వోక్స్వాగన్ వెంటో

` 8.0 - 13.8 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

వోక్స్వాగన్ ఇతర కారు మోడల్లు

 
*Rs

వోక్స్వాగన్ వెంటో వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


దాని ఉద్గార కుంభకోణం గొడవల నడుమ, వోక్స్వ్యాగన్ ఇండియా వెంటో సెడాన్ శ్రేణిలో ఒక కొత్త అగ్ర శ్రేణి వేరియంట్ ని ప్రారంభించింది. కొద్ది రోజుల క్రితమే, దీని ఫేస్లిఫ్ట్ వెర్షన్ భారతదేశంలో ప్రారంభించబడినది, కానీ వేగవంతమైన అమ్మకాలను పొందలేకపోయింది. ఇప్పుడు, కొత్తగా, ప్రారంభించబడిన వేరియంట్ హైలైన్ ప్లస్ అను బ్యాడ్జింగ్ తో పెట్రోలు మరియు డీజిల్ ఇంజన్ రెండు ఎంపికలలో లభిస్తుంది. అయినప్పటికీ ఇది పరిమితం కాదు లేదా ఒక ప్రత్యేక ఎడిషన్ కాదు, బాహ్య లక్షణాల నుండి అంతర లక్షణాల వరకూ ప్రత్యేక లక్షణాలను పూర్తి ప్యాకేజీలో పొంది ఉంది. బయటవైపు, ఈ తాజా ఉత్పత్తి నల్లని రూఫ్ ఫోయిల్ ని కలిగియుండి దాని యొక్క శైలిని మరింతగా పెంచుతుంది. అలానే, కార్బన్ ఫినిషింగ్ తో ఓఆర్విఎం క్యాప్స్ క్యాప్స్ మరింత సౌకర్యాన్ని అందిస్తాయి. అంతర్గతభాగాల విషయానికి వస్తే, సెంటర్ ఫేసియా పైన కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ వాహన ప్రతేకతను మరింతగా పెంచుతాయి. అదనంగా, 'వెంటో' అక్షరాలతో ఫ్లోర్ మ్యాట్స్, విడదీసే విండో బ్లైండ్స్ మరియు స్కఫ్ ప్లేట్లు వంటి లక్షణాలు అందించబడతాయి. వినోదం విభాగంలోని వెళ్ళేముందు, ఈ కొత్త ట్రిమ్ బ్లా పంక్ట్ మల్టీ మీడియా మరియు నావిగేషన్ వ్యవస్థతో అందించబడుతుంది. ఇది అధిక నాణ్యత 7 అంగుళాల యాంటీ రెఫ్లెక్స్ టచ్ స్క్రీన్ డివైస్ ని ఇతర కనెక్టివిటీ సౌకర్యాలతో పాటు కలిగి ఉంది. సాంకేతిక వివరణల విషయానికి వస్తే, నవీకరణలను ఇప్పటికే ఇటీవల విడుదలైన ఫేస్లిఫ్ట్ వెర్షన్ కి ఇవ్వబడినవి మరియు ఇప్పటికైతే ఎటువంటి మార్పులను పొందలేదు. తయారీదారుడు 7.5 శాతం వరకు ఇంధన సామర్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు దాని పవర్ ప్లాంట్స్ లో కొద్దిపాటి నవీకరణలు చేయబడ్డాయి. దీని కొత్త డీజిల్ ఇంజిన్ ఒక కొత్త 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో భర్తీ చేయబడి 20.64 kmpl మైలేజ్ ని పొందే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం పెట్రోలు మరియు ఆయిల్ బర్నర్స్ రెండూ ఎంచుకోవడానికి మాన్యువల్ అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

ఈ సెడాన్ ఇప్పటికే ట్రిపుల్ స్లాట్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, బోల్డ్ హెడ్లైట్లు మరియు సొగసైన అల్లాయ్ వీల్స్ అలంకరించబడి మంచి శరీర నిర్మాణాన్ని కలిగి ఉంది. దీని అంతర్భాగాలు ఐదుగురు కూర్చునేందుకు సదుపాయంగా ఉంటుంది. ఈ చక్కదనం బహుళ-ఫంక్షనల్ స్విచ్లు తో అమర్చబడియున్న స్టీరింగ్ వీల్ తో మరింత పెరుగుతుంది. వీటన్నింటి కంటే, స్పేస్ మాక్స్ నియంత్రణ అందుబాటులో ఉండి వెనుక నుండి సహ-ప్రయాణికుడి సీటు సర్దుబాటు చేసుకొనే విధంగా ఉంటాయి. వీటితో పాటూ, క్యాబిన్ ఫుట్ వెల్ లైట్స్, డ్రైవర్ సైడ్ సన్విజర్ లో టికెట్ హోల్డర్, మోనోక్రోమ్ బహుళ ఉపయోగాల ప్రదర్శన మరియు వెనుక డోర్లలో నిల్వ కంపార్ట్మెంట్లని కూడా కలిగి ఉంది. ఈ వాహనం యొక్క బద్రత పరంగా చెప్పాలంటే, కంఫర్ట్ లైన్ మరియు హై లైన్ వేరియంట్ లు ఏబిఎస్ ను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ఒక ప్రామాణికమైన లక్షణంగా అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ వాహనం వెనుక పార్కింగ్ సెన్సార్లు, మూడు పాయింట్ల సీట్ బెల్ట్స్, అలాగే పవర్ విండోస్ కోసం యాంటీ పించ్ ఫంక్షన్ వంటి ఇతర ముఖ్యమైన అంశాలను కూడా కలిగి ఉంది. ఈ వోక్స్వాగన్ వాహనం, ఈ విభాగం లో ఉన్న ఇతర వాహనాలు అయినటు వంటి మారుతి సియాజ్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది. ఈ సెడాన్, రెండు సంవత్సరాలు లేదా అపరిమిత కిలోమీటర్ల ప్రామాణిక వారంటీ, తో అందించబడుతుంది. కారు యొక్క యజమానులు ఒక సంవత్సరం లేదా 80,000 కిలోమీటర్ల వరకు వారెంటీ కాలాన్ని పొడిగించవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ సరి కొత్త వెర్షన్ లో గమనించదగ్గ విషయం ఏమిటంటే మైలేజ్ పెగుదల. ఈ వాహనాల యొక్క మైలేజ్ విషయానికి వస్తే, ఈ సిరీస్ యొక్క 1.6 లీటర్ ఎం పి ఐ పెట్రోల్ ఇంజన్ అత్యధికంగా 16.09 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. అదే విధంగా టి ఎస్ ఐ అధారిత పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తె, అత్యధికంగా 18.19 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. మరోవైపు, ఈ సిరీస్ యొక్క మాన్యువల్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 20.64 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. అదే విషంగా ఈ సిరీస్ యొక్క ఆటోమేటిక్ డీజిల్ ఇంజన్ వేరియంట్ విషయానికి వస్తే, అత్యధికంగా 21.5 కె ఎం పి ఎల్ మైలేజ్ ను ఇస్తుంది.

శక్తి సామర్థ్యం:


ఈ వాహన సిరీస్ యొక్క టార్క్ అవుట్పుట్ విషయానికి వస్తే, 1.6 లీటర్ పెట్రో ఇంజన్ 3800 ఆర్ పి ఎం వద్ద 153 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అదే, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వచ్చినట్లైతే, 1500 నుండి 4100 ఆర్ పి ఎం మధ్య లో 175 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అదే 1498 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉన్న 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 1500 నుండి 2500 ఆర్ పి ఎం మధ్య లో 250 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ వాహనాల యొక్క పవర్ విషయం లో అశ్చర్యపడవలసిన అవసరం ఏమిటంటే, ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లు వివిధ ఆర్ పి ఎం ల వద్ద 103.5 బి హెచ్ పి పవర్ ను మాత్రమే విడుదల చేస్తాయి.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ వాహన సిరీస్ యొక్క టిడి ఐఅధారిత డీజిల్ ఇంజన్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డి ఎస్ జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ రెండు ఎంపికల తో అందించబడుతుంది. ఈ వాహన సిరీస్ యొక్క త్వరణం విషయానికి వస్తే, ఈ ఇంజన్ 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 12 నుండి 14 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ ఇంజన్ ను కలిగి ఉన్న వాహనం 175 నుండి 185 కె ఎం పి ఎల్ గల అత్యధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ సిరీస్ యొక్క 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోవడానికి 9 నుండి 11 సెకన్ల సమయం పడుతుంది. అదే విధంగా ఈ వాహనం మరోవైపు 175 నుండి 180 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగలుగుతుంది. అయితే ఇంతలో, 1598 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉన్న 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 12 సెకన్ల సమయం పడుతుంది. అదే విధంగా మరోవైపు ఇదే ఇంజన్ ను కలిగి ఉన్న వాహనం అత్యధికంగా 185 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

వెలుపలి డిజైన్:


పైన చెప్పినట్లుగా, వెంటో యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్ కొన్ని నెలల క్రితం ప్రారంభించబడింది. ఈ వాహనం కొత్త రూపాన్ని సంతరించుకున్నప్పటికీ తయారీదారులు అనుకున్నట్లుగా వాహన ప్రియులను ఆకట్టుకోలేదు. ఇప్పుడు, దీని లైనప్ లో కొత్త వేరియంట్ చేర్చబడి ఇతర వేరియంట్స్ కంటే మంచి లుక్ ని ఇస్తుంది. ఇది రూఫ్ కొరకు నలుపు రంగు ఫోయిల్ ని కలిగియుండి కారుకి స్పోర్టీ లుక్ ని ఇస్తుంది. అధనంగా వెనుక వైపు డోర్ మిర్రర్స్ కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ తో బోల్డ్ లుక్ ని ఇస్తుంది. ఇంకా, వాహనం ఒక డైనమిక్ లుక్ ఇవ్వడం కోసం డోర్ ప్యానెల్ పైన సైడ్ మోల్డింగ్స్ అందించబడతాయి.. ఇవే హైలైన్ ప్లస్ వేరియంట్ కి మిగిలిన వేరియంట్ కి తేడా. ఇటీవల ప్రవేశపెట్టిన ఫేస్లిఫ్ట్ వెర్షన్ జిర్కోనియా అలాయ్ వీల్స్ తో అందమైన రూపాన్ని ఇస్తుంది. అయితే, ఇది అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే అందించబడుతుంది. ఈ వాహనంలో హ్యాండిల్స్ అలానే మిర్రర్స్ శరీరం రంగులో అందించబడతాయి. అలానే ఓఆర్విఎంఎస్ అధనపు సౌకర్యం కోసం సైడ్ టర్న్ ఇండికేటర్స్ ని కలిగి ఉంటాయి. దీని ముందరి భాగంలో ఉన్న రేడియేటర్ గ్రిల్ క్రోమ్ తో అలంకరించబడి మూడు స్లాట్లను కలిగి ఉంటుంది మరియు ఇది నలుపు రంగుతో ఫినిషింగ్ చేయబడిన హెడ్లైట్ క్లస్టర్ ని ఇరువైపులా కలిగి ఉంటుంది. దీనిలో శరీరం రంగు బంపర్ క్రోమ్ స్ట్రిప్ తో విస్తృత ఎయిర్డ్యాం ని కలిగి ఉంటాయి. అలానే, ఫాగ్ ల్యాంప్స్ స్టాటిక్ మలుపు లైట్లు తో వస్తాయి. కారు వెనుక భాగంలో, 3డి ప్రభావం తో కొత్త టెయిల్ ల్యాంప్స్ ని కలిగి ఉంటాయి. అలానే దీని బూట్ లిడ్ కంపెనీ యొక్క బాడ్జ్ తో చిత్రించబడి ఉంటుంది. వీటితోపాటు, ట్రంక్ మూత పైన అలానే ఎగ్జాస్ట్ పైప్ క్రోమ్ చేరికలు అద్భుతమైన లుక్ ని ఇస్తాయి.

వెలుపలి కొలతలు:


ఈ సెడాన్ యొక్క మొత్తం పొడవు 4390 మిల్లీ మీటర్లు, వెడల్పు 1699 మిల్లీ మీటర్లు, ఎత్తు 1467 మిల్లీ మీటర్లు, వీల్బేస్ 2553 మిల్లీ మీటర్లు కనీస గ్రౌండ్ క్లియరెన్స్ 163 మిల్లీ మీటర్లు వంటి పరిమాణాలను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క ముందరి ట్రాక్ యొక్క వైశాల్యం 1457 మిల్లీ మీటర్లు అదే వెనుక ట్రాక్ విషయానికి వస్తే 1500 మిల్లీ మీటర్లు వైశాల్యాన్ని కలిగి ఉంటుంది.

లోపలి డిజైన్:


కొత్తగా పరిచయం చేయబడిన హైలైన్ ప్లస్ ట్రిం ఇప్పటికే ఉన్న వెర్షన్లకు దగ్గరగా ఉన్నాయి.. కానీ, సెంట్రల్ కన్సోల్ పైన ఉన్న కార్బన్ ఫైబర్ తో ఫినిషింగ్ చేయబడిన సమాచార వ్యవస్థ క్యాబిన్ కి ఒక అద్భుతమైన అందాన్ని ఇస్తుంది. ఇవి కాకుండా, మోడల్ యొక్క అక్షరాలతో ఉన్న ఫ్లోర్ మ్యాట్స్ దీని యొక్క ప్రత్యేకతను మరింతగా తెలుపుతాయి. అదనంగా, స్కఫ్ ప్లేట్స్ ప్లేట్లు మరియు విడదీసే విండో బ్లైండ్స్ కూడా అందించబడతాయి. ఈ సెడాన్ ఇప్పటికే ఆకర్షణీయమైన అంతర్భాగాలతో ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. డ్యూయల్ టోన్ రంగు పథకం క్రోం చేరికలతో మరియు అధిక నాణ్యత స్క్రాచ్ నిరోధక ప్లాస్టిక్ మెటీరియల్ తో క్లాసీనెస్ ని పెంచుతుంది. ట్రెండ్ లైన్ మరియు మధ్య శ్రేణి వేరియంట్స్ లో సీట్లు బ్లాక్ ఇంటీరియర్ థీమ్ తో 'క్లౌడ్ టైటాన్ స్క్వార్జ్' ఫాబ్రిక్ కవర్ తో కప్పబడి ఉంటాయి. అదే ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ ల విషయానికి వస్తే, లెధర్ అపోలిస్ట్రీ తో పాటు 'వాల్నట్ డిసర్ట్ లేత గోధుమరంగు' కలిగిన రెండు రంగుల పధకంతో అందించబడుతుంది. ఈ వాహనాల యొక్క ముందరి భాగం మృదువైన డాష్బోర్డ్ కలిగి సొగసైనది గా కనిపిస్తోంది. అంతేకాకుండా, ఈ డాష్బోర్డ్ క్రింది బాగం లో స్టీరింగ్ వీల్ దానిపై అనేక నియంత్రణ స్విచ్చులతో అందజేయబడుతుంది. అంతేకకౌండా ఇది ఒక బహుళ ఫంక్షన్ కన్సోల్ తో బిగించి వస్తుంది. గ్లవ్ బాక్స్ ప్రభావం శీతలీకరణగా ఉంది. అంతేకాకుండా, సన్ గ్లాస్ హోల్డర్ మరింత సౌలభ్యాన్ని జతచేస్తుంది. ఈ వాహనం యొక్క గేర్ షిఫ్ట్ మరియు స్టీరింగ్ వీల్ రెండూ కూడా లెధర్ తో కప్పబడి ఉంటాయి. అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒక టాకొమీటర్, ఓడోమీటార్ మరియు ఒక ట్రిప్మీటర్ ను కలిగి ఉంటుంది. క్యాబిన్ లో ఉండే ఇతర అంశాల విషయానికి వస్తే, ఈ వాహన క్యాబిన్ కప్ హోల్డర్లు, 12 వి పవర్ సాకెట్, ఫూట్ వెల్ లైట్లు, ముందు మరియు వెనుక సెంటర్ ఆర్మ్ రెస్ట్ లు, డెడ్ పెడల్, ట్రంక్ ఇల్ల్యుమినేషన్ మరియు త్రీ గ్రబ్ హ్యాండిల్స్ వంటి అంశాలను కూడా కలిగి ఉంది.

లోపలి సౌకర్యాలు:


ఈ సెడాన్ లో కేవలం శైలి, డిజైన్ మరియు పనితీరు మరియు సౌకర్యం ఫాక్టర్ లను కలిగి ఉండటమే కాకుండా ఇది మార్కెట్ లో ఇతర కాత్ల మధ్య నిలబడి తన యొక్క సత్తా ను చాటుకుంది. డ్రైవర్ సౌలభ్యం కొరకు ఒక బహుళ ఫంక్షన్ ప్రదర్శన ను కలిగి ఉంటుంది. ఈ ప్రదర్శన లో ప్రయాణ సమయం, సగటు వేగం, బయట ఉష్ణోగ్రత, మరియు కొన్ని ఇతర నవీకరణలు ఇమిడి ఉంటాయి. ఈ విభాగం లో గరిష్ట సీటు సర్దుబాటు నియంత్రణ ఫంక్షన్ ను కలిగి ఉన్న మొదటి వాహనం ఇదే. ఈ ఫీచర్ వెనుక ప్రయాణికులు వెనుక నుండి సహ డ్రైవర్ సీట్ సర్దుబాటు చేసేందుకు అనుమతిస్తుంది. ఈ వాహనం యొక్క ముందు మరియు వెనుక విండోలు పవర్ తో నిర్వహణ జరుగుతుంది. అయితే, వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ ల విషయానికి వస్తే, ఈ మిర్రర్ లు విధ్యుత్ తో సర్దుబాటు అవుతాయి అదే విధంగా మడత వేయగల ఫంక్షన్ ను కూడా కలిగి ఉంటుంది. వీటితో పాటు, ఎత్తు సర్దుబాటు కలిగిన డ్రైవర్ సీట్, ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్, లేన్ మార్పు సూచిక, అలాగే సన్ వైసర్ తో పాటు ఎడమ వైపు వానిటీ మిర్రర్ మరియు కుడి వైపు టికెట్ హోల్డర్ వంటి ఫంక్షన్ లను కలిగి ఉంది. మరొక ఉపయోగకరమైన అంశం ఏమిటంటే దుమ్ము మరియు పోలెన్ ఫిల్టర్స్ తో పాటు నైపుణ్యం కలిగిన క్లిమేట్రోనిక్ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్ యూనిట్ ను కలిగి ఉంటుంది. వీటితో పాటు, ఈ వాహనం వెనుక వైపు డ్యూయల్ ఏసి వెంట్లు బిగించబడి ఉంటాయి. ఇవి ఉండటం వలన డ్రైవింగ్ సమయంలో సౌకర్యవంతంగా మరియు ఆహ్లాదకరంగా ఉండేలా సహాయపడతాయి. అంతేకాక, ఈ వాహనం అన్ని డోర్ల కు నిల్వ కంపార్ట్మెంట్ లు, వెనుక కోటు హుక్స్, 3- వే ట్రంక్ అన్లాకింగ్, ముందు మరియు వెనుక సెంటర్ ఆర్మ్ రెస్ట్ లు మరియు క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్ వంటి కొన్ని ఇతర అంశాలు సౌలభ్యం స్థాయిని మరింత పెంచడానికి సహాయపడతాయి.

లోపలి కొలతలు:


ఈ ఐదు సీట్లు ను కలిగిన వాహనం దాని మంచి బాహ్య కొలతలు కారణంగా క్యాబిన్ లోపల తగినంత లెగ్ మరియు హెడ్ స్పేస్ ను కలిగి ఉంటుంది. పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో ఇంధన సామర్ధ్యం కోసం 55 లీటర్లు కలిగి ఇంధన ట్యాంక్ బిగించబడి ఉంది. అంతేకాక, ఈ వాహనం యొక్క బూట్ సామర్ధ్యం 494 లీటర్లు, అంతేకాకుండా లోపల చాలా లగేజ్ ను పెట్టడం లో సహాయపడుతుంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ కొత్త వెర్షన్, కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవడానికి ఒక డీజిల్ మరియు రెండు పెట్రోల్ ఇంజన్ లతో అందుబాటులో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వాహన సిరీస్ యొక్క అన్ని వేరియంట్లు కూడా ఒకే విధంగా 103.5 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తాయి. ఈ వాహన సిరీస్ యొక్క 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ 1598 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా, నాలుగు సిలెండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ సహజంగా నెట్టబడిన బహుళ పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ వ్యవస్థ తో విలీనం చేయబడి ఉంటుంది. దీని వలన ఈ ఇంజన్ అత్యధికంగా 3800 ఆర్ పి ఎం వద్ద 153 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహన సిరీస్ మరోక పెట్రోల్ ఇంజన్ ను కూడా కలిగి ఉంటాయి. అది ఏమిటంటే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ ఎస్ ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 1197 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 7- స్పీడ్ డి ఎస్ జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. మరోవైపు ఈ సిరీస్ యొక్క మరోక ఇంజన్ ఏఅమిటంటే, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఒక టర్బోచార్జర్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజన్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 1500 నుండి 2500 ఆర్ పి ఎం మధ్య లో 250 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విదుదల చేస్తుంది. ఈ ఇంజన్, 1498 సిసి స్థనభ్రంశాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 5- స్పీడ్ మాన్యువల్ మరియు 7- స్పీడ్ డి ఎస్ జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ మోడల్ సిరీస్ యొక్క మధ శ్రేణి అలానే అగ్ర శ్రేణి వేరియంట్లు సిడి మరియు ఎంపి3 ప్లేయర్ ని కలిగియున్నటువంటి సమాచార వ్యవస్థతో అందించబడుతున్నాయి. ఈ యూనిట్ యుఎస్బి పోర్ట్, ఆక్సిలరీ ఇంపుట్ మరియు ఎస్డి కార్డ్ స్లాట్ తో కూడా వస్తుంది. అధనంగా, అగ్ర శ్రేణి వేరియంట్ కాల్స్ మరియు ఆడియో స్ట్రీమింగ్ కొరకు బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. ఈ యూనిట్ నియంత్రణ స్విచ్లు స్టీరింగ్ వీల్ పైన అమర్చబడి ఉంటాయి. అయితే, బేస్ స్థాయి ట్రెండ్ లైన్ ట్రిం రూఫ్ పై అమర్చబడియున్న యాంటెన్నా మరియు పాక్షిక ప్రీ - వైరింగ్ తో రేడియో సౌకర్యాన్ని కలిగి ఉంది. కొత్త హైలైన్ ప్లస్ వేరియంట్ కి వస్తే, బ్లా పంక్ట్ మల్టీమీడియా వ్యవస్థని కలిగి ఉంది. ఈ బహుముఖ మీడియా వ్యవస్థ 800x400 పిక్సల్స్ కలిగిన పెద్ద 7 అంగుళాల డిజిటల్ టిఎఫ్టి డిస్ప్లే తో అందించబడుతుంది. .. అదనంగా, ఒక డివిడి ప్లేయర్ వంటి పరికరాలు మరియు అంతర్నిర్మిత బ్లూటూత్, హ్యాండ్స్ ఫ్రీ ఆపరేషన్ కోసం అందించబడుతున్నాయి. అంతేకాకుండా, యుఎస్బి , ఎస్డి కార్డ్ స్లాట్, ఆవ్ ఇన్పుట్ మరియు యుఎస్బి పోర్ట్ ద్వారా ఛార్జింగ్ సౌకర్యం వంటి కనెక్టివిటీ ఎంపికలు అందించబడుతున్నాయి.

వీల్స్ పరిమాణం:


ఈ సిరీస్ యొక్క దిగువ శ్రేణి వాహనాలలో 14- అంగుళాల స్టీల్ వీల్స్ బిగించబడి ఉంటాయి. ఈ రిమ్స్ పూర్తి వీల్ క్యాప్స్ ను కలిగి 175/70 R14 పరిమాణం గల ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి. కంఫోర్ట్ లైన్ వేరియంట్ యొక్క వీల్ ఆర్చులు 15- అంగుళాల స్టీల్ వీల్స్ తో కప్పబడి ఉంటాయి. అదే అగ్ర శ్రేణి వేరియంట్ ల విషయానికి వస్తే, అదే పరిమాణం గల జిర్కోనియా అల్లాయ్ వీల్స్ బిగించి ఉంటాయి. అంతేకాకుండా ఈ వాహనాల వీల్ ఆర్చులు 185/60 R15 పరిమాణం గల ట్యూబ్ లెస్ రేడియల్ టైర్ల తో కప్పబడి ఉంటాయి. అంతేకాక సంస్థ ఒక విడి చక్రం తో పాటు ఒక ఫ్లాట్ టైర్ సులభంగా మార్చడానికి అవసరమైన అనేక ఉపకరణాలను కూడా బూట్ విభాగం లో అందించడం జరిగింది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ స్టైలిష్ సెడాన్ సిరీస్ లో టిల్ట్ మరియు టెలీస్కోపిక్ సర్దుబాటు తో పాటు స్పీడ్ సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ పవర్ సహాయక స్టీరింగ్ వ్యవస్థ ను అందజేయడం జరిగింది. ఇది వేగం తనిఖీ మరియు తదనుగుణంగా స్టీరింగ్ సహాయక ద్వారా మరింత సులభంగా మరియు సౌకర్యవంతమైన డ్రైవింగ్ ను నిర్ధారిస్తుంది. నైపుణ్యం కలిగిన సస్పెన్షన్ వ్యవస్థ, మరోవైపు, సంబంధం లేకుండా ఎటువంటి రోడ్డు పరిస్థితులలోనైనా డ్రైవ్ ద్వారా స్థిరత్వాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. ఈ వాహనాల యొక్క ముందు ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ తో జత చేయబడి ఉంటుంది. అదే విధంగా వెనుక ఆక్సిల్ సెమీ ఇండిపెండెంట్ ట్రైలింగ్ ఆర్మ్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాహనాల యొక్క బ్రేకింగ్ మెకానిజం కూడా నమ్మదగినది. ఈ వాహనాల ముందు బ్రేక్ లు వెంటిలేషన్ డిస్క్ బ్రేక్ల సమితి తో బిగించబడి ఉంటాయి. అదే విధంగా వెనుక బ్రేక్ లు డ్రం బ్రేక్ ల సమితి తో బిగించబడి ఉంటాయి. అంతేకాకుండా రోడ్ పై మంచి పటుత్వాన్ని ఇవ్వడం కోసం ఈ వాహన సిరీస్ యొక్క మధ్య మరియు హై లైన్ వేరియంట్ లలో ఏబిఎస్ వ్యవస్థ అందజేయబడుతుంది.

భద్రత మరియు రక్షణ:


భద్రత ముందు, ఈ ఫేస్లిఫ్ట్ వెర్షన్ దాని ప్రయాణికులకు మెరుగైన రక్షణను మరియు హామీ ను అందించే అనేక లక్షణాలను కలిగి ఉంది. అంతేకాకుండా ముందు మరియు వెనుక ప్రయాణికుల కోసం 3- పాయింట్ సీట్ బెల్ట్ లను అందించడం జరిగింది మరియు వెనుక మద్య ప్రయాణీకుడి కోసం ల్యాప్ బెల్ట్ ను అందించడం జరిగింది. అంతేకాకుండా, తయారీదారుడు ముందు వరుస బెల్ట్ లు ఎత్తు సర్దుబాటు సౌకర్యాన్ని కూడా కలిగి ఉండేలా రూపొందించాడు. విండోస్ పవర్ తో సర్దుబాటయ్యేవి మాత్రమే కాదు, కంఫోర్ట్ లైన్ వేరియంట్ లలో మరియు అగ్ర శ్రేణి వేరియంట్ లు కూడా యాంటీ పించ్ గార్డ్ ఫంక్షన్ ను కలిగి ఉంటాయి. దొంగతనం నుండి వాహనాన్ని పరిరక్షించడం లో సహాయపడటానికి ఈ సిరీస్ యొక్క వాహనాలు ఇంజన్ ఇమ్మోబిలైజర్ ను కలిగి ఉంటాయి. వీటితో పాటు ముందు రెండు ఎయిర్బాగ్ లు, డ్రైవర్ అప్రమత్తం ఉన్న సమయం లో వెనుక నుండి వినిపించే సిగ్నల్స్ ద్వారా అడ్డంకులు గురించి తెలిపే వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి బద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయి. అంతేకాక, ఈ సిరీస్ యొక్క అన్ని వాహనాలు ముందు మరియు వెనుక ఎత్తు సర్దుబాటు హెడ్ రెస్ట్ లు, హై మౌంట్ స్టాప్ ల్యాంప్, డే అండ్ నైట్ ఇంటీరియర్ రేర్ వ్యూ మిర్రర్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్, రేర్ డిఫోగ్గర్ మరియు సెంట్రల్ లాకింగ్ సిస్టం వంటి అనేక అంశాలను కలిగి ఉన్నాయి. వీటితోపాటు, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ తో పాటు స్టాటిక్ కార్నరింగ్ లైట్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ప్రోగ్రామ్ మరియు హిల్ హోల్డ్ కంటోల్ వంటి లక్షణాలు మధ్య మరియు హై లైన్ వేరియంట్ లలో మాత్రమే చూడవచ్చు.

అనుకూలాలు:1. పెరిగిన ఇంధన సామర్ధ్యం అనేది దాని యొక్క ప్రధాన ప్రయోజనాలలో ఒకటి.
2. బాహ్య భాగాల తో పాటు అనేక ఆకట్టుకునే అంశాలను కలిగి ఉండటమనేది దీని ప్రతికూలత గా భావించవచ్చు.
3. ఈ వాహనాలు ప్రదర్శన ఆధారిత ఇంజిన్లను కలిగి ఉన్నాయి.
4. ఈ వాహనాలు గరిష్ఠ భద్రతా హామీ ను కలిగి ఉంటాయి.
5. తగినంత క్యాబిన్ స్పేస్ ను కలిగి ఉండటం తో పాటు పుష్కల లెగ్ రూం ను కూడా కలిగి ఉంటాయి.

ప్రతికూలాలు:1. ఈ వాహనాల యొక్క త్వరణం మరియు పికప్ మరింత అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది .
2. ఈ వాహనాల గ్రౌండ్ క్లియరెన్స్ స్వల్పంగా మార్పు చేయవలసిన అవసరం ఉంది.
3. ఈ వాహనాల యొక్క వెనుక హెడ్ స్పేస్ పెంచవలసిన అవసరం ఉంది.
4. ఈ వాహనం లో మరిన్ని ప్రయోజన లక్షణాలను పొందుపరచవలసిన అవసరం ఉంది.
5. ఈ వాహన సిరీస్ యొక్క కంఫోర్ట్ లైన్ వేరియంట్ లలో లెధర్ అపోలిస్ట్రీ లేకపోవడం ఒక ప్రతికూలత.