ల్యాండ్ రోవర్ భారతదేశానికి కొత్త పెట్రోల్ ఇంజన్లు తెస్తుంది
జనవరి 20, 2016 01:07 pm konark ద్వారా సవరించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇటీవల 2,000 సిసి సామర్ధ్యం మరియు అంతకంటే ఎక్కువ సామర్ధ్యం గల డీజిల్ వాహనాల అమ్మకానికి ఢిల్లీ-NCR లో వేసిన నిషేధం అధిగమించేందుకు టాటా మోటార్స్ సొంతమైన ల్యాండ్‌రోవర్ 2-లీటర్ ఇన్‌లైన్ 4 సిలిండర్ మరియు 3-లీటర్ V6 మోటార్ కలిగియున్న పెట్రోల్ ఇంజన్లను దాని అంతర్జాతీయ శ్రేణిలోనికి తీసుకురానున్నది.
రేంజ్ రోవర్ ఇవోక్ లో నైన్ స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ తో జతచేయబడియున్న 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించవచ్చని ఊహిస్తున్నాము మరియు మరింత శక్తివంతమైన 3 లీటర్ V6 ఇంజిన్ డిస్కవరీ లో ఉండవచ్చు. రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడళ్ళు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో జతచేయబడతాయి. ల్యాండ్ రోవర్ యొక్క ప్రస్తుత పోర్ట్ఫోలియో కొన్ని నమూనాలకు 5-లీటర్ సూపర్‌చార్జెడ్ వ్8 ని కలిగి ఉంటుంది. దీని ప్రస్తుత పోర్ట్ఫోలియో రేంజ్ రోవర్ ఇవోక్,డిస్కవరీ, డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు రేంజ్ రోవర్ LWB ని కలిగి ఉంది.
స్మస్థ గత సంవత్సరం మా మార్కెట్లో డిస్కవరీ స్పోర్ట్ ని రూ.46 లక్షల పోటీ ధర వద్ద ప్రారంభించింది. అయితే, ఇది 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ని ఉపయోగిస్తున్న కారణంగా ఇది డిల్లీ NCR ప్రాంతంలో ప్రస్తుతం కొనుగోలు కాదు. ఈ డీజిల్ బాన్ భారతదేశ కారు తయారీసంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా పై ప్రభావం చూపించింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఇప్పుడు స్కార్పియో మరియు XUV 500 కి 1.9 లీటర్ డీజిల్ ఇంజిన్ అభివృద్ధి చేసింది.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫోర్డ్ నుండి టాటా మోటార్స్ ద్వారా 2008 లో సొంతం చేసుకుంది మరియు బ్రిటిష్ వాహనతయారీసంస్థ 2009 లో మన మార్కెట్ లోనికి ప్రవేశించింది. జెఎల్ఆర్ సంస్థ 2015 కి 4, 87,065 వాహనాలను అమ్మకాలు చేసి ముందు సంవత్సరంతో పోలిస్తే 5 శాతం ఎక్కువ అత్యున్నత అంతర్జాతీయ అమ్మకాల సంఖ్య ని సొంతం చేసుకుంది.
ఇంకా చదవండి
త్వరలోనే ప్రారంభం కానున్న మహీంద్రా XUV500 మరియు మహీంద్రా స్కార్పియో 1.9 లీటర్ వేరియంట్స్