• English
  • Login / Register

2016 ఆటో ఎక్స్పోలో ఫియట్: ఏమిటి అందిస్తుంది?

జనవరి 28, 2016 05:07 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫియాట్ సంస్థ 2016 ఆటో ఎక్స్పోలో దాని లైనప్ ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంది. ఇటాలియన్ కార్ల తయారీసంస్థ దాని పుంటో ఈవో, కొత్త లీనియా మరియు అవెంచురా యొక్క 2016 వెర్షన్లు ప్రదర్శించే అవకాశం ఉంది. ఇది ఎంతగానో ఎదురుచూస్తున్న పుంటో ప్యూర్ మరియు రాంగ్లర్ మరియు గ్రాండ్ చెరోకీ తో సహా మొత్తం జీప్ లైనప్ ని ప్రారంభించనున్నది. మేము క్లుప్తంగా క్రింద పేరాల్లో వాటి యొక్క పూర్తి వివరణ ఇచ్చాం.  

పుంటో ప్యూర్ 

ఎంతగానో ఎదురుచూస్తున్న 'అసలైన ' పుంటో 1.3 లీటర్ డీజిల్, 1.2 లీటర్ మరియు 1.4 లీటర్ పెట్రోల్ మూడు ఇంజిన్లతో అందించబడుతుంది. అత్యంత శక్తివంతమైన ఇంజిన్, 1.4L పెట్రోలు 90Bhp శక్తిని అందిస్తుంది. అదేవిధంగా ఈ వాహనం హ్యుందాయ్ ఎలైట్ ఐ 20, ఫోక్స్వ్యాగన్ పోలో, మరియు మారుతి బాలెనో వంటి ప్రీమియం హ్యాచ్బ్యాకులతో పోటీ పడుతుంది.    

జీప్ రాంగ్లర్

అత్యంత చర్చించబడిన కార్లలో ఒకటైన జీప్ రాంగ్లర్  3.6-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో అమర్చబడి  285hp గరిష్ట శక్తి మరియు  352Nm టార్క్ ని అందిస్తుంది. మరోవైపు డీజిల్ ఇంజిన్  2.8-లీటరు ఇంజిన్ చే అమర్చబడి 197hp గరిష్ట శక్తిని మరియు 451Nm టార్క్ ని అందిస్తుంది.  

జీప్ గ్రాండ్ చెరోకీ

జీప్ గ్రాండ్ చెరోకీ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో వార్తలలో వస్తున్న ఎంతగానో ఎదురు చూస్తున్న వాహనాలలో ఒకటి. ఈ అధునాతన నైపుణ్యంగల వాహనం ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు  Quadra లిఫ్ట్ ఎయిర్ సస్పెన్షన్ సిస్టం ఉపయోగాన్ని తగ్గించింది. ఇది  3.0-లీటర్ డీజిల్ మిల్లు ద్వారా ఆధారితం చేయబడి  236 బిహెచ్పిల గరిష్ట శక్తిని అందిస్తుందని ఊహిస్తున్నాము మరియు ఇది 8-స్పీడ్  ZF ఆటోమేటిక్ గేర్బాక్స్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది.   

జీప్ చెరోకీ SRT

ఈ వాహనం 6.4-లీటర్ హెమీ ఇంజిన్ ని కలిగి ఉండి 475bhp శక్తిని మరియు  644Nm టార్క్ ని అందిస్తుంది. అంతర్భాగాలలో సెంటర్ కన్సోల్ 19-స్పీకర్ సౌండ్ సిస్టంతో జతచేయబడిన ఒక 8.4-అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇది  SUV యొక్క పనితీరు గణాంకాలను కూడా ప్రతిబింబిస్తుంది. 

లీనియా 2016 (టిపో)

తదుపరి తరం లీనియా మొదటి ఇస్తాంబుల్ ఆటో షో లో ప్రదర్శింపబడింది మరియు దాని ఆడంబరమైన లుక్స్ తో అందరినీ ఆకర్షిస్తుంది. భారతదేశంలో ఈ కారు విడుదలైనప్పుడు అదే 1.4L పెట్రోలు ఇంజన్ తో అమర్చబడి ఉండవచ్చు. ఈ ఇంజిన్ 212Nm టార్క్ తో 145 బిహెచ్పిల గరిష్ట శక్తిని అందిస్తుంది మరియు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ గణాంకాలతో ఈ వాహనం విభాగంలో అత్యంత శక్తివంతమైన సెడాన్ గా ఉంటుంది. ఈ కారు సస్పెన్షన్ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొస్తుందని భావిస్తున్నారు.  

ఇంకా చదవండి

2016 ఆటో ఎక్స్పోలో టొయోటా

was this article helpful ?

Write your వ్యాఖ్య

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience