నెక్స్ట్-జెన్ స్కోడా రాపిడ్ రష్యాలో మనల్ని ఊరించింది; 2022 లో ఇండియా లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది

స్కోడా రాపిడ్ కోసం sonny ద్వారా అక్టోబర్ 16, 2019 04:42 pm ప్రచురించబడింది

  • 33 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

డిజైన్‌లో స్కేలా మరియు సూపర్బ్‌లను పోలి ఉంటుంది

  •  నెక్స్ట్-జెన్ రాపిడ్ 2019 చివరిలో ప్రపంచవ్యాప్తంగా రావడానికి ముందే అధికారిక స్కెచ్‌లో కనిపించింది.
  •  VW గ్రూప్ యొక్క MQB A0 ప్లాట్‌ఫామ్ ద్వారా కొత్త రాపిడ్ రూపుదిద్దుకుందని భావిస్తున్నారు.
  •  ఇండియా లో 2022 నాటికి వచ్చే అవకాశం ఉంది.
  •  ప్రస్తుత రాపిడ్‌కు BS 4 ఇంజన్లు లభిస్తాయి, ఏప్రిల్ 2020 నాటికి BS 6 పవర్‌ట్రైన్‌లను ప్రవేశపెట్టడానికి ఫేస్‌లిఫ్ట్ పొందవచ్చు.
  •  రాపిడ్ హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ & మారుతి సియాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా కొనసాగుతుంది.

Next-gen Skoda Rapid Teased In Russia; India Launch Likely In 2022

స్కోడా మోడల్ పోర్ట్‌ఫోలియో గత సంవత్సరంలో  కొన్ని కొత్త పేర్లను జోడించింది, అయితే ప్రస్తుత మోడళ్లు అప్డేట్స్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ మార్కెట్ లో కార్ల తయారీదారుల ప్రవేశ-స్థాయి సమర్పణలలో రాపిడ్ ఒకటి, మరియు స్కోడా రష్యా నుండి వచ్చిన ఈ తాజా స్కెచ్‌లో నెక్స్ట్-జెన్ మోడల్‌ మనల్ని ఊరించడం జరిగింది.

రాపిడ్ మొట్టమొదట ఇక్కడ 2011 లో ప్రవేశపెట్టబడింది మరియు 2017 లో ఫేస్ లిఫ్ట్ అందుకుంది, కాబట్టి ఏమైనప్పటికీ ఇది జనరేషన్ చేంజ్ తప్పనిసరిగా రావలసిన సమయం. కొత్త రాపిడ్ స్కెచ్ హెడ్‌ల్యాంప్స్, గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్‌ల కోసం ఇలాంటి డిజైన్‌ తో స్కాలా లాంటి ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంటుంది. అదే MQB A0 ప్లాట్‌ఫామ్ ద్వారా ఇది రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫాం దేశంలో స్థానికీకరించబడింది మరియు ఇండియా 2.0 వ్యూహంలో భాగమైన స్కోడా మరియు వోక్స్వ్యాగన్ యొక్క రాబోయే మోడళ్లకు సపోర్ట్ ఇస్తుంది, ఇప్పుడు స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పనిచేస్తోంది.

Skoda Rapid Just Got More Affordable!

నెక్స్ట్-జెన్ రాపిడ్ మునుపటి కంటే పెద్దదిగా ఉంటుంది, ఎందుకంటే ఇది స్కాలా మరియు  వోక్స్వ్యాగన్ వర్టస్ (వెంటో యొక్క వారసుడు) వలె అదే వీల్ బేస్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆ రెండు మోడళ్లు MQB A0 ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటాయి, వీల్‌బేస్‌ విషయానికి వస్తే 2650mm. ఇది ప్రస్తుత రాపిడ్ కంటే 97 మిమీ ఎక్కువ. తత్ఫలితంగా, రెండవ-తరం రాపిడ్ ప్రస్తుత హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి ప్రత్యర్థుల కంటే పెద్దదిగా ఉంటుంది.

Next-gen Skoda Rapid Teased In Russia; India Launch Likely In 2022

స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ యొక్క ఇండియా 2.0 ప్లాన్ ప్రకారం, స్కోడా మరియు VW యొక్క పోర్ట్‌ఫోలియోకు రెండు కొత్తగా స్థానికీకరించిన కార్లను చేర్చాలి - ఒకటి 2021 లో మరియు మరొకటి 2022 లో. మొదటిది స్కోడా కమిక్ / విడబ్ల్యు T-క్రాస్ SUV, హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటివారికి ప్రత్యర్థి. రెండవది న్యూ-జెన్ రాపిడ్ / వెంటో అయితే, 2019 నవంబర్‌లో ప్రపంచ ఆవిష్కరణ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ఇది భారతదేశానికి 2022 లో రానున్నది.

ఇవి కూడా చదవండి: హ్యుందాయ్ వెన్యూ యొక్క ప్రత్యర్థి ని స్కోడా లాంచ్ చేయబోతుంది

Skoda Rapid

అయితే, ప్రస్తుత-స్పెక్ రాపిడ్ BS 4-స్పెక్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో పనిచేస్తుంది. స్కోడా దీనిని ఏప్రిల్ 2020 నాటికి BS 6 పవర్‌ట్రెయిన్‌లతో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది మరియు కొత్త తరం మోడల్ వచ్చే వరకు ఇది రాపిడ్‌కు మరో ఫేస్‌లిఫ్ట్ (LED హెడ్‌ల్యాంప్‌లతో యూరో-స్పెక్ ఫాబియా మాదిరిగానే) ఇవ్వవచ్చు. దాని విభాగంలో, సియాజ్ మినహా అన్ని కార్లు రాబోయే సంవత్సరం లేదా రెండు సంవత్సరాల్లో కూడా నవీకరించబడతాయి.

మరింత చదవండి: రాపిడ్ డీజిల్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన స్కోడా రాపిడ్

1 వ్యాఖ్య
1
a
aluri akash
Dec 13, 2019, 11:54:06 PM

Sun proof of skoda rapid

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience