టాటా నెక్సాన్: మేము ఇష్టపడే ఐదు విషయాలు

ప్రచురించబడుట పైన Jun 22, 2019 01:19 PM ద్వారా Rachit Shad for టాటా నెక్సన్

 • 83 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

నెక్సాన్ మంచి ఆఫర్, కానీ ఈ క్రింద లక్షణాలు గనుక ఉండి ఉన్నట్టు అయితే మంచి ఆల్ రౌండర్ గా ఉండి ఉండేది.

Tata Nexon

సబ్ -4m SUV విభాగంలో టాటా ప్రవేశం చాలా కాలం చెల్లింది. ఇది తిరిగి సెప్టెంబర్ 2017 లో నెక్సాన్ తో రూ .5.85 లక్షలు (ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ) ప్రారంభ ధరతో వచ్చింది. టాటా నెక్సాన్ దాని ప్రధాన ప్రత్యర్థులందరి ధరతో పోల్చినట్లయితే బాగా తక్కువ అని చెప్పవచ్చు. ఇప్పుడు, నెక్సాన్ యొక్క బేస్ వేరియంట్ ధరలు రూ.6.23 లక్షలకు (ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ ) బాగా పెరిగాయి మరియు ఇది ఇప్పటికీ కూడా దాని ప్రత్యర్ఢుల కంటే తక్కువగానే ఉంది అని చెప్పవచ్చు. ఇంకా ఏమిటి ఉన్నాయి అంటే, ఇది సెగ్మెంట్‌లోని బలమైన డీజిల్ ఇంజిన్‌ తో, రిఫ్రెష్ లుక్‌తో అందించబడుతుంది మరియు ఇది సబ్-రూ .10 లక్షల బ్రాకెట్‌లోని మొదటి టాటా కారు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు మరియు ABS అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా కలిగి ఉంది. వాస్తవానికి, ఇది అన్ని పెద్ద వేరియంట్లలో ఈ ప్రాథమిక భద్రతా లక్షణాలను కలిగి ఉన్న దాని పెద్ద తోబుట్టువు అయిన హెక్సాకు సమంగా ఉంటుంది.  

అంతా బాగున్నాయి మరియు నెక్సాన్ ఈ విభాగంలో తమ యొక్క షేర్ ని బాగా అందుకుంది అని చెప్పవచ్చు. కానీ మీరు దగ్గరగా చూస్తే దీనిలో కొన్ని లోపాలు కూడా తెలుస్తాయి. టాటా బేబీ SUV లో మేము ఇష్టపడే ఐదు విషయాలు ఇక్కడ ఉన్నాయి.

Rear AC Vents

సరైన వెనుక A.C వెంట్స్: అవును. టాటా నెక్సాన్ వెనుక ప్రయాణీకుల కోసం అంకితమైన A.C వెంట్లను కలిగి ఉంది, కాని అవి నిజంగా అనుకున్న విధంగా పనిచేయవు. అది సరిగ్గా పని చేయాలంటే సరైన మార్గం ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ నుండి నేరుగా చల్లని గాలిని లోపలకి పంపించాలి మరియు చాలా కార్లు కూడా అదే విధంగా చేస్తాయి.  అయితే నెక్సాన్ లో వెనకాతల A.C వెంట్స్ క్యాబిన్ నుండి గాలిని పీలుస్తుంది మరియు ఆ గాలిని వెనుక ప్రయాణీకుల వైపుకు మళ్ళించబడతాయి. అంటే, మీరు వెనుక A.C వెంట్స్ తెరిచి ఉంటే, క్యాబిన్ చల్లబరచడానికి చాలా సమయం పడుతుంది.

Touchscreen Infotainment

మంచి టచ్‌స్క్రీన్ ప్రతిస్పందన: టాటా మోటార్స్ నుండి వచ్చిన ఇతర కారులా కాకుండా, నెక్సాన్ కొత్త 6.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది, ఇది డాష్‌బోర్డ్ పైన అమర్చబడి ఉంటుంది. ఇది చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే ఇంటీరియర్స్ ని బాగా అందంగా కనిపించేలా చేస్తుంది, కానీ దీనిలో కొంచెం వెనకబాటు తనం అనేది ఉంది. ఖచ్చితంగా, మీరు సిస్టమ్‌లోని ఏదైనా లక్షణాలను ఆపరేట్ చేయడానికి సెంట్రల్ A.C వెంట్స్ క్రింద అమర్చిన రోటరీ నాబ్ లను ఉపయోగించవచ్చు. స్క్రీన్ బాగా స్పందిస్తే బ్లూటూత్ పరికరాన్ని జత చేయడం లేదా నావిగేషన్ సిస్టమ్‌ను సెట్ చేయడం వంటి అనుభూతి అనేది ఈ టచ్‌స్క్రీన్ వల్ల ఇంకా మెరుగ్గా ఉండి ఉంటే బాగుండేది.

Gear Lever

సున్నితమైన గేర్‌షిఫ్ట్‌లు: నెక్సాన్ ప్రారంభించబడటానికి ముందే దానిని నడపడానికి మాకు అవకాశం ఉంది. ఆ సమయంలో, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాలా మృదువుగా లేదని మేము గమనించాము. మీరు ఏ ఇంజిన్ ఎంపికను ఎంచుకున్నా, గేర్‌షిఫ్ట్‌ లకు అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది మరియు అంత సున్నితమైనది కూడా కాదు.

Tambour Door

మంచి ఎర్గోనామిక్స్: క్యాబిన్ లోపల కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి, అవి ఉండకుండా ఉండి ఉంటే బాగుండేది. సంగీత వ్యవస్థ కోసం USB మరియు AUX పోర్టుల ప్లేస్‌మెంట్‌ తో ఇబ్బందులు ప్రారంభమవుతాయి. రెండూ కూడా గేర్‌బాక్స్ వెనుక ఉన్న క్యూబీ హోల్ లో పెట్టడం జరిగింది, అవి అందుకోవడం చాలా కష్టం మరియు కేబుల్ ని దూర్చడం కూడా చాలా కష్టం. అలాగే, ఇక్కడ గేర్ నాబ్ యొక్క విచిత్రమైన ఆకారం ఉంది. ఇది పట్టుకోవటానికి సౌకర్యవంతంగా ఉండదు. కానీ అతిపెద్ద సమస్య ఏమిటంటే టాంబోర్ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ ఓపెన్ చేసే సమయంలో ఖచ్చితంగా వెన్నుముఖ సంబందించిన సమస్యలు వస్తాయి. ఇరుకైన, కానీ లోతైన, స్థలంలో రెండు కప్పు హోల్డర్ల కోసం రూపొందించబడింది, కానీ వాటిని ఉంచడం లేదా తీయడం అంత సులభం అయితే కాదు. బదులుగా, ఆ స్థలాన్ని USB / AUX పోర్ట్‌లతో మొబైల్ ఫోన్ హోల్డర్‌గా ఉపయోగించుకోవాలి.    

Maruti Suzuki Vitara Brezza And Tata Nexon

మరిన్ని ఫీచర్లు:  నెక్సాన్ విస్తృతమైన ఫీచర్ జాబితాను కలిగి ఉంది, అయితే ఇది కొన్ని ముఖ్యమైన వాటిని కోల్పోతుంది. ఉదాహరణకు, టాప్-స్పెక్ వెర్షన్‌ లో కూడా సన్‌రూఫ్ లేదు, హోండా WR-V దానిని కలిగి ఉంది. అదేవిధంగా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు లేదా ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్లు లేవు, ఇవన్నీ దాని రెండు ప్రధాన ప్రత్యర్థులైన మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌ లో చూడవచ్చు.  

Also Read: 

Read More on : Tata Nexon on road price

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన టాటా నెక్సన్

1 వ్యాఖ్య
1
M
mohammed areekadan
Sep 24, 2017 11:28:08 AM

no resale value for TATA.Price is very hight .Bad revotron engine.

  సమాధానం
  Write a Reply
  Read Full News

  సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

  ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
  ×
  మీ నగరం ఏది?
  New
  CarDekho Web App
  CarDekho Web App

  0 MB Storage, 2x faster experience