక్షన్ తో పాటు మార్పు చేయబడిన ఫాగ్ ల్యాంప్స్ ను కూడా కలిగి ఉంటుంది . ముందరి రేడియేటర్ గ్రిల్ కూడా కొత్త డిజైన్ ను కలిగి ఉంటుంది. దీనితో పాటుగా దీనిపై అడ్డంగా మూడు క్రోం స్లాట్లు అమర్చబడి ఉంటాయి. ఈ వాహనం యొక్క ముందరి భాగం మరింత ఆకర్షణీయంగా కనపడటానికి ఈ రేడియేటర్ గ్రిల్ మధ్య భాగం లో కంపెనీ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది. ఈ వాహనం యొక్క హెడ్ లైట్ క్లస్టర్ మాత్రం ఏ మార్పులను చోటు చేసుకోలేదు. ఈ హెడ్ లైట్ క్లస్టర్ లో బై -జినాన్ హెడ్ ల్యాంప్స్ తో పాటు ఎల్ ఇ డి డే టైం రన్నింగ్ లైట్లు కూడా దీనిలో అమర్చబడి ఉంటాయి. ఈ లక్షణం అగ్ర శ్రేణి వేరియంట్ అయిన హై లైన్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన వేరియంట్ లలో అయితే, హాలోజెన్ హెడ్ల్యాంప్స్ ప్రామాణికంగా అందించబడతాయి.

వెలుపలి కొలతలు:


కొత్తగా పరిచయం అయిన ఈ సెడాన్ యొక్క మొత్తం పొడవు 4659 మిల్లీ మీటర్లు, వెడల్పు 1778 మిల్లీ మీటర్లు, మొత్తం ఎత్తు 1453 మిల్లీ మీటర్లు, కనీస గ్రౌండ్ క్లియరెన్స్ 159 మిల్లీ మీటర్లు. అంతేకాకుండా, ఈ వాహనం 2648 మిల్లీ మీటర్లు గల పొడవైన వీల్బేస్ ను కలిగి ఉంది. దీని వలన క్యాబిన్ విశాలంగా ఉండటమే కాకుండా పుష్కలమైన లెగ్ స్పేస్ ను కూడా కలిగి ఉంటుంది.

లోపలి డిజైన్:


ఈ వాహనం యొక్క అంతర్గత భాగాల విషయానికి వస్తే, కొత్తగా పరిచయం అయిన ఈ మోడల్ యొక్క డిజైన్ పాత దాని వలే ఉంది. అయితే, దాని డాష్బోర్డ్ మరియు స్టీరింగ్ వీల్ మీద హై గ్లాస్ బ్లాక్ చేరికలతో అలంకరించారు. అది ఒక ఉత్కంఠభరితమైన కొత్త లుక్ ను ఇస్తుంది. యజమానులకు మరింత సౌకర్యాన్ని ఇవ్వడం కోసం, ఈ వాహనం యొక్క సీట్లు ఎర్గనామికల్ గా రూపొందించబడ్డాయి. అదే సమయంలో, ఈ వాహనం యొక్క సైడ్ బోల్స్టర్స్ మరియు హెడ్ రెస్ట్స్ తొడల నుండి మెడ వరకు శరీరం కుడి భాగం అంతా అద్భుతమైన మద్దతు అందించడానికి చాలా బాగా సహాయపడతాయి. ఈ వాహనం యొక్క క్యాబిన్ భాగం అంతా ఆకర్షణీయమైన రెండు రంగుల పధకంతో అలంకరించబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క క్యాబిన్ లో డోర్ ప్యానెల్లు మరియు డాష్బోర్డ్ ల పై చెక్క చేరికలతో అందంగా పేర్చబడి ఉంటాయి. ఈ వాహనం యొక్క మధ్య భాగం విషయానికి వస్తే, భారీ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఒక అధునాతన సమాచార వ్యవస్థ తో పాటు ఆడియో యూనిట్ మరియు అనేక నియంత్రణ స్విచ్చులు పొందుపరచబడ్డాయి. ఈ వాహనం యొక్క స్టీరింగ్ వీల్ త్రీ స్పోక్ మరియు ఫ్లాట్ బోటం డిజైన్ మరియు లోహ చేరికలతో అలంకరించబడి ఉంటుంది. అంతేకాకుండా, డ్రైవర్ కు అదనపు సౌలభ్యాన్ని అందించడం కోసం అనేక మల్టీ ఫంక్షనల్ స్విచ్చులను కలిగి ఉంది. అంతేకాకుండా, కారు తయారీదారుడు ట్విన్-ట్యూబ్ డిజైన్ ఇవ్వడం ద్వారా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నవీకరించబడింది మరియు ఇది లోహ చేరికలతో అలంకరించబడింది. అంతేకాకుండా, ఈ వాహన సిరీస్, వాహన స్పీడ్, ఫ్యూయల్ గేజ్, ఇంజన్ ఉష్ణోగ్రత మరియు వివిధ ఇతర హెచ్చరిక విధులు వంటి అన్ని ముఖ్యమైన సమాచారాన్ని ప్రదర్శించడానికి ఒక బహుళ-ఫంక్షనల్ స్క్రీన్ కలిగివుంటుంది.

లోపలి సౌకర్యాలు:


ప్రస్తుతం, ఈ లగ్జరీ సెడాన్ మూడు వేరియంట్ స్థాయిలలో అందుబాటులో ఉంది. వాటి పేర్లు వరుసగా ట్రెండ్లైన్, కంఫోర్ట్ లైన్, హై లైన్. ఈ అన్ని వేరియంట్ లు క్రూజ్ కంట్రోల్ సిస్టం తో అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక అప్రయత్నంగా డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. వీటిలో ట్రెండ్ లైన్ అనేది ఈ వాహన సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్, ఇది ఫ్రంట్ సెంటర్ ఆర్మ్రెస్ట్ తో పాటు నిల్వ కంపార్ట్మెంట్, స్టీరింగ్ వీల్ మరియు గేర్ షిఫ్ట్ నాబ్ కొరకు లెధర్ అపోలిస్ట్రీ, స్ప్లిట్ ఫోల్డింగ్ రేర్ సీట్ బ్యాక్ రెస్ట్, ప్రాకాశవంతమైన గ్లోవ్ బాక్స్ యూనిట్, మల్టీ ఫంక్షనల్ డిస్ప్లే మరియు ఫ్యాబ్రిక్ సీట్ అపోలిస్ట్రీ వంటి ప్రామాణిక అంశాలను కలిగి ఉంది. వీటితో పాటు, ఈ వేరియంట్ శితలీకరణ గ్లోవ్ బాక్స్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, హీట్ ఇన్సులేటింగ్ విండ్ స్క్రీన్, ప్రకాశవంతమైన వానిటీ మిర్రర్స్, ఎత్తు సర్దుబాటు కలిగిన ముందు సీట్లు, విధ్య్త్ తో సర్ధుబాటు చేయగల వెలుపలి మిర్రర్స్ హీటింగ్ ఫంక్షన్ వంటి లక్షణాలను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా, తయారీదారుడు ఈ వాహనానికి క్లైమేట్రోనిక్ ఆటోమేటిక్ డ్యూయల్ జోన్ ఏసి యూనిట్ తో పాటు లోపల గాలి ఉష్ణోగ్రత నియంత్రించడం కోసం రేర్ ఏసి వెంట్స్ వంటి ఫంక్షన్ లను కూడా అందించాడు. వీటనింటితో పాటు ఈ సిరీస్ యొక్క మధ్య శ్రేణి వేరియంట్ అయిన కంఫోర్ట్ లైన్ వేరియంట్, సన్ గ్లాస్ హోల్డర్, లెధర్ అపోలిస్ట్రీ, రైన్ సెన్సార్స్, పార్కింగ్ అసిస్టెన్స్, డ్రైవర్ సీటు కొరకు లుంబర్ మద్దతు, ముందు సీటు వెనుక పాకెట్ , ఫ్రంట్ రీడింగ్ లైట్స్ మరియు ఆటోమేటిక్ హెడ్లైట్ యాక్టివేషన్ ఫంక్షన్ వంటి లక్షణాలను కలిగి ఉంది. మరోవైపు, ఈ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన హై లైన్, 12 వే విద్యుత్తో సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్ తో పాటు లుంబర్ మద్దతు మరియు మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ తో పాటు గేర్ షిఫ్టర్స్ వంటి అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది.

లోపలి కొలతలు:


ఇదివరకు చెప్పిన మాదిరిగానే, ఈ సరికొత్త వెర్షన్, యజమానులకు ప్రయాణంలో చాలా సౌకర్యంగా ఉండేలా గొప్ప లెగ్ మరియు షోల్డర్ రూం ల తో ఒక పుష్కల క్యాబిన్ స్పేస్ ను అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ వాహనం యొక్క బూట్ సామర్ధ్యం కూడా చాలా పుష్కలంగా ఉంటుంది మరియు వెనుక సీటు ను మడవడం ద్వారా ఈ సామర్ధ్యాన్ని మరింత పెంచవచ్చు. అదే సమయం లో, ఈ వాహనం 55- లీటర్ల ఇంధన ట్యాంక్ ను కలిగి ఉంది. ఇది దీర్ఘ ప్రయాణాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ప్రస్తుతం, ఈ సంస్థ యొక్క తయారీదారుడు ఒక పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో ఈ మోడల్ సిరీస్ ను అందిస్తున్నాడు. ఈ వాహన సిరీస్ యొక్క పెట్రోల్ వేరియంట్ లు 1.4 లీటర్ టిఎస్ ఐ ఇంజన్ తో జత చేయబడి ఉంటాయి. అంతేకాకుండా ఈ ఇంజన్ స్ట్రాటిఫైడ్ డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టం తో బిగించబడి ఉంటుంది. ఈ ఇంజన్, డబుల్ ఓవర్హెడ్ కాంషాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 1390 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, యొక్క పవర్ ను మరియు పనితీరును పెంచుట కొరకు ఈ ఇంజన్ లో ఒక టర్బోచార్జర్ ను కూడా పొందుపర్చారు. ఈ ఇంజన్ అత్యధికంగా 5000 ఆర్ పి ఎం వద్ద 120.33 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా 1500 నుండి 4000 ఆర్ పి ఎం వద్ద 200 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి దాని యొక్క టార్క్ అవుట్పుట్ ను ముందు రెండు చక్రాలకు పంపిణీ చేస్తుంది. మరోవైపు, ఈ వాహన సిరీస్ యొక్క డీజిల్ ఇంజన్, 2.0 లీటర్ టిడి ఐ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజన్ 1968 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ ఒక టర్బోచార్జర్ తో విలీనం చేయబడి ఉంటుంది. కానీ, దీని యొక్క ఫ్యూయల్ ఇంజెక్షన్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టం తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 4200 ఆర్ పి ఎం వద్ద 138.1 బి హెచ్ పి పవర్ ను మరియు అదే విధంగా 1750 నుండి 2500 ఆర్ పి ఎం మధ్య లో ఒక అత్యద్భుతమైన టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ పవర్ ప్లాంట్ 6- స్పీడ్ మాన్యువల్ మరియు డిఎస్ జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ వాహనాల యొక్క దిగువ శ్రేణి వేరియంట్ లు అధునాతన 'ఆర్ సిడి 220' ఆడియో యూనిట్ తో పాటు సిడి ప్లేయర్ ను మరియు నాలుగు స్పీకర్లను కలిగి ఉంటాయి. ఈ వాహనం వీటితో పాటు యూఎస్బి మరియు ఆక్సలరీ ఇన్ వంటి కనెక్టవిటీలకు మద్దతిస్తుంది. అదే ఈ వాహనాల మధ్య శ్రేణి వేరియంట్ ల విషయానికి వస్తే, ఈ మధ్య శ్రేణి వాహనాలు 'ఆర్సిడి 320' ఆడియో వ్యవస్థ తో పాటు బ్లూటూత్ కనెక్టవిటీ లతో అందుబాటులో ఉంది. మరోవైపు, ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ ల విషయానికి వస్తే, ఈ వాహనాలు 'ఆర్సిడి 510' ఆడియో వ్యవస్థ తో పాటు టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ లను కలిగి ఉంటుంది. ఈ సమాచార వ్యవస్థ లో, ఆరు డిస్క్ ల సిడి చేంజర్ తో పాటు ఆధునిక ఆడియో స్ట్రీమింగ్ మరియు హ్యాండ్స్ ఫ్రీ ఆపరేషన్ కొరకు బ్లూటూత్ వంటి ఫంక్షన్ లను కలిగి ఉంది. అదే సమయం లో, మరింత సౌలభ్యాన్ని చేకూర్చుట కొరకు ఈ యూనిట్ యొక్క నియంత్రణ స్విచ్ లు స్టీరింగ్ వీల్ పై పొందుపరచబడి ఉంటాయి. మరోవైపు, కొనుగోలుదారుల వారి అవసరాలకు గాను, ఆకర్షణీయమైన బాహ్య భాగలను మరియు అంతర్గత భాగాలను అదే విధంగా ఈ వాహనం యొక్క బాడీ గ్రాఫిక్స్, రూఫ్ రైల్స్, డెక్ లిడ్ స్పాయిలర్, సైడ్ స్కర్ట్స్ మరియు డోర్ వైపర్స్ వంటి అనేక ఫంక్షన్లను కలిగి ఉంది.

వీల్స్ పరిమాణం:


ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లు ధృఢమైన 16- అంగుళాల అల్లాయ్ వీల్స్ సమితి ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ వీల్ యొక్క మద్య భాగంలో కంపెనీ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది. ఈ వాహనాల యొక్క రిమ్స్ అధిక పనితీరు కలిగిన ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి. ఇవి ఎలాంటి రోడ్ల పరిస్థితి లోనైనా ఉన్నతమైన పట్టును అందిస్తాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ వాహనం యొక్క ముందు మరియు వెనుక చక్రాలు ధృఢనిర్మాణంగల డిస్క్ బ్రేక్ల సమితి తో బిగించబడి ఉంటాయి. తయారీదారుడు, ఈ వాహనం రోడ్ పై మరింత పటుత్వాన్ని ఇవ్వడం కోసం ఉన్నతమైన బ్రేక్ కాలిపర్స్ తో లోడ్ చేశాడు. వీటితోపాటు, ఈ వాహనం యొక్క బ్రేక్ లు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు బ్రేక్ అసిస్ట్ వంటి ఫంక్షన్ లు, రోడ్ పై గట్టి పటుత్వాన్ని ఇవ్వడం లో సహాయపడతాయి. అదే సమయంలో, ఈ వాహనం ఒక ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ను కలిగి ఉంటుంది. దీని వలన ట్రాక్షన్ నష్టం తగ్గి తద్వారా వాహనం చురుకైనది గా ఉండటం లో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఈ సెడాన్ ఒక అద్భుతమైన సస్పెన్షన్ వ్యవస్థ ను కలిగి ఉంది. ఈ వాహనాల ముందరి ఆక్సిల్ కాయిల్ స్ప్రింగ్ సిస్టం తో జత చేయబడి ఉంటుంది. దీనితో పాటు గా ఈ వాహనం షాక్ అబ్జార్బర్స్ ను మరియు అదే విధంగా స్టెబిలైజర్లను కలిగి ఉంది. అదే సమయం లో ఈ వాహనం యొక్క వెనుక ఆక్సిల్ మల్టీ లింక్ సస్పెన్షన్ సిస్టం తో జత చేయబడి ఉంటుంది. దీనితో పాటుగా స్టెబిలైజర్ బార్స్ తో లోడ్ చేయబడుతుంది. దీని వలన ఈ వాహనం బాగా సమతుల్యంగా ఉండేలా సహాయపడతాయి. అంతేకాకుండా, ఈ వాహనం ర్యాక్ అండ్ పినియన్ అధారిత ఎలక్ట్రిక్ పవర్ సహాయక స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంటుంది. ఈ స్టీరింగ్ వీల్ డ్రైవర్ కు , డ్రైవింగ్ ను సులభతరం చేయడానికి 5.5 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాశార్ధానికి మద్దతిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లు ప్రయాణికులకు రక్షణ ను అందించడానికి అనేక భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయి. భద్రతా లక్షణాల విషయానికి వస్తే, బ్రేక్ ప్యాడ్ వేర్ సూచిక, అన్ని నాలుగు డోర్ల కు రెట్రో రిఫ్లెక్టార్స్, ఆరు ఎయిర్బాగ్ లు, ఇంజన్ గార్డ్, రెండు రిమోట్ నియంత్రణ కలిగిన మడత వేయగల తాళం తో పాటు సెంట్రల్ లాకింగ్ సిస్టం, వెనుక మూడు తల పరిమితులు మరియు ఒక ఆధునిక ఇంజిన్ ఇమ్మోబిలైజర్ వంటి లక్షణాలను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ మోడల్ సిరీస్ ఎలక్ట్రానిక్ స్థిరత్వం నియంత్రణ, ఏబిఎస్ తో పాటు బ్రేక్ అసిస్ట్ ఫంక్షన్, యాంటీ స్లిప్ రెగులేషన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, హిల్ హోల్డ్ కంట్రోల్ మరియు ఎత్తు సర్దుబాటు కలిగిన ముందు సీటు బెల్ట్ లు వంటి అనేక అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది.

అనుకూలాలు:1. ఈ కారు యొక్క భద్రతా లక్షణాలు ఇతర సెడాన్ లతో సమంగా ఉన్నాయి .
2. ఈ వాహనం యొక్క డీజిల్ ఇంజిన్ పనితీరు చాలా ఆకర్షణీయంగా ఉంది.
3. త్వరణం మరియు పికప్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
4. సమాచార వ్యవస్థ మెరుగుదల వాహనం యొక్క ప్రయోజనాన్ని జతచేస్తుంది.
5. పునరుద్దరించబడిన బాహ్య భాగాలు చాలా ఆకర్షణీయంగా మరియు ఒక కొత్త లుక్ ను ఇస్తున్నాయి.

ప్రతికూలాలు:1. ధర పరిధి చాలా ఖరీదైనది.
2. ఇతర పోటీదారులతో పోలిస్తే, ఈ వాహనం యొక్క ఇంధన ట్యాంక్ మరియు బూట్ సామర్ధ్యం అంత అకట్టుకునే విధంగా లేవు.
3. తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉండటం అనేది ఒక ప్రతికూలత అని చెప్పవచ్చు.
4. ఇంధన సమర్థత పరంగా ఎలాంటి మెరుగుదల లేదు.
5. అంతర్గత నమూనా లో మరిన్ని నవీకరణలు చేయవలసిన అవసరం ఉంది.