జాగ్వార్ XE 2016 భారత ఆటో ఎక్స్పో లో ప్రారంభం కానుంది.
జాగ్వార్ ఎక్స్ఈ 2015-2019 కోసం అభిజీత్ ద్వారా డిసెంబర్ 14, 2015 06:10 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్ : జాగ్వార్ యొక్క3-సిరీస్ ఫైటర్ XE భారత ఆటో ఎక్స్పోలో 2016 లో ప్రారంభం కానుంది. అలాగే వాటితో పాటూ కొత్త ఎక్స్ ఎఫ్ మరియు ఎఫ్ - ఫేస్ ,ఎంట్రీ స్థాయి లగ్జరీ సెడాన్ లని కుడా ప్రదర్శించబోతోంది. ఎక్స్ఈ సెడాన్ ఈ సంవత్సరం ప్రారంభంలో విదేశాలలో ప్రారంభించబడింది, ఇది మంచి అందమయిన లుక్ ని కలిగి ఉంది. ఇది ఆడి A4 మరియు మెర్సెడెజ్-బెంజ్ సి-క్లాస్ లకి గట్టి పోటీగా ఉండబోతోంది.
XE జాగ్వార్ ల్యాండ్ రోవర్ పూనే ప్లాంటులో తయారు చేయబడుతుంది.అందువలన దీనిధర దాదాపు రూ.40 లక్షలకి దగ్గరగా ఉండవచ్చు.
దీని అంతర్విషేశాలు మాట్లాడినట్లయితే జాగ్వార్ దాని ఇతర కార్లు (SU మరియు F-పేస్ మాత్రమే)వలే XE కూడా ఒక అన్ని అల్యూమినియం చట్రం మీద ఆధారపడి ఉంటాయి. ఇది దానియొక్క Ingenium ఇంజిన్ లైనప్ నుండి 161bhp వద్ద 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ చేత నడపబడుతుంది. పెట్రోల్ వైపున అది ఒక 2.0-లీటర్ మోటార్ మరియు ఒక V6 ఎంపిక ని కలిగి ఉంటుంది. కానీ అవకాశాలు నిరాధారమయినవి.
బయట వైపు నుండి చూస్తే , కారు మునుపటి కార్లతో పోలిస్తే జాగ్వార్ కీలకమయిన లక్షణాలని కలిగి ఉండి మంచి స్పోర్టీ లుక్ ని కలిగి ఉంటుంది. లోపలి భాగాలు కుడా తాజాగా జాగ్వార్ యొక్క నిజమయిన లక్షణాలని కలిగి ఉంటాయి.
ఇతర రెండు XF మరియు F- పేస్ లు కుడా సంవత్సరం లోపల ప్రారంభించబడుతాయి. XF 2016 వ సంవత్సరం మధ్యలోను మరియు F- పేస్ అదే సంవత్సరం చివర భారత ఆటోమేటివ్ సన్నివేశంలో ప్రారంభం అవతుంది అని అంచనా వేస్తున్నారు.
మీరు ఇవి కుడా ఇష్టపడవచ్చు.
0 out of 0 found this helpful