రెనాల్ట్ KWID

` 2.6 - 4.4 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

రెనాల్ట్ ఇతర కారు మోడల్‌లు

 
*Rs

రెనాల్ట్ KWID వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
భారతదేశంలో, హాచ్బాక్ ల కొరకు ఒక బారీ మార్కెట్ ఉంది ముఖ్యంగా సరసమైన ధర ట్యాగ్ లతో కూడుకున్నవి. ఇదే విభాగంలో, గత మూడు దశాబ్దాలుగా మారుతి 800 వాహనం మాత్రమే సరసమైన ధర ట్యాగ్ తో ఉంది. ఇంత తక్కువ ధరతో ఏ తయారీదారుడు ఇప్పటివరకు ఎవ్వరూ తయారుచేయలేకపోయారు. కానీ, దీనిని ఒక సవాలుగా తీసుకొని, రెనాల్ట్ సంస్థ ఇదే విభాగంలో తక్కువ ధరతో ఒక కొత్త కారును తయారు చేసింది. దాని పేరు రెనాల్ట్ క్విడ్ మరియు ఇది, ఎస్ టిడి, ఆర్ ఎక్స్ ఈ, ఆర్ ఎక్స్ ఎల్ మరియు ఆర్ ఎక్స్ టి అను నాలుగు వేరియంట్ స్థాయిలతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఈ వాహనం సంబంధించిన కొన్ని వివరాలను బహిర్గతం చేసిన ఫ్రెంచ్ ఆటో సంస్థ, గతంలో ఆటో పరిశ్రమలో ఒక సంచలనాన్ని సృష్టించింది. ఈ హాచ్బాక్ ప్రస్తుతం, కొత్తగా అబివృద్ది చేసిన 0.8 లీటర్, మూడు సిలండర్ పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. దీనితో పాటు, ఈ విభాగంలో ఉన్న ఇతర వాహనాలతో పోలిస్తే, ఈ హాచ్బాక్ ఇంధన సామర్థ్యం పరంగా చాలా ఆకట్టుకునే విధంగా మరియు శక్తివంతమైనది గా ఉంది. మరో ఆసక్తికరమైన వాస్తవం ఏమిటంటే, ఈ వాహనం అల్యూమినియం ఇంజన్ ను మరియు తేలికైన శరీర నిర్మాణాన్ని కలిగి సుమారు ఇది 660 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఈ వాహనం అత్యధికంగా 25.17 కె ఎం పి ఎల్ గల అత్యధిక ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది. మరోవైపు ఈ హాచ్బాక్ యొక్క కొలతలను గనుక చూసినట్లైతే, 3679 మిల్లీ మీటర్ల పొడవును మరియు 1478 మిల్లీ మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది కాబట్టి, దీని లోపలి భాగంలో ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోగలుగుతారు. ఈ వాహన సిరీస్ లో, అనేక ప్రత్యేకమైన లక్షణాలు పొందుపరచబడ్డాయి. ఈ మోడల్ సిరీస్ కలిగి ఉన్న 7- అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే తో కూడిన మీడియా నావ్ సమాచార వ్యవస్థ ఈ విభాగంలో, మొదటిసారి అని చెప్పవచ్చు. ఈ టచ్ స్క్రీన్ వ్యవస్థ, రెండు స్పీకర్లతో పాటు అనేక ఇతర కనెక్టవిటీలకు మద్దతిస్తుంది. వీటితో పాటు ఈ వాహన సిరీస్ లో, వెంట్లతో కూడిన ఒక ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ, ఆటో ఆన్ క్యాబిన్ లైటింగ్ మరియు ముందు పవర్ విండోలు వంటి కొన్ని ఇతర సౌకర్య లక్షణాలు పొందుపరచబడ్డాయి.

ఈ వాహనాన్ని కొన్ని నెలల క్రితం మొదటిసారిగా ఆటో పరిశ్రమలో ఆవిష్కరించినప్పుడు, అది ఒక విజయాన్ని సాదించడమే కాకుండా అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి గల కారణం ఏమిటంటే, ఎస్యువి వంటి శరీర నిర్మాణాన్ని కలిగి ఉండటమే కాకుండా ముఖ్యంగా ముందు ముఖ భాగం చాలా పెద్దదిగా కనిపిస్తోంది. అంతేకాకుండా, లాడ్జీ ఎంపివి వాహనం లో ఉండే విధంగా రేడియేటర్ గ్రిల్ మధ్య భాగంలో సంస్థ యొక్క ప్రముఖ చిహ్నం పొందుపరచబడి ఉంటుంది. ఎస్యువి లుక్ కనిపించడానికి మరోక కారణం ఏమిటంటే, నలుపు రంగు లోయర్ క్లాడింగ్. ఈ వాహన సిరీస్ యొక్క అంతర్గత భాగాల పరంగా చెప్పాలంటే, లోపలి భాగంలో రెండు రంగుల పధకంతో అలంకరించిన ఒక ఆసక్తికరమైన డాష్‌బోర్డ్ అమర్చబడి ఉంటుంది. భద్రతా విభాగం విషయానికి వస్తే, ప్రయాణికులను అలాగే వాహనాన్ని పరిరక్షించడానికి కీలకమైన లక్షణాల జాబితా, ఈ వాహన సిరీస్ కు అందించబడింది. ఆ జాబితా లో లక్షణాలు వరుసగా, వాహనం లో ఏ అనదికార ప్రవేశం జరగకుండా ఉండటానికి మరియు వాహనం దొంగతనాల బారీ పడకుండా ఉండటానికి ఒక ఇంజన్ ఇమ్మోబిలైజర్, సెంట్రల్ లాకింగ్ తో కూడిన రిమోట్ కీ లెస్ ఎంట్రీ వంటి భద్రతా అంశాలు అందించబడ్డాయి. ఈ వాహనం, 50,000 కిలోమీటర్లు లేదా రెండు సంవత్సరాలు ఉచిత రోడ్‌సైడ్ సహాయం తో పాటు 2 సంవత్సరాలు ఆకట్టుకునే వారంటీ తో వస్తుంది. ఈ కొత్త హాచ్బాక్, ఈ విభాగంలో ఒక కొత్త బెంచ్ మార్క్ ను సృష్టించే అవకాశముంది అని తయారీదారుడు, భావిస్తున్నాడు.

మైలేజ్ మరియు ఇంధన సామర్ధ్యం:


తయారీదారుడు దీనికి 799cc స్థానభ్రంశ సామర్ధ్యంతో కొత్త ఇంజిన్ ని రూపొందించారు. ఈ ఇంజిన్ మంచి ఇంధన సామర్థ్యం మరియు వాంఛనీయ విద్యుదుత్పత్తిని అందించేందుకు బహుళ స్థాన ఇంధన సరఫరా వ్యవస్థ ఆధారంగా ఇంజక్షన్ సాంకేతికతను కలిగి ఉంది. క్విడ్ యొక్క మొత్తం బాడీ బరువు 660 kgs. ఇది 25.17 kmpl మైలేజ్ ని అందిస్తుందని ఏఆర్ఏఐ తో సర్టిఫికేట్ చెయబడినది.

శక్తి సామర్ధ్యం:


దీనిలో 3 సిలిండర్ మోటార్ 12 వాల్వులతో కలిసి ఉంది. ఈ డ్రైవ్-ట్రైన్ 72Nm టార్క్ తో పాటూ 53.2bhp శక్తిని అందిస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ వాహనం తక్కువ బరువు ఉన్న కారణంగా మంచి ఇంధన సామర్ధ్యాన్ని అందించేందుకు దోహద పడడమే కాదు మంచి పికప్ ని కూడా అందిస్తుంది. ఈ వాహనం 0 నుండి 100kmph చేరుకునేందుకు 17 సెకెన్ల సమయం తీసుకుంటుంది. అలానే ఈ వాహనం 125 kmph గరిష్ట వేగంతో ప్రయాణించగలదు.

వెలుపలి డిజైన్:


కాంపాక్ట్ ఎస్యువి లా ఉండే ఈ వాహనం యొక్క భాహ్య రూపాన్ని గనుక గమనించినట్లైతే, ఒక అద్భుతమైన డిజైన్ ను కలిగి కొనుగోలుదారులకు ఒక ఎర లా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ స్పోర్ట్ యుటిలిటీ వాహనం, బోల్డ్ బాహ్య బాగాలను మరియు స్పోర్టీ కాస్మటిక్స్ ను కలిగి ఉంటుంది. ముందుగా ఈ వాహన సిరీస్ యొక్క ముఖ భాగం విషయానికి వస్తే, నలుపు రంగులో ఉండే రేడియేటర్ గ్రిల్ మరియు దీని మధ్య భాగంలో సంస్థ యొక్క ప్రముఖ చిహ్నం అందంగా పొందుపరచబడి ఉంటుంది. దీనికి ఇరువైపులా, కన్వెన్షినల్ హాలోజన్ ల్యాంప్‌లను కలిగిన ఆకర్షణీయమైన హెడ్ లైట్ క్లస్టర్లు అమర్చబడి ఉంటాయి. దీని క్రింది భాగంలో ఉండే బంపర్ మస్కులైన డిజైన్ ను కలిగి ఉంటుంది మరియు దీని క్రింది భాగంలో నలుపు రంగులో ఉండే లోయర్ క్లాడింగ్ విలీనం చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, రోడ్లపై ప్రత్యక్షతను మరింత పెంచడానికి, దీనిపై ఒక జత రౌండ్ ఆకారపు ఫాగ్ లాంప్లు అమర్చబడి ఉంటాయి. మరోవైపు ఈ వాహన సిరీస్ యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, క్లాడింగ్ లతో కూడిన వీల్ ఆర్చులు బిగించి ఉండటం మనం గమనించవచ్చు. అంతేకాకుండా, విండో సిల్స్, డోర్ హ్యాండిల్స్ మరియు వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ ల క్యాప్ లు అన్నియూ కూడా నలుపు రంగులో అందించబడతాయి. మనం ఇంకోక విషయాన్ని కూడా గమనించవచ్చు అది ఏమిటంటే, భద్రతను చేకూర్చే టర్న్ సూచికలు, ముందు వీల్ ఆర్చ్ క్లాడింగ్ లకు అమర్చబడి ఉంటాయి. వీటితో పాటు, ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని వాహనాల వీల్ ఆర్చులకు, 13- అంగుళాల కన్వెన్షినల్ రింలు ప్రామాణికంగా అందించబడతాయి. ముందు భాగం మరియు సైడ్ ప్రొఫైల్ వలే కాకుండా, వెనుక భాగం స్పోర్టీ హాచ్బాక్ లా కనిపిస్తోంది మరియు చాలా ఆకర్షణీయమైన శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా టైల్ లైట్ క్లస్టర్ చాలా పెద్దదిగా, సొగసైనదిగా మరియు వంపు ఫినిషింగ్ ను కలిగి ఉంటుంది మరియు దీని యొక్క ఫెండర్లు ఒక ఆధునిక లుక్ ను కలిగి ఉంటాయి. వెనుక ఉండే విండ్ స్క్రీన్, పుటాకార డిజైన్ ను కలిగి ఉంటుంది మరియు హై మౌంట్ మూడవ బ్రేక్ లైటు, స్పాయిలర్ క్రింది భాగంలో బిగించబడి ఉంటుంది. అంతేకాకుండా, టైల్ గేట్ మధ్య భాగంలో సంస్థ యొక్క ప్రముఖ చిహ్నం అందంగా అమర్చబడి ఉంటుంది మరియు దీని క్రింది భాగంలో క్విడ్ అను అక్షరాలు పొందుపరచబడి ఉంటాయి.

వెలుపలి కొలతలు:


పైన పేర్కొన్న విధంగా, ఈ కొత్తగా ప్రారంభించబడిన వాహనం పొడవు 3679mm, వెడల్పు 1579mm (బయట అద్దాలు మినహాయించి), ఎత్తు 1478mm మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 180mm. అలానే ఇది 2422mm భారీ వీల్‌బేస్ ని కలిగి ఉంది.

లోపలి డిజైన్:


ఈ హాచ్బాక్ యొక్క అంతర్గత భాగంలో, ఇతర వాహనాలలో లేనటువంటి విధంగా ఒక ఆకర్షణీయమైన క్యాబిన్ తో పాటు అనేక వినియోగ ఆధారిత అంశాలను అందించడం జరిగింది. తయారీదారుడు, ఈ వాహన సిరీస్ కు, ఒక ప్రాముఖ్యత కలిగిన డిజైన్ ను అందించడమే కాకుండా, అంతర్గత భాగాన్ని అంతటిని రెండు రంగుల పధకంతో అందంగా అలంకరించాడు. సీటింగ్ అమరిక విషయానికి వస్తే, ఈ క్యాబిన్ లో సౌకర్యవంతంగా ఐదుగురు వ్యక్తులు కూర్చునే సదుపాయాన్ని అందించాడు. అంతేకాకుండా, అంతర్గర భాగంలో అనేక వస్తువులను నిల్వ చేసుకునేందుకు, డాష్‌బోర్డ్, డోర్ ప్యానెల్స్, ఫ్లోర్ కన్సోల్ మరియు వెనుక సీటు ప్రక్కన వంటి వాటికి అనేక నిల్వ యూనిట్లను అమర్చడం జరిగింది. కాక్‌పిట్ విభాగంలో ఉండే డాష్‌బోర్డ్, అనేక పరికరాలను మరియు వినియోగ లక్షణాలను కలిగి సాదారణ డిజైన్ తో రూపొందించబడింది. వీటితో పాటు డ్రైవర్ కు సులభతరం చేయడానికి, సమాచార వ్యవస్థ మరియు ఏసి యూనిట్ లు సెంటర్ ఫేసియాలో పొందుపరచబడి ఉన్నాయి. ఇవి పియానో నలుపు చేరికలను కలిగి దాని చుట్టూ క్రోం తో అలంకరించబడి ఉంటుంది మరియు ఇది అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే. అదే ఈ వాహన సిరీస్ యొక్క మధ్య శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, ఆ చేరికలు చుట్టూ సిల్వర్ కలర్ అందించబడుతుంది. అంతేకాకుండా తయారీదారుడు, డాష్‌బోర్డ్ పై వాహన వేగం, ఇంధన స్థాయిలు మరియు ఇతర కొన్ని నోటిఫికేషన్లతో కూడిన ఒక పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను అందించాడు. ఈ వాహనం యొక్క లుక్ ను, క్యాబిన్ స్పేస్ ను మరియు ధర పరిదిని కనుక చూసినట్లైతే ఇది చాలా ఆకర్షణీయంగా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంది.

లోపలి సౌకర్యాలు:


పైన పేర్కొన్న విధంగా, ఈ వాహనం మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అధనంగా ఆర్ఎక్స్ఇ మరియు ఆర్ఎక్స్టి ఆప్ష్నల్ ప్యాకేజీలను అందిస్తుంది. దీని ఎంట్రీ స్థాయి స్టాండర్డ్ వెర్షన్ రెండు క్యాన్ హోల్డర్లుతో ఫ్లోర్ కన్సోల్, ముందరి సీట్లకి హెడ్‌రెస్ట్‌లు, హీటర్, ముందర ప్రయాణికుని సీటుకి ఓపెన్ స్టోరేజ్, బాటిల్ స్టోరేజ్ తో డోర్ మ్యాప్ స్టోరేజ్ మరియు ముందరి సీటుకి రిక్లైనింగ్ ఫంక్షన్ వంటి లక్షణాలు అందించబడ్డాయి. దీనిలో మిగతా వేరియంట్లు ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ మరియు లోవర్ గ్లోవ్ బాక్స్ తో అందించబడ్డాయి. దీనిలో మధ్య శ్రేణి ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ వీల్, ఆటో ఆన్ / ఆఫ్ క్యాబిన్ కాంతి, ప్రయాణికుని వైపు సన్ విజర్ మరియు వెనుక ప్రయాణికుల కోసం సహాయక గ్రిప్ లు అందించడం జరిగింది. అలానే దీని అగ్ర శ్రేణి వేరియంట్ ఆర్ఎక్స్టి అధనంగా 4 స్పీడ్ బ్లోవర్ మరియు 5 రకాలుగా మార్పు చేసుకోగల ఎయిర్ పంపిణీ సౌకర్యం కలిగి ఉంది. అంతేకాకుండా ఈ అగ్ర శ్రేణి వేరియంట్ ముందరి పవర్ విండోస్, ఆన్ బోర్డు ట్రిప్ కంప్యూటర్, టైమర్ తో క్యాబిన్ లైటింగ్ మరియు వెనుక పార్సెల్ ట్రే వంటి అంశాలను కలిగి ఉంది.

లోపలి కొలతలు:


నిర్దేశాలను గనుక పరిశీలించినట్లైతే, ఈ వాహనం అంతర్భాగం యొక్క విశాల స్థలం మరియు సౌకర్యం తెలుస్తుంది. ఇది అయిదుగురు ప్రయాణికులు కూర్చునేందుకు సౌకర్యంగా ఉంటుంది. దీనిలో తగినంత హెడ్రూం అందించబడినది, కానీ లెగ్‌రూం వూహించినంతగా లేదు. దీనిలో ఇంధన ట్యాంక్ సామర్ధ్యం 28లీటర్లు మాత్రమే ఉండడం అనేది చాలా నిరుత్సాహకరం. ఆసక్తికరంగా, దాని బూట్ కంపార్ట్మెంట్ 300లీటర్ల సామర్ధ్యం కలిగి 1115 లీటర్ల వరకు విస్తరించవచ్చు.

ఇంజన్ మరియు దాని పనితీరు:


వాహనతయారీదారుడు ఈ సిరీస్ ని కొత్తగా అభివృద్ధి చేసిన ఒక చిన్న 0.8-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో అమర్చారు. ఇది 3 సిలిండర్లు మరియు 12 వాల్వులను కలిగి ఉండి 799cc స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ముందరి వీల్స్ కి శక్తి పంపిణీ చేయబడుతుంది. ఈ వాహనం 5678rpm వద్ద 53.26bhp శక్తిని మరియు 4386rpm వద్ద 72Nm టార్క్ ని అందిస్తుంది. ఒక బహుళ పాయింట్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థ దీని ఇంధన సామర్ధ్యం మెరుగుపరచడం కోసం పొందుపరచబడి ఉంటుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ హాచ్బాక్ లో వినోదాన్ని అందించడం కోసం, ఒక అధునాతన సమాచార వ్యవస్థ ను అందించడం జరిగింది. ఈ మోడల్ సిరీస్ యొక్క ఆర్ ఎక్స్ ఎల్ వాహనంలో, ఎం పి3 ప్లేయర్ మరియు ఎఫ్ ఎం/ఏ ఎం రేడియో ట్యూనర్ లతో కూడిన ఒక సింగిల్ దిన్ సంగీత వ్యవస్థ ను అందించడం జరిగింది. అయితే, మీడియా నావిగేషన్ సిస్టం, ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే పొందుపరచడం జరిగింది. ఈ మల్టీమీడియా మరియు నావిగేషన్ సిస్టం లు, 7- అంగుళాల టచ్ స్క్రీన్ ను కలిగి ఉంటాయి మరియు ఆడియో, నావిగేషన్, రేడియో మరియు బ్లూటూత్ నియంత్రణలు టచ్ స్క్రీన్ పై పొందుపరచబడి ఉంటాయి. అంతేకాకుండా, ఈ సంగీత వ్యవస్థ ఆక్స్- ఇన్ పోర్ట్, మీడియా పరికరాలకు యూఎస్బి వంటి కనెక్టవిటీ లకు మద్దతిస్తుంది. వీటితో పాటు, అత్యుత్తమ సౌండ్ అవుట్‌పుట్ ను అందించడం కోసం క్యాబిన్ ముందు భాగంలో అధిక నాణ్యత కలిగిన స్పీకర్లను అమర్చడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా, ఒక రూఫ్ మిక్ ను మరియు రేడియో సిగ్నల్స్ యొక్క మంచి రిసప్షన్ ను అందించడం కోసం పై భాగంలో ఒక యాంటిన్నా ను అమర్చడం జరిగింది. మరోవైపు కొనుగోలుదారులు, వినియోగ ఆధారిత పరంగా మరియు శైలిని మరింత జోడించడానికి మరిన్ని ఉపకరణాలను ఎంపిక చేసుకోవచ్చు. అవి వరుసగా, లెధర్ సీటు కవర్లు, అల్లాయ్ వీల్స్, బాడీ గ్రాఫిక్స్, లెధర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, పవర్ విండోలు మరియు అనేక ఇతర ఉపకరణాలను, కొనుగోలుదారులు వారి అవసరాలను బట్టి ఎంపిక చేసుకోవచ్చు.

వీల్స్ పరిమాణం:


దీనిలో అన్ని వేరియంట్లు 13 అంగుళాల సంప్రదాయ స్టీల్ చక్రాల సమితితో బిగించి ఉంటాయి.ఆర్ఎక్స్ఇ వేరియంట్లో అవి సిల్వర్ తో పెయింట్ చేయబడి ఉండగా, మిగిలిన వేరియంట్లలో నలుపు రంగుతో ఫినిషింగ్ చేయబడి ఉంటాయి. బేస్ మరియు మధ్య శ్రేణి వేరియంట్స్ హబ్ క్యాప్స్ తో చుట్టబడి ఉండగా, మిగిలినవి మల్టీ స్పోక్ కవర్లను కలిగి ఉంటాయి. ఈ రింస్ 155/80 R13 పరిమాణంగల ట్యూబ్ లేని టైర్లతో కప్పబడి మరియు కొన్ని టూల్స్ తో పాటు పూర్తి పరిమాణం గల స్పేర్ వీల్ ని కూడా కలిగి ఉంటాయి. ఈ టూల్స్ టైర్ మార్చుకునేందుకు సహాయపడతాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ వాహనం సమర్ధవంతమైన సస్పెన్షన్ వ్యవస్థతో అమర్చబడి అసమాన రోడ్లపై స్థిరత్వాన్ని అందిస్తుంది. దీని ముందరి ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ తో అమర్చబడి ఉండగా, వెనుక ఆక్సిల్ కాయిల్ స్ప్రింగ్ తో పాటూ ట్విస్ట్ బీం తో అమర్చబడి ఉంటుంది. దీనివలన వాహనం మృధువైన డ్రైవింగ్ ఇవ్వడమే కాదు కుదుపుల్లేని డ్రైవింగ్ ని కూడా అందిస్తుంది. బ్రేకింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే, దీని ముందర వీల్స్ డిస్క్ బ్రేక్‌లతో అమర్చబడి ఉండగా దీని వెనుక వీల్స్ ధృఢనిర్మాణంగల డ్రమ్ బ్రేకుల సమితితో అమర్చబడి ఉంటాయి. ఈ హ్యాచ్‌బాక్ విద్యుచ్చక్తి సహాయక స్టీరింగ్ వ్యవస్థను కూడా కలిగి ఉండి తక్కువ టర్నింగ్ రేడియస్ తో డ్రైవర్ కి మంచి సౌకర్యాన్ని అందిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ మోడల్ సిరీస్ కొన్ని ముఖ్యమైన అంశాలను కలిగి ఉంది. ఇవి ప్రయాణికులకి మాత్రమే కాకుండా వాహనానికి కూడా రక్షణ కలిపిస్తాయి. దీనిలో అగ్ర శ్రేణి వేరియంట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ని కలిగియుండి ఒక బటన్ నొక్కడం ద్వారా అన్ని డోర్లు లాక్ మరియు అన్‌లాక్ చేసే సదుపాయాన్ని కల్పిస్తుంది. డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ దీని ఆర్ఎక్స్టి వేరియంట్లో ఒక వైకల్పిక లక్షణంగా అందించబడుతున్నది. అంతేకాకుండా దీనిలో ఇంజిన్ ఇమ్మొబలైజర్ వ్యవస్థ కూడా ఉండి వాహనంలో అనధికార ప్రవేశాన్ని తొలగిస్తుంది. అందరి ప్రయాణికులకి సీట్ బెల్ట్‌లు రక్షణార్ధమై అందించబడ్డాయి. అంతేకాకుండా, ముందరి ఫాగ్ ల్యాంప్స్ మంచి ప్రత్యక్షత కొరకు అందించబడ్డాయి. అధనంగా, వీటిలో హై మౌంట్ స్టాప్ ల్యాంప్, వార్నింగ్ ట్రైయాంగిల్, క్రుంపుల్ జోన్స్ తో బలమైన శరీర నిర్మాణం మరియు రెండు సంవత్సరాల తుప్పుపట్టకుండా సంరక్షణ అందించడం ఇవన్నీ కూడా భద్రత కొరకు అందించబడినవి.

అనుకూలాలు:


1. బాహ్య రూపం మరియు ప్రదర్శన చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
2. దీనిలో మీడియా నావిగేషన్ వ్యవస్థ ఉండడమనేది ఒక గొప్ప ప్రయోజనం.
3. పుష్కలమైన లెగ్ మరియు షోల్డర్ స్పేస్ ని అందిస్తుంది.
4. ఇంజిన్ పనితీరు చాలా బాగుంది.
5. సమర్ధవంతమైన బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ వ్యవస్థ అందించబడినది.

ప్రతికూలాలు:


1. ఇంటీరియర్ స్టైలింగ్ మరింత ఆకర్షణీయంగా తయారు చేయవచ్చు.
2. వెనుక హెడ్రూం మెరుగుపరచవలసిన అవసరం ఉంది.
3. మరిన్ని వినూత్న సౌకర్య లక్షణాలు జోడించవలసి ఉంది.
4. యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేకపోవడం ఒక పెద్ద లోపం.
5. అన్ని వేరియంట్లలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ ఒక ప్రామాణిక లక్షణంగా అందించవలసిన అవసరం ఉంది.