మారుతి ఎస్ -క్రాస్ టాప్ ఎండ్ మోడల్ 5.5 లక్షల డిస్కౌంట్ ని ఇస్తుంది
మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం manish ద్వారా జనవరి 08, 2016 01:52 pm ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారతదేశం లో మారుతి సుజుకి యొక్క ప్రీమియం క్రాసోవర్ అయినటువంటి S-క్రాస్ భారీ డిస్కౌంట్ తో వినియోగ దారుల ముందుకి రాబోతోంది. ఈ కారు ముంబై డీలర్షిప్ల పరిధి లో 5.5 లక్షలు డిస్కౌంట్ తో అమ్ముడు పోయాయి. భారతదేశం యొక్క అతిపెద్ద వాహన తయారీదారు అయిన ప్రీమియం డీలర్ షిప్ కలిగిన నేక్జా షో రూమ్ నుండి అమ్ముడు పోయిన మొట్టమొదటి వాహనం ఈ మారుతి సుజుకి. భారత తయారీదారులు మారుతి S-క్రాస్ ని హ్యుందాయ్ క్రిట కి దీటుగా అందించినప్పటికీ ఇది అంతగా రాణించలేకపోయింది. తద్వారా గత సంవత్సరం దాని జాబితాలో ఎక్కువ రాణించలేదు. ఫలితంగా మారుతి సుజుకి ప్రీమియం క్రాస్ఓవర్ కి ఇటువంటి భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ముంబై లో ఎంపిక చేసుకున్న కొన్ని అవుట్లెట్లో మాత్రమే ఈ ఆఫర్ అందించబడుతుంది.
S-క్రాస్ ఆగస్టు నెలలో గత ఏడాది ప్రారంభించబడింది మరియు గత డిసెంబర్ వరకు మారుతి 16,000 యూనిట్ల కంటే తక్కువగా విక్రయించింది. ఇదే కాలంలో క్రిట 37,000 యూనిట్లు అమ్మకాలు నమోదు చేసుకుంది.
5.5 లక్షల డిస్కౌంట్ ధర తో అందించబోతున్న మారుతి స-క్రాస్ టాప్ ఎండ్ మోడల్ DDiS 320 వేరియంట్ ని కలిగి ఉంటుంది. ఈ 320 డీజిల్ వేరియంట్ ఉత్పత్తి చేసే టార్క్320Nm. ఈ ఉత్పత్తి దాని ప్రత్యర్ధి అయినటువంటి హ్యుందాయ్ క్రిట కంటే 60Nm లు ఎక్కువ .ఈ హ్యుందాయ్ క్రిట 260Nm ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. మరియు 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్ 128PS ఉత్పత్తి చేస్తుంది, S-క్రాస్ 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉత్పత్తి చేసే శక్తి 120PS.
ఇది కుడా చదవండి : మారుతి ఏ దిశగా ప్రయాణిస్తుంది?