Citroen C3 Aircross EV: భారతదేశంలో అత్యంత చవకైన 3-వరుసల ఎలక్ట్రిక్ SUVగా నిలవనున్న సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ EV

సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ కోసం tarun ద్వారా ఆగష్టు 09, 2023 05:24 pm ప్రచురించబడింది

  • 56 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

అత్యంత చవకైనది మాత్రమే కాకుండా, C3 ఎయిర్ؚక్రాస్ EV దేశంలో మొదటి మాస్-మార్కెట్ 3-వరుసల EV కూడా కావచ్చు

వచ్చే 2-3 సంవత్సరాలలో, వివిధ పరిమాణాలలో అధికంగా SUVలుగా విడుదల కానున్న EVలతో, ఎలక్ట్రిక్ వాహన విభాగం సందడిగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి, హ్యాచ్ؚబ్యాక్ؚలు మరియు SUVల రూపంలో చవకైన EVల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, కానీ 3-వరుసల EV మాత్రం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక 3-వరుసల ఎలక్ట్రిక్ వాహనం మెర్సిడెస్ బెంజ్ EQB, దీని ధర రూ.75 లక్షల కంటే ఎక్కువగా ఉంది, ఎలక్ట్రిక్ XUV700 2024 చివరిలో రానుంది. అయితే, సిట్రోయెన్ ఈ 3-వరుసల విభాగంలో ఉన్న ఖాళీని భర్తీ చేయడానికి, పై రెండిటి కంటే చవకైన వాహనాన్ని పరిచయం చేయాలనే ప్రణాళికను కలిగి ఉంది.

సిట్రోయెన్ భవిష్య ప్రణాళిక

Citroen C3 Aircross

సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ కాంపాక్ట్ SUVని సెప్టెంబర్ؚలో విడుదల చేయనుంది, eC3 తరువాత ఇది ఈ సంవత్సరంలో రెండవ విడుదల. ఈ ఫ్రెంచ్ కారు తయారీదారు, దీని ఎలక్ట్రిక్ వర్షన్ కూడా వస్తుందని నిర్ధారించింది. 

ప్రతి సంవత్సరం ఒక కొత్త మోడల్ؚను విడుదల చేయాలనే తన ప్రణాళికలను సిట్రోయెన్ ప్రకటించింది, దీనిలో C3 ఎయిర్ؚక్రాస్ కూడా ఉంది. C3 హ్యాచ్ؚబ్యాక్ విక్రయాలు జూలై 2022లో ప్రారంభం అయ్యాయి తదుపరి ఏడు నెలలలో దీని ఎలక్ట్రిక్ వర్షన్ eC3 విడుదలను మనం చూశాము. C3 ఎయిర్ؚక్రాస్ EV విషయంలో కూడా ఇటువంటి టైమ్ؚలైన్ؚనే చూడవచ్చని అంచనా, దీని విక్రయాలు 2024 మొదటి ఆరు నెలలలో ప్రారంభం అవుతాయి.

eC3 ఎయిర్ؚక్రాస్ పై అంచనాలు

C3 ఎయిర్ؚక్రాస్ C3 హ్యాచ్ؚబ్యాక్ యొక్క పొడిగించిన మరియు సవరించిన మోడల్ ఇది ప్రతుత 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను కొనసాగిస్తుంది. అయితే, eC3లో ఉన్నట్లుగా ఎలక్ట్రిక్ 3-వరుసల SUV, హ్యాచ్ؚబ్యాక్ؚకు 320 కిలోమీటర్‌ల మైలేజ్‌ను అందించే 29.2kWh బ్యాటరీ ప్యాక్ؚను ఉపయోగించకపోవచ్చు. సుమారు 40kWh భారీ బ్యాటరీ ప్యాక్ ఉంటుందని అంచనా, దీని పరిధి సుమారుగా 400 కిలోమీటర్‌లు ఉండవచ్చు. 

స్టైలింగ్ విషయానికి వస్తే, దీని రూపం C3 ఎయిర్ؚక్రాస్ కంటే భిన్నంగా ఉండకపోవచ్చు. C3 మరియు eC3 విషయంలో కూడా, కాస్మెటిక్ తేడాలు చాలా తక్కువ ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: రాబోయే ఎలక్ట్రిక్ కార్‌లు

ధర తనిఖీ

Citroen C3 Aircross Third Row

తన స్థానిక ఆఫరింగ్ؚల కోసం సిట్రోయెన్ ధర వ్యూహం చాలా దూకుడుగా ఉంటుందని అర్ధమైంది. ఉదాహరణకు C3 పరిమాణం ఒక ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ؚకు సమానంగా ఉంటుంది కానీ దీని ధరలు, అంతకంటే దిగువ విభాగం నుండి వచ్చే హ్యాచ్ؚబ్యాక్ؚలకు సమానంగా ఉన్నాయి. 

C3 మరియు eC3లను వేరియెంట్-నుండి-వేరియెంట్ؚకు పోల్చితే, ఎలక్ట్రిఫికేషన్ వెర్షన్‌లో ధర 50 శాతం కంటే కొంత ఎక్కువగా ఉంది. C3 ఎయిర్ؚక్రాస్ ధరలను ఇంకా వెల్లడించలేదు, కానీ ఇవి సుమారు రూ. 9 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయని అంచనా. దీని ఆధారంగా, దీని EV వెర్షన్ ధర రూ. 15 లక్షల నుండి రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు, ఇది టాటా నెక్సాన్ EV మాక్స్ మరియు మహీంద్రా XUV400 వంటి సబ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVల ధరలకు సమానంగా ఉంటుంది. 

ఆశించదగిన ఇతర ఎలక్ట్రిక్ మూడు-వరుస మోడల్‌లు

Mahindra XUV700 EV

ఇప్పటివరకు ధృవీకరించిన ఏకైక మూడు-వరుసల కారు XUV.e8 (XUV700 EV), ఇది డిసెంబర్ 2024లో ఆవిష్కరించబడుతుంది. అయితే, దీని ధర సుమారుగా రూ. 35 లక్షలు ఉండవచ్చు, ఈ ధర దీన్ని ఖరీదైన ప్రత్యామ్నాయం మరియు మరింత ఎక్కువ ప్రీమియంగా చేస్తుంది. 

కియా కూడా, భారతదేశంలో అందించడానికి కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని నిర్మిస్తుందని ధృవీకరించింది, ఇందులో ఎలక్ట్రిక్ క్యారెన్స్ కూడా ఉండవచ్చు. హ్యారియర్ EV అందించినట్లు గానే ఎలక్ట్రిక్ సఫారిని కూడా ఆశించవచ్చు. అయితే, ఈ రెండిటి ధర రూ.20 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది మరియు 2025 లేదా ఆ తరువాత వస్తుంది. 

ఈ సంవత్సరం చివరలో, C3 ఎయిర్ؚక్రాస్ EV నుండి ఏం ఆశిస్తున్నామో మనకు స్పష్టమైన ఆలోచన ఉంది. కానీ, దీని విక్రయాలు మొదలైన తరువాత, సరైన ధరతో, మరీ ఎక్కువ ధర కాకుండా ఎలక్ట్రిక్ ప్రపంచానికి మారాలనుకునే ఉమ్మడి కుటుంబాలకు గొప్ప లాభదాయకం అవుతుంది.

ఇక్కడ మరింత చదవండి: C3 ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన సిట్రోయెన్ సి3 Aircross

Read Full News

explore మరిన్ని on సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience