జాగ్వార్ ఫార్ములా E లోనికి అడుగిడబోతోంది
డిసెంబర్ 17, 2015 05:11 pm manish ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:పోయిన ఏడాది, ఫార్ములా 1 రేసింగ్ రంగంలో అడుగుపెట్టిన మన భారతీయ లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ ఇప్పుడు ప్రపంచ మోటోస్పోట్ రంగంలోనికి ఫార్ములా E ద్వారా అడుగిడబోతోంది. తద్వారా, ఇది ఫెలీనా బ్రాండ్ వారి ఆటల మైదానంగా మారబోతోంది. ఈ ఫార్ములా E అనేది ఒక ఎలక్ట్రిక్ రేస్ మోటార్ స్పోర్ట్ మరియు జాగ్వార్ తమ ప్రకటన ద్వారా ఇందులోని తమ శ్రేణులలో పాలు పంచుకోనున్నట్టు ఈ రోజు తెలిపింది.
నిక్ రోజర్స్, ఇంజినీరింగ్ డైరెక్టర్, జె.ఎల్.ఆర్ సంస్థ వారు ఇలా తెలిపారు "ఎలక్ట్రిక్ వాహనాలు అనేవి జాగ్వార్ ల్యాండ్‌రోవర్ యొక్క భావితరపు ఉత్పత్తుల తీరుతెన్నులను నిర్దేశించే ఒక సరైన ఆటల అవకాశంగా భావిస్తున్నాము మరియు అందుకు ఫార్ములా E సరైన అవకాశాన్ని కల్పించి మా ఈ ఎలక్ట్రిఫికేషన్ టెక్నాలజీస్ రంగంలో నవీకరణలకు ఎంతాగానో దోహదపడుతుందని భావిస్తున్నాము"
ఈ మోటార్‌స్పోర్ట్ రంగంలో టాటా వారి సంస్థ అడుగుపెడుతూ తద్వారా విలియంస్ అడ్వాన్సెడ్ ఇంజినీరింగ్ సంస్థతో చేతులు కలపబోతుంది. ఇది విలియంస్ గ్రూప్ లో ఒక భాగం( వీరు మునుపటి ఫార్ములా 1 చాంపియన్స్). జాగ్వార్ వారు 2004 మోటార్ స్పోర్ట్ లో ముఖ్యంగా పాలు పంచుకోవడం జరిగింది. అయితే వారు అప్పుడు ఈ ఫార్ములా 1 మరియు ఫార్ములా మోటార్స్ రంగంలో జాగ్వార్ మరియు ఆస్టాన్ మార్టెన్లు కలిగి ఉన్నారు. జాగ్వార్ వారు ఇప్పుడు ఇటాలియన్ ట్రుల్లి టీం లో భాగంగా ఉన్న 10 సాట్లలో ఒకటి భర్తీ చేయనున్నారు. 10 సంవత్సరాల క్రితం ఆటో రంగంలో అందరి అభిప్రాయం ప్రకారం ఈ మోటార్ స్పోర్ట్స్ వాహనాల యొక్క బ్రాండ్ క్వాలిటీ(బ్రాండ్ కి ఉన్న పేరు)ని పెంచేవిగా ఉంటాయని భావించారు. ఎందుకంటే, ఈ క్రమంలో వాహనాలపైన జరిగే నవీకరణలు తద్వారా ఆన్ రోడ్ వాహనాల మెరుగుబాటలో సహాయపడగలవని వారి అభిప్రాయం. కానీ ఇది చాలా కాలం నాటి మాట అని చెప్పాలి. అప్పటిలో ఫార్ములా 1 ఆటోమోటివ్ రంగానికి చాలా చేరువగా ఉండేది. మరి అది ఇప్పుడు ఏరోనాటిక్స్ రంగానికి సమీపంలో ఉందని చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆశక్తి సందర్భంలో ఇదే తీరు ఆటోమోటివ్ రంగానికి కూడా వర్తిస్తుందేమో అని భావించవచ్చు.
ఇంకా చదవండి
0 out of 0 found this helpful