మారుతి 2016 నుండి ఐరోపాలో బాలెనో ని ఎగుమతి చేయనున్నది
జనవరి 04, 2016 11:10 am sumit ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి సుజుకి యూరోపియన్ కు బాలెనో ని ఎగుమతి చేయాలని యోచిస్తోంది. సంస్థ దాని అమ్మకాలను పెంచుకునేందుకు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, డెన్మార్క్ మరియు స్పెయిన్ వంటి పలు మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంది. ఎగుమతులు జనవరి 2016 నుంచి ప్రారంభం కానున్నాయని భావిస్తున్నారు.
భారతదేశం యొక్క అతిపెద్ద కార్ల తయారీ సంస్థ గతంలో జపాన్ కు దాని ప్రీమియం హ్యాచ్బ్యాక్ ని ఎగుమతి చేస్తానని ప్రకటించింది. R C భార్గవ (మారుతి సుజుకి ఛైర్మన్) దీనిని విశదీకరిస్తూ ఈ ఎగుమతి ప్రక్రియ కొంచెం క్లిష్టమైనది. అయినప్పటీకీ, సంస్థ జనవరి 2016 నుండి కార్లు ఎగుమతి చేయనున్నది. ప్రస్తుతం, మారుతి మాత్రమే సుజుకి కోసం బాలెనో యొక్క తయారీదారి.
అమ్మకాల పరంగా తయరీదారులకి గ్లోబల్ స్పందన అంత ప్రోత్సాహకరంగా లేనప్పుడు ఈ చర్య అమలులోనికి వచ్చింది. అది ప్రముఖంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి ప్రాంతాలలో, అమ్మకాలు పతనాన్ని గమనించింది. ఒక పరిశ్రమ విశ్లేషకుడి ప్రకారం "ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి కొన్ని ఎగుమతి మార్కెట్లు ఆయిల్ మరియు వస్తువు ధరలు తిరోగమనం కారణంగా డిమాండ్ మందగమనం చూస్తున్నందున్న యూరప్ కంపెనీ ఎగుమతుల వైపు దృష్టి పెట్టిందని తెలిసింది.
బాలెనో సంస్థ ఇండో-జపనీస్ కంపెనీ కి ఒక రైజింగ్ స్టార్ మరియు దీని ద్వారా కార్ల తయారీదారుడు యూరోపియన్ మార్కెట్లో రెండవసారి నిరూపించుకోవాలనుకుంటున్నాడు. మారుతి సుజుకి యూరోప్ లో పాత ప్లేయర్ మరియు 1987-88 లో 500 యూనిట్లను ఎగుమతి చేసారు. తరువాత భారీ విశ్లేషణ ద్వారా అది నాన్ EUమార్కెట్ లోనికి అడుగుపెట్టింది.
ఇంకా చదవండి : మారుతి బాలెనో వేరియంట్స్ - మీకు ఏది ఉత్తమమైనదో తెలుసుకోండి