టయోటా ప్రియస్

` 39.5 - 44.0 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

టయోటా ఇతర కారు మోడల్లు

 
*Rs

టయోటా ప్రియస్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


ఈ కంపెనీ, హచ్బాక్ ల నుండి యుటిలిటీ వాహనాల వరకు ఇండియన్ కార్ల మార్కెట్లో చాలా అద్భుతమైన వాహనాలను ఉత్పత్తి చేసింది. దాని మోడళ్లలో ఆధునిక హైబ్రిడ్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేసిన వాటిలో ఒకటే ఈ టయోటా ప్రియస్. ఇది పెట్రోల్ మరియు ఒక విద్యుత్ మోటార్ తో రెండు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంది. దీని పెట్రోల్ వేరియంట్ 1798ccస్థానభ్రంశం ను అందించే డబుల్ ఓవర్ హెడ్ కామ్షాఫ్ట్ ఆధారిత పెట్రోల్ ఇంజన్ తో అందించబడుతుంది. ఇది 5200rpm వద్ద 97.8 bhp పీక్ పవర్ ను అందించగల సామర్ధ్యంను కలిగి ఉంటుంది. అదే సమయంలో, అది 4000rpmవద్ద 142Nmగరిష్ట టార్క్ అవుట్పుట్ ను అందిస్తుంది. ఈ వాహనం గరిష్టంగా 650 వోల్ట్స్ బ్యాటరీ వోల్టేజ్ సౌలభ్యం కలిగిన ఒక విద్యుత్ మోటారుతో వస్తుంది. ఇది గరిష్టంగా 60 కిలో వాట్స్ పవర్ ఔట్ పుట్ ను మరియు 207 Nm టార్క్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇది తక్కువ బరువు కలిగిన నికెల్-ఎం హెచ్ (నికెల్-మెటల్ హైబ్రిడ్) బ్యాటరీ తో సీల్ చేయబడి వస్తుంది. ఇది తగినంత ఎలక్ట్రిసిటీ ని మోటారు కి అందిస్తుంది. ఇంకా, దాని పనితీరును మెరుగుపరచడంతో పాటు ఒక మంచి ఇంధన వ్యవస్థను అందించడంలో హైబ్రిడ్ సినర్జీ డ్రైవ్ టెక్నాలజీ చాలా సహాయకంగా ఉంటుంది. ఇది పవర్, ఎకో మరియు ఎలక్ట్రిక్ మోడ్ మూడు డ్రైవింగ్ రీతులతో అందుబాటులో ఉంది. మరోవైపు, ఈ సెడాన్ ఒక నైపుణ్యమైన సస్పెన్షన్ వ్యవస్థతో ఇమిడి ఉంటుంది. ఇది రోడ్ల పై మంచి పనితీరును కనబరుస్తుంది. ఇంకా, బ్రేకింగ్ యంత్రాంగం కూడా చాలా నమ్మదగినదిగా ఉంది. ఈ సంస్థ, దాని ప్రయాణికులు ప్రయాణంలో ఉన్నప్పుడు వారిని సురక్షితంగా ఉంచడానికి కొన్ని ముఖ్యమైన అంశాలను లోడ్ చేసింది. ఈ వాహనతయారి దారుడు దీనిని క్రాష్ భద్రత కలిగిన దృఢమైన బాడీ నిర్మాణంతో నిర్మించాడు. ఇది ముందు మరియు వెనుక భాగాలలో క్రంపుల్ జోన్స్ ను కలిగి ఉంటుంది. దీని ముందు సీట్లు సంఘటిత క్రియాశీల హెడ్ రెస్టులను కలిగి ఉంటాయి. ఇది ముఖ్యంగా వీపుకి మరియు మెడ మీద ఎలాంటి ప్రభావం పడకుండా ఇంకా వెనక భాగంలో ఏవైనా ప్రమాదాలు జరిగినపుడు ప్రయాణికులను సంరక్షిస్తాయి. వీటితోపాటు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, ప్రయాణికులందరికి సీట్ బెల్టులు మరియు వాహనం యొక్క స్థిరత్వ నియంత్రణ మరియు కొన్ని ఇతర అంశాలు దీనిలో ఉన్నాయి. అంతర భాగాల పరంగా, ఇది ఒక విశాలమైన కాబిన్ ను కలిగి ఉంది మరియు సొంపుగా అలంకరించబడి అధునాతన లక్షణాలతో నిండిపోయింది. ఇది హెడ్ రెస్ట్ లతో అనుసంధానించబడ్డ కుషన్ సీట్లను కలిగి ఉంది. దీని కాక్పిట్ తగిన విధంగా కొన్ని అధునాతన పరికరాలతో బాగా రూపకల్పన చేసిన డాష్బోర్డ్ పైన అమర్చబడి ఉంది. ఇది అనేక ప్రకటనలను ప్రదర్శించే ఒక అందమైన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను మరియు సెంటర్ కన్సోల్ ను కలిగి ఉంది. దీనిలో అనేక స్టోరేజ్ స్పేస్ లు ఉన్నాయి. వీటితోపాటు, ఒక ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ ను కలిగి ఉంది. ఇది క్యాబిన్ ను ఎళ్లవేళలా చల్లగా ఉంచుతుంది.అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ కి మద్దతిచ్చే మ్యూజిక్ సిస్టమ్ దీనిలో పొందుపరచబడింది. ఇది ఒక సెంటర్ మీటర్ డిస్ప్లే ని కలిగి ఉండి స్టీరింగ్ వీల్ పైన ఉన్న అన్ని స్విచ్చులను చూపిస్తుంది. . స్మార్ట్ ఎంట్రీ ప్రారంభ వ్యవస్థ, కప్ హోల్డర్లు, హెడ్ అప్ ప్రదర్శన, మరియు మరింత సౌలభ్య స్థాయిని పెంచడానికి ఇంకా కొన్ని ఇతర లక్షణాలను దీనిలో పొందుపరిచారు. సంస్థ ఈ సెడాన్ ను ఒక అద్భుతమైన రూపకల్పనతో మరియు అనేక గొప్ప లక్షణాలతో కలిపి రూపొందించింది. ఇది ఒక తేజస్సుగల హెడ్ లైట్ క్లస్టర్ తో ప్రొజెక్టర్ టైప్ హెడ్ల్యాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్లను కలిగి ఉంది. ఇందులో ఒక బోల్డ్ రేడియేటర్ గ్రిల్ మరియు సెంటర్ లో సంస్థ యొక్క ప్రముఖ లోగో విలీనమై ఉంటాయి. ఇవి ఒక నాగరికమైన అల్లాయ్ వీల్స్ సెట్ తో అమర్చబడి ఉంటాయి. దీని యొక్క సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే, డోర్ హ్యాండిల్స్ మరియు అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ తో బిగించబడి ఉంటాయి. ఈ మిర్రర్స్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ తో జత చేయబడి ఉంటాయి. దీని వెనక భాగంలో ఒక హై మౌంట్ స్టాప్ ల్యాంప్, విశాలమైన విండ్స్క్రీన్ మరియు ప్రకాశవంతమైన ఎల్ ఈ డి టెయిల్ ల్యాంప్స్, రూఫ్ మౌంటెడ్ యాంటెన్నా మరియు బాడీ కలర్ బంపర్ వంటి కొన్ని ప్రధానమైన అంశాలను పొందుపరిచారు. వీటితోపాటు ఈ వాహన యజమానులు దాని యొక్క శైలిని అలాగే సౌకర్యంను మెరుగుపరుచుకోవడానికి కొన్ని ఇతర ఉపకరణాలను వారికి తగిన విధంగా అనుకూలీకరించుకోవచ్చు. సంస్థ దీనిని మూడు సంవత్సరాలు లేదా 100000 కిలోమీటర్ల ( ఏది ముందు వస్తే అది) వారంటీతో అందిస్తుంది. వినియోగదారులు ఈ వారంటీ కాలాన్ని అధికార డీలర్ల వద్ద అదనపు ధరతో పొడిగించుకోవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఇది 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో అందించబడుతుంది మరియు ఇది ఒక ఎలక్ట్రానిక్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థతో సంఘటితం చేయబడి ఉంటుంది. ఇది రహదారులలో 23kmpl మైలేజ్ ను మరియు నగరాలలో దాదాపు 20 kmpl మైలేజ్ ను అందిస్తుంది.

శక్తి సామర్థ్యం:


ఈ అద్భుతమైన హైబ్రిడ్ కారు 1798cc స్థానభ్రంను అందించే డబుల్ ఓవర్ హెడ్ కామ్షాఫ్ట్ ఆధారిత పెట్రోల్ ఇంజన్ తో అందించబడుతుంది. ఇది 5200rpm వద్ద 97.8 bhp పీక్ పవర్ ను అందించగల సామర్ధ్యంను కలిగి ఉంటుంది. అదే సమయంలో, అది 4000rpmవద్ద 142Nmగరిష్ట టార్క్ అవుట్పుట్ ను అందిస్తుంది. ఇవే కాకుండా, ఇది ఒక ఎలక్ట్రానిక్ మోటార్ తో మనకి అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 60 కిలో వాట్స్ పవర్ ఔట్ పుట్ ను మరియు 207 Nm టార్క్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


పెట్రోల్, విద్యుత్ మోటార్లు రెండు కూడా హైబ్రిడ్ సినర్జీ డ్రైవ్ టెక్నాలజీ ద్వారా నిర్వహించబడతాయి. అలాగే ఇది మెరుగైన పవర్ అవుట్పుట్ ను మరియు యాక్సలరేషన్ ను అందించడంలో సహాయపడుతుంది. దీని 1798cc పవర్ ప్లాంట్ నైపుణ్యంగా ఎలక్ట్రానిక్ నియంత్రణ నిరంతరం మారే ప్రసార గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఇది చాలా సులభంగా గేర్ మార్చడానికి ఉపయోగపడుతుంది. దీని ఫలితంగా సుమారు 180 కిలోమీటర్ల టాప్ వేగాన్ని సాధించడానికి ఇది అనుమతిస్తుంది. ఈ వాహనం దాదాపు 9 నుండి 10 సెకన్ల సమయంలో 100kmph పరిధిని దాటుకుని వెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

వెలుపలి డిజైన్:


ఈ సెడాన్ యొక్క ఉత్తమ విషయాలలో దాని ఆకట్టుకునే వెలుపల రూపం కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇది ఒక ఏరోడైనమిక్ బాడీ నిర్మాణంతో ఉంది. దీనిలో కొన్ని ప్రధాన అంశాలను అందించారు. దాని సైడ్ ప్రొఫైల్ విషయానికొచ్చినట్లయితే, ఇది గ్లాసీ బ్లాక్ బి-పిల్లర్స్ తో, డోర్ హ్యాండిల్స్ మరియు అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ తో బిగించబడి ఉంటాయి. ఈ మిర్రర్స్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ తో బిగించబడి ఉంటాయి. అంతేకాక, ఇది అందంగా చెక్కబడిన వీల్ ఆర్చులతో అందించబడుతుంది. ఇవి ఒక నాగరికమైన అల్లాయ్ వీల్స్ సెట్ తో అమర్చబడి ఉంటాయి. సంస్థ దీని వెనుక భాగంను ఆకర్షణీయమైన విధంగా రూపకల్పన చేసింది. దీనిలో ఒక హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కి బిగించి ఉన్న విశాలమైన విండ్స్క్రీన్ మరియు బాగా చెక్కబడిన బంపర్ వంటి కొన్ని ప్రధానమైన అంశాలను పొందుపరిచారు. ఇది ఒక వ్యక్తీకరణ బూట్ లిడ్ ను కలిగి ఉంది. దాని మీద కంపెనీ యొక్క బాడ్జ్ విలక్షణముగా చిత్రించబడి ఉంటుంది. ఇది ఒక లైసెన్స్ ప్లేట్ మరియు ఒక అందమైన స్పాయిలర్ వంటి లక్షణాలతో అందుబాటులో ఉంది. ఈ బూట్ లిడ్ చుట్టూ అధునాతన టెయిల్ లైట్ క్లస్టర్ ఉంటుంది. ఇది ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ కి మరియు టర్న్ ఇండికేటర్స్ కి అమర్చబడి ఉంటుంది. మరోవైపు, ఇది ఒక అద్భుతమైన ఫ్రంట్ ముఖభాగాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ఒక బోల్డ్ రేడియేటర్ గ్రిల్ మరియు సెంటర్ లో సంస్థ యొక్క ప్రముఖ లోగో విలీనమై ఉంటాయి. ఇది ఒక తేజస్సుగల హెడ్ లైట్ క్లస్టర్ తో ప్రొజెక్టర్ టైపు హెడ్ల్యాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్లను కలిగి ఉంది. దీనిలో ఒక సొగసైన బోనెట్ ఉంది. అయితే పెద్ద విండ్స్క్రీన్ ఒక జంట వైపర్స్ తో సంఘటితం చేయబడి ఉంటుంది. వీటితోపాటు, దీని బంపర్ బాడీ కలరు పెయింట్ తో ఉంటుంది మరియు ఇది ఎయిర్ ఇంటేక్ విభాగంతో బిగించబడి ఉంటుంది. ఇది ఇంజిన్ ను త్వరగా చల్లబరచడంలో ఉపయోగపడుతుంది. అంతేకాక, ఇవి ఒక జత రౌండ్ ఆకారంలో ఉండే ఫాగ్ ల్యాంప్స్ ను కలిగి వస్తుంది. ఇది వాహనానికి ఒక పూర్తి రూపాన్ని ఇస్తుంది.

వెలుపలి కొలతలు:


సంస్థ ఈ వాహనాన్ని 4480mm పొడవుతో చాలా అద్భుతంగా నిర్మించింది. ఇది 1525mm ఎత్తుతో పాటుగా మొత్తం 1745mm వెడల్పును కలిగి ఉంది. ఇది 2700mm పొడవైన వీల్ బేస్ తో చాలా ఎక్కువ అంతర్గత స్పేస్ తో అందించబడుతుంది. దాని ముందు మరియు వెనుక ట్రెడ్స్ వరుసగా 1525mm మరియు 1520mm కొలతలతో అందించబడుతున్నాయి. ఈ వాహనం యొక్క కెర్బ్ బరువు 1385 కిలోలు మరియు గ్రాస్ బరువు 1415 కిలోలు ఉంటుంది. వీటితోపాటు, దాని గ్రౌండ్ క్లియరెన్స్ దాదాపు 135mm ఉంటుంది మరియు ఇది 5.2 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్థానికి మద్దతునిస్తుంది.

లోపలి డిజైన్:


ఇది సులభంగా ఎవరినయినా ఆకర్షించే విధంగా చక్కటి లోపలి భాగాలతో అందించబడి ఉంది. దీని క్యాబిన్ అందంగా మరియు విశాలంగా కొన్ని వినూత్న ఫీచర్లతో నిండిపోయింది. ఒక ఆకర్షణీయమైన డ్యుయల్ టోన్ రంగు స్కీమ్ ను క్యాబిన్ అలంకరణ కోసం ఉపయోగిస్తారు. వీటిలో కొన్ని అంశాలపై ఇచ్చిన క్రోమ్ ఇన్సర్ట్స్ ఒక క్లాస్సి అప్పీల్ ను అందిస్తాయి. దీని కాక్పిట్ తగిన విధంగా కొన్ని అధునాతన పరికరాలతో బాగా రూపకల్పన చేసిన డాష్బోర్డ్ పైన అమర్చబడి ఉంది. అలానే ఇది ఒక అందమైన సెంటర్ కన్సోల్ ను కలిగి ఉంది. దీనిలో ఒక మ్యూజిక్ సిస్టమ్ అమర్చబడి ఉంటుంది. అలాగే, స్టీరింగ్ వీల్ పైన కంపెనీ యొక్క చిహ్నం చెక్కబడి ఉంటుంది. అధిక వాల్యూమ్ గ్లోవ్ బాక్స్ అనేక చిన్న పరికరాలను పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మరింత సౌలభ్యం కోసం దీనిలో ఎయిర్ వెంట్లను కూడా అమర్చారు. ఇది అనేక విధులు మరియు ప్రకటనలను ప్రదర్శించే ఒక అందమైన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంది మరియు దీనిలో అనేక స్టోరేజ్ స్పేస్ లు ఉన్నాయి. . ముందు మరియు వెనుక కప్ హోల్డర్లు, డెటాచెడ్ అప్పర్ ట్రే తో స్రంటర్ కన్సోల్ బాక్స్ , సెంటర్ కన్సోల్ క్రింద నిల్వ స్పేస్ , డోర్ ట్రిమ్స్ పైన పాకెట్స్ వంటి నిల్వ స్థలాలను కలిగి ఉంది. ఈ వాహనం దాని యజమానులకు ఒక మెరుగైన సౌకర్యాన్ని ఇచ్చే విధంగా చక్కగా ఉన్న కుషన్ సీట్లతో అమర్చబడి ఉంది. జెడ్ 5 ట్రిమ్ లో ఈ సీట్లు ఫాబ్రిక్ అపాలస్ట్రీ తో కప్పబడి ఉంటాయి. ఇతర వేరింట్లు మంచి లెదర్ కవర్ తో కప్పబడి ఉంటాయి. దీనిలో ముందు సీట్లు ఆనుకుని ఉంటాయి. అయితే, వెనక సీట్లు 60:40 స్ప్లిట్ ఫొల్డబుల్ సౌకర్యంతో వస్తున్నాయి.

లోపలి సౌకర్యాలు:


ఈ మోడల్ సిరీస్ లో ఉండే విశాలమైన క్యాబిన్ ఒక ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. ఇది దాని ప్రయాణికులకు ఒక సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తుంది. అదనంగా, ఇది కొన్ని స్టోరేజ్ స్పేస్ లను కూడా అందించింది. ఇది ఒక ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్ యూనిట్ తో అందజేయబడి ఉంది. ఇది ఎల్లప్పుడూ క్యాబిన్ ను చల్లబరుస్తుంది. ఈ సిస్టమ్ పోలెన్ రిమూవబుల్ మోడ్ ను మరియు క్లీన్ ఎయిర్ ఫిల్టర్ ను కలిగి ఉంది. భద్రతను పెంచడం కోసం బ్యాక్ మానిటర్ అంశం ను దీనిలో పొందుపరిచారు. ఇది రివర్స్ పార్కింగ్ కి ఉపయోగపడుతుంది. ఇది ఒక ఆధునిక సంగీత వ్యవస్థతో డాష్బోర్డ్ పైన అమర్చబడి వస్తుంది. ఇది సిడి ప్లేయర్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతునిస్తుంది. అంతేకాక, ఇది అద్భుతమైన సౌండ్ అవుట్పుట్ ను అందించే ఒక ఎనిమిది స్పీకర్ల సౌండ్ సిస్టమ్ తో ఉంది. ఈ సెడాన్ లో సరిగ్గా డ్రైవర్ ముందు లోయర్ విండ్ స్క్రీన్ లో డ్రైవర్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇది హైబ్రిడ్ వ్యవస్థ సూచికతో పాటు వాహనం యొక్క వేగంను కూడా ప్రదర్శిస్తుంది. మాన్యువల్ సెట్టింగ్ తో పాటు ఆటోమేటిక్ ప్రదర్శనఇల్లుమినిటీ ఫంక్షన్ ను కూడా కలిగి ఉంది. ప్రదర్శించబడిన సమాచారంను మరింత ప్రత్యక్షతను కలిపి చూపించడంలో ఇది సహాయపడుతుంది. మరోవైపు, అది సౌకర్యంను అలాగే మంచి మద్దతును అందించే ముందు వైపు ఆనుకుని ఉండే సీట్లను కలిగి ఉంది. రేర్ సీట్లను మడవడం ద్వారా క్యాబిన్ లో అదనపు సామానును నిల్వ చేసుకోవడానికి ఎక్కువ స్థలాన్ని అనుమతిస్తుంది. ఈ అధ్యయనాలే కాక అది ఒక విశాలమైన గ్లోవ్ బాక్స్ కంపార్ట్మెంట్, అస్సిస్ట్ గ్రిప్స్, స్మార్ట్ ఎంట్రీ సహాయం మరియు వ్యవస్థ ప్రారంభం, లోపల వైపు రేర్ వ్యూ మిర్రర్స్ మరియు వెనుక సీట్ల మీద జీను టైపు హెడ్ రెస్టులు మరియు ఇంకా కొన్ని ఇతర అంశాలను కలిగి ఉంది. ఇవి సౌలభ్య స్థాయిని పెంచుతాయి.

లోపలి కొలతలు:


దాని అంతర్గత క్యాబిన్ చాలా విశాలంగా సులభంగా ఐదుగురు ప్రయాణికులకు వసతి కల్పించే విధంగా ఉంది. ఇది పుష్కలంగా ముందు మరియు లెగ్ స్పేస్ ను అందిస్తుంది. వీటితో పాటుగా తగినంత మోకాలు స్పేస్ ను కూడా అందిస్తుంది. ఇంకా షోల్డర్ అలాగే హెడ్ స్పేస్ కూడా తగినంతగా ఉంది. ఇది ఒక విశాలమైన బూట్ కంపార్ట్మెంట్ తో వస్తుంది. దీనిలో అనేక వస్తువులను నిల్వ చేసుకోవచ్చు. దీని లోపలి భాగంలో వెనక సీటును మడవడం ద్వారా కూడా అదనపు లగేజ్ స్పేస్ ను పెంచవచ్చు. వీటితోపాటుగా, ఇది 45 లీటర్ల పెట్రోల్ సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ ను కలిగి ఉంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ వాహనతయారి దారుడు ఈ హైబ్రిడ్ కారు లో పెట్రోల్ ఇంజిన్ మరియు ఒక విద్యుత్ మోటార్ తో విలీనం చేసాడు. ఈ పవర్ ప్లాంట్ 1.8 ఇంజిన్ తో, 798cc స్థానభ్రంశ సామర్థ్యంతో వస్తుంది. ఇది నాలుగు సిలిండర్లు, 16 వాల్వులతో, డబుల్ ఓవర్ హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పని చేస్తుంది. ఈ వివిటి-ఐ ఆధారిత మిల్లు ఒక ఎలక్ట్రానిక్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది మరియు ఇది ఒక ఎలక్ట్రానిక్ నియంత్రణ నిరంతరం మారే ప్రసార గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఇది 142Nm టార్క్ అవుట్పుట్ తో పాటు 97.8bhp శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరోవైపు, అది కూడా గరిష్టంగా 650V వోల్టేజ్ ను ఇచ్చే పర్మినెంట్ మాగ్నెట్ టైప్ ఎలక్ట్రిక్ మోటార్ తో బిగించబడి ఉంటుంది. ఇది నికెల్-ఎం హెచ్ (నికెల్-మెటల్ హైబ్రిడ్) బ్యాటరీ తో సీల్ చేయబడి వస్తుంది. ఈ మోటార్ గరిష్టంగా 60 కిలో వాట్స్ పవర్ ఔట్ పుట్ ను మరియు 207Nmటార్క్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది. పెట్రోల్, విద్యుత్ మోటార్లు రెండు కూడా ఆకట్టుకునే టార్క్ ను మరియు యాక్సలరేషన్ గణాంకాలను అందించడంతో పాటు మంచి ఇంధన సామర్థ్యంను కూడా నిర్ధారిస్తాయి.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ మోడల్ సిరీస్ లో ఆసక్తికరమైన లక్షణాలు చాలా ఉన్నాయి మరియు వాటిలో ఒకటి ఈ ఆధునిక సంగీతం వ్యవస్థ. ఇది ఒక జెబిఎల్ ఆడియో యూనిట్ తో వస్తుంది. ఇది ఒక సిడి ప్లేయర్ మరియు ఒక రేడియో ట్యూనర్ కలిగి ఉంటుంది. ఈ యూనిట్ యుఎస్బి పోర్ట్, ఆక్స్-ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీ మద్దతు మరియు హ్యాండ్ ఫ్రీ కాలింగ్ లకు కూడా అనుమతిస్తుంది. అంతేకాక, దాని ప్రయాణీకులకు ఒక అరుదైన సౌండ్ అవుట్పుట్ ను మరియు ఆకట్టుకునే ధ్వని అనుభవంను అందించే విధంగా ఎనిమిది స్పీకర్ల సౌండ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ ఆడియో యూనిట్ ఒక టచ్ ప్యానెల్ ను కలిగి ఉంది. దీనిలో కనెక్టెడ్ ప్లేయర్స్ కోసం ఇంటర్ఫేస్ మరియు మ్యూజిక్ సమాచార డిస్ప్లే ఉన్నాయి. . వీటితోపాటు, ఈ వాహనం రూఫ్ మౌంటెడ్ యాంటెన్నాను కలిగి ఉంది. ఇది రేడియో సిగ్నల్స్ ను అందుకోవడంలో మంచిగా సహాయపడుతుంది. ఈ మ్యూజిక్ సిస్టమ్ ప్రయాణీకులకు ఉత్తమ ఇన్-కారు వినోదంను అందిస్తుంది. ఇది వారికి ఇష్టమైన మ్యూజిక్ ను వినడానికి అనుమతిస్తుంది. మరోవైపు, ఈ కారు యజమానులు కూడా ఇతర ఉపకరణాలు వారికి నచ్చినట్లుగా ఎంచుకోవడం మరియు వారికి అనుగుణంగా కారులో అనుకూలీకరించుకోవచ్చు.

వీల్స్ పరిమాణం:


దీని యొక్క అద్భుతమైన వీల్ ఆర్చులు 15- అంగుళాల ఆకర్షణీయమైనఅల్లాయ్ వీల్స్ సమితితో బిగించబడి ఉంటాయి. ఇవి సైడ్ ప్రొఫైల్ కి ఒక మంచి ఆకర్షణీయమైన లుక్ ని అందిస్తాయి. ఈ రిమ్స్ 195/65R15 పరిమాణం గల రేడియల్ ట్యూబ్ లెస్ టైర్లతో కప్పబడి ఉంటాయి. ఇది మరింతగా ఉన్నత స్థాయి భద్రత భరోసాతో పాటు రోడ్లపై అద్భుతమైన పట్టును అందిస్తాయి. అంతేకాకుండా, దీనిలో ముఖ్యమైన టూల్స్ తో పాటు బూట్ కంపార్ట్మెంట్ లోపల పూర్తి పరిమాణం గల ఒక అదనపు వీల్ ను ఉంచారు. ఈ టూల్స్ టైర్ ను మార్చడంలో ఉపయోగపడతాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ సెడాన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ మరియు పునరుత్పత్తి విధులను కలిగిన ఒక హైడ్రాలిక్ బ్రేకింగ్ వ్యవస్థతో ఇమిడి ఉంటుంది. దీని ముందు చక్రాలు, వెంటిలేషన్ డిస్క్ బ్రేక్లతో ఒక బలమైన సెట్ తో బిగించబడి ఉంటాయి. అయితే వెనుక వీల్స్ మాత్రం సాలిడ్ డిస్క్ బ్రేక్ల సమితితో బిగించబడి ఉంటాయి. ఇంకా ఇది నైపుణ్యం కలిగిన సస్పెన్షన్ సిస్టమ్ తో వస్తుంది. ఇది వాహనాన్ని అన్ని వేళలా స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని ముందు ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ తో మరియు వెనక టోరిసన్ బీమ్ తో బిగించబడి ఉంటుంది. ఇవి మరింతగా, గ్యాస్ ఫిల్డ్ షాక్అబ్జార్బర్స్ తో మరియు ఒక స్టెబిలైజర్ బార్ తో లోడ్ చేయబడతాయి. ఇవి అసమానంగా ఉండే రోడ్లలో కూడా గట్టి పటుత్వాన్ని అందిస్తాయి. వీటితోపాటు, ఇది ఒక శక్తి సహాయక స్టీరింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఇది భారీ ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా సులభంగా వెళ్లేలా చేస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ మోడల్ సిరీస్ లో అనేక భద్రతా లక్షణాలు ఉన్నాయి. ఇవి దాని ప్రయాణికులకు ఉన్నత స్థాయి రక్షణను నిర్ధారిస్తాయి. ఇది ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు యాంటి లాక్ బ్రేకింగ్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ ఏ రోడ్ల పరిస్థితులలో అయినా సరే ఒక స్థిరమైన బ్రేకింగ్ ప్రదర్శనను ఇవ్వడం లో సహాయపడుతుంది మరియు కారును జారిపోకుండా నిరోధిస్తుంది. ఇది వాహన స్థిరత్వం మరియు ట్రాక్షన్ నియంత్రణ వ్యవస్థల వంటి ఇతర అధునాతన లక్షణాలను కలిగి ఉంది. ఇవి వాహనానికి అద్భుతమైన నియంత్రణ మరియు స్థిరత్వాన్ని అందించడంలో సహయపడతాయి. ఇది డ్యుయల్ ఫ్రంట్ ఎస్ ఆర్ ఎస్ (అనుబంధ నిర్బంధాల వ్యవస్థ) ఎయిర్ బ్యాగ్స్ తో వస్తుంది. ప్రక్కభాగంలో ,కర్టెయిన్స్ కి మరియు డ్రైవర్ మోకాలి దగ్గర కూడా ఎయిర్ బ్యాగ్స్ తో అందించబడుతుంది. ఇవి ఏదైనా ఢీకొన్న సందర్భంలో దాని ప్రయాణికులను ఎలాంటి గాయాలు కాకుండా నివారించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. మరొక లక్షణం ఏమిటనగా ముందు సీట్లు సంఘటిత క్రియాశీల హెడ్ రెస్టులను కలిగి ఉండడం. ఇది ముఖ్యంగా వీపుకి మరియు మెడ మీద ఎలాంటిప్రభావం పడకుండా ఇంకా వెనక భాగంలో ఏవైనా ప్రమాదాలు జరిగినపుడు ప్రయాణికులను సంరక్షిస్తాయి. ఈ వాహన తయారీదారుడు దీనిని క్రాష్ భద్రత కలిగిన దృఢమైన బాడీ నిర్మాణంతో నిర్మించాడు. ఇది ముందు మరియు వెనుక భాగాలలో క్రంపుల్ జోన్స్ ను కలిగి ఉంటుంది. అందువలన, ఈ అంశాలు అన్ని కలిసి రైడ్ ను చాలా సురక్షితం చేస్తాయి మరియు వాహనం యొక్క భద్రతను కూడా నిర్ధారిస్తాయి.

అనుకూలాలు:


1. ఆధునిక హైబ్రిడ్ వ్యవస్థ ఒక ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.
2. అద్వితీయమైన బాహ్య రూపంతోఅనేక ఆకర్షణీయమైన అంశాలు దీనిలో ఉన్నాయి.
3. ఇంధన వ్యవస్థ బాగా ఆకట్టుకుంటుంది.
4. పుష్కలమైన లెగ్ మరియు హెడ్ స్పేస్ అందించబడుతుంది.
5. దీని యొక్క ఇంజన్ ప్రదర్శన చాలా యోగ్యకరంగా ఉంది.

ప్రతికూలాలు:


1. దాని లోపలి లుక్ మరింత ఆకర్షణీయంగా తయారు చేయవలసి ఉంది.
2. భద్రత ప్రమాణాలు మెరుగుపరచవలసిన అవసరం ఉంది.
3. నావిగేషన్ సిస్టమ్ లేకపోవడం ఒక మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు.
4. మరిన్ని వినూత్న సౌకర్యవంతమైన లక్షణాలను జోడించవలసిన అవసరం ఉంది.
5. తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం కూడా దాని ప్రధాన ప్రతిబంధకాలలో ఒకటి.