స్కోడా 500,000ల ఏతి లను వెలువరించించిందా!
నవంబర్ 02, 2015 06:05 pm raunak ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
షెక్ వాహనతయారీసంస్థ స్కొడా వారి క్వసెనీ తయారీ సౌకర్యం నుండి 500,000 ల కారులను వెలువరించింది. ఈ క్వసెనీ తయారీ సౌకర్యం షెక్ రిపబ్లిక్ లో స్కోడా యొక్క మూడు పవర్‌ప్లాంట్లలో ఒకటి. స్కోడా 2009 లో ప్రపంచవ్యాప్తంగా ఏతి ని పరిచయం చేసింది మరియు 2013 లో ఈ కాంపాక్ట్ ఎస్యువి ,మిడ్ లైఫ్ నవీకరణను పొందింది. వాహన తయారీసంస్థ ఈ వాహనం యూరప్, చైనా, రష్యా మరియు భారతదేశం లో ఉత్పత్తి చేయబడింది అని తెలిపింది.
"స్కోడా ఏతి సగం మిలియన్ ఉత్పత్తి గణాంకం సాధించడం క్వసెనీ ప్లాంట్ కి ఒక మైలురాయిగా చెప్పవచ్చు." అని ప్రొడక్షన్ అండ్ లాజిస్టిక్స్ యొక్క స్కొడా బోర్డు సభ్యుడు మైఖేల్ ఒయిల్జెక్లాస్ తెలిపారు. " ఏతి ప్రారంభం అయిన దగ్గర నుండి యూరోప్ లో మరియు అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారులను చాలా ఆనందపరచింది. మేము ఈ విజయానికి కారణమైన క్వసెని టీం కి ఎన్నడూ రుణపడి ఉంటాము. ఈ విజయం అంతా కూడా వారి సాంకేతిక నైపుణ్యాలు మరియు ప్లాంటు యొక్క అద్భుతమైన కీర్తిని పెంచేందుకు వారికి ఉన్న అత్యధిక నిబద్ధత వలన సాధ్యం అయ్యింది. తరువాతి కొద్ది సంవత్సరములలో, క్వసెనీ యొక్క ఉత్పత్తి వాల్యూమ్ గణనీయంగా పెరుగుతుంది. దీనిలో ఒక ముఖ్యమైన పాత్రను ఎస్యువి ఉత్పత్తి పోషిస్తుంది." అని అదనంగా ఆయన అన్నారు.
ఉత్పత్తిని వివరించే క్రమంలో, క్వసెనీ లో తయారీసౌకర్యంతో పాటు స్కోడా ఏతి చైనా మరియు రష్యా లో ఉత్పత్తి మార్గాలను నడిపిస్తుంది. చైనా లో, ఏతి చైనీస్ మార్కెట్ కోసం విస్తరించిన షాంఘై వోక్స్వ్యాగన్ ప్లాంట్లో స్థానికంగానే తయారుచేయబడుతుంది. రష్యాలో, నిస్ష్నియీ నావ్గరాడ్ ప్లాంట్లో రష్యన్ తయారీదారులు గాజ్ గ్రూప్ సహకారంతో ఈ కాంపాక్ట్ ఎస్యూవి ఉత్పత్తి చేయబడుతుంది. భారతదేశం గురించి మాట్లాడుకుంటే, ఏతి వాహనం స్కోడా భారతదేశం యొక్క తయారీ సౌకర్యం మహారాష్ట్ర, ఔరంగాబాద్ లో సికెడి సామాగ్రి ద్వారా స్థానికంగా అసెంబుల్ చేయబడుతుంది.